ఈ ఈగలతో మరింత మెరుగైన డ్రోన్లు | Using static electricity, RoboBees can land and stick to surfaces | Sakshi
Sakshi News home page

ఈ ఈగలతో మరింత మెరుగైన డ్రోన్లు

Published Sat, May 21 2016 12:48 PM | Last Updated on Mon, Sep 4 2017 12:37 AM

ఈ ఈగలతో మరింత మెరుగైన డ్రోన్లు

ఈ ఈగలతో మరింత మెరుగైన డ్రోన్లు

న్యూయార్క్: ప్రకృతిలోని జీవుల నుంచి స్ఫూర్తి పొందిన శాస్త్రవేత్తలు ఎగిరే రోబోలను తయారు చేశారు. చూడ్డానికి చాలా చిన్నగా ఉండే ఈ సూక్ష్మ రోబోలను ‘రోబో ఈగ’లుగా పిలుస్తున్నారు. మరి ఇంత చిన్నరోబోలు దేనికి ఉపయోగపడతాయనే ప్రశ్నకు శాస్త్రవేత్తల నుంచి ఎన్నో సమాధానాలు వస్తున్నాయి.

ముఖ్యంగా భవిష్యత్తులో మరింత మెరుగైన డ్రోన్లను రూపొందించేందుకు ఈ రోబో ఈగలు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు. ఇప్పటిదాకా ఒకచోటు నుంచి మరో చోటుకు దూసుకుపోయే డ్రోన్లను మాత్రమే రూపొందించారు. గాలిలో నిశ్చలంగా ఎక్కువసేపు నిలిచే సామర్థ్యం వీటికి తక్కువ. అయితే డ్రోన్లను గాలిలో కొంతకాలంపాటు నిశ్చలంగా ఉండేలా చేసేందుకు ఈ బుల్లి రోబో ఈగలు ఉపయోగపడతాయంటున్నారు హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement