యూఎస్‌లో బెస్ట్ బిజినెస్ స్కూల్స్ ఇవే..
వాషింగ్టన్: మార్కెట్‌లో ఎన్ని కోర్సులున్నా మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ)కు ఉన్న క్రేజ్ వేరే. కోర్సు సమయంలో ఇంటర్న్‌షిప్ అవకాశాలతో పాటు.. అనంతరం మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు సాధించాలనుకునే వారు సాధారణంగానే ఈ కోర్సు వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే యూఎస్‌లోని టాప్ బిజినెస్ స్కూల్స్‌లో ఈ కోర్సు కాస్త వ్యయంతో కూడుకున్నదనే విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరముంది.
బ్లూమ్‌బర్గ్ బిజినెస్ వీక్ ఇటీవల ఫుల్ టైం ఎంబీఏ కోర్సును అందిస్తున్న అమెరికాలోని ఉత్తమ బిజినెస్ స్కూళ్ల జాబితా-2016ను విడుదల చేసింది. ఈ జాబితాలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ మొదటి స్థానంలో నిలువగా.. స్టాన్‌ఫోర్డ్ రెండో స్థానం దక్కించుకుంది. బిజినెస్ స్కూళ్ల పూర్వ విద్యార్థుల అనుభవాలు, కోర్సు పూర్తయిన తరువాత ఉద్యోగాలు పొందుతున్న సరళి, ట్యూషన్ ఫీజులు, ఇంటర్న్‌షిప్ అవకాశాలు లాంటి విస్తృతమైన సమాచారంతో ఈ ర్యాంకులను రూపొందించినట్లు బ్లూమ్‌బర్గ్ బిజినెస్ వీక్ వెల్లడించింది.
ఈ జాబితాలో టాప్ 20లో నిలిచిన యూఎస్‌లోని ఉత్తమ బిజినెస్ స్కూళ్లు ఇవే..
1. హార్వర్డ్ బిజినెస్ స్కూల్
2. స్టాన్‌ఫోర్డ్
3. డ్యూక్
4. చికాగో(బూత్)
5. డర్ట్మోత్
6. పెన్సిల్వేనియా(వార్టన్)
7. ఎమ్‌ఐటీ
8. రైస్(జోన్స్)
9. నార్త్ వెస్టర్న్ (కెల్లాగ్)
10. యూసీ బర్క్‌లీ(హాస్)
11. కొలంబియా
12. వర్జీనియా
13. మిచిగాన్(రాస్)
14. యేల్
15. కార్నేగి మిలాన్(టెప్పర్)
16. కార్నెల్(జాన్సన్)
17. ఎన్‌వైయూ(స్టెర్న్)
18. టెక్సాస్(మేస్)
19. వాషింగ్టన్(ఫాస్టర్)
20. ఎమోరి(గొయ్‌జుటా)