Stanford
-
యూఎస్‌లో బెస్ట్ బిజినెస్ స్కూల్స్ ఇవే..
వాషింగ్టన్: మార్కెట్లో ఎన్ని కోర్సులున్నా మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ)కు ఉన్న క్రేజ్ వేరే. కోర్సు సమయంలో ఇంటర్న్‌షిప్ అవకాశాలతో పాటు.. అనంతరం మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు సాధించాలనుకునే వారు సాధారణంగానే ఈ కోర్సు వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే యూఎస్‌లోని టాప్ బిజినెస్ స్కూల్స్‌లో ఈ కోర్సు కాస్త వ్యయంతో కూడుకున్నదనే విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరముంది. బ్లూమ్‌బర్గ్ బిజినెస్ వీక్ ఇటీవల ఫుల్ టైం ఎంబీఏ కోర్సును అందిస్తున్న అమెరికాలోని ఉత్తమ బిజినెస్ స్కూళ్ల జాబితా-2016ను విడుదల చేసింది. ఈ జాబితాలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ మొదటి స్థానంలో నిలువగా.. స్టాన్ఫోర్డ్ రెండో స్థానం దక్కించుకుంది. బిజినెస్ స్కూళ్ల పూర్వ విద్యార్థుల అనుభవాలు, కోర్సు పూర్తయిన తరువాత ఉద్యోగాలు పొందుతున్న సరళి, ట్యూషన్ ఫీజులు, ఇంటర్న్‌షిప్ అవకాశాలు లాంటి విస్తృతమైన సమాచారంతో ఈ ర్యాంకులను రూపొందించినట్లు బ్లూమ్‌బర్గ్ బిజినెస్ వీక్ వెల్లడించింది. ఈ జాబితాలో టాప్ 20లో నిలిచిన యూఎస్‌లోని ఉత్తమ బిజినెస్ స్కూళ్లు ఇవే.. 1. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ 2. స్టాన్ఫోర్డ్ 3. డ్యూక్ 4. చికాగో(బూత్) 5. డర్ట్మోత్ 6. పెన్సిల్వేనియా(వార్టన్) 7. ఎమ్ఐటీ 8. రైస్(జోన్స్) 9. నార్త్ వెస్టర్న్ (కెల్లాగ్) 10. యూసీ బర్క్లీ(హాస్) 11. కొలంబియా 12. వర్జీనియా 13. మిచిగాన్(రాస్) 14. యేల్ 15. కార్నేగి మిలాన్(టెప్పర్) 16. కార్నెల్(జాన్సన్) 17. ఎన్‌వైయూ(స్టెర్న్) 18. టెక్సాస్(మేస్) 19. వాషింగ్టన్(ఫాస్టర్) 20. ఎమోరి(గొయ్జుటా) -
నిశ్చింతగా నారింజ తినవచ్చు...
నారింజపండు కాస్త పుల్లగా ఉంటుంది. కాబట్టి దీన్ని తినడం వల్ల పుల్ల తేన్పులతో కనిపించే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ) వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయని కొందరు ఈ పండు తినరు. కానీ స్టాన్ఫోర్డ్ సంస్థ అధ్యయనం ప్రకారం ఈ విషయానికి తగిన ఆధారాలు దొరకలేదు. కాబట్టి పులితేన్పులను ఈ పండు ఎక్కువ చేస్తుందనే అపోహ వీడి హాయిగా తినవచ్చు. ఇక నారింజలో పీచు కూడా ఎక్కువే. అయితే దీన్ని పండుగా తింటేనే పీచు మనకు లభ్యమవుతుంది. అయితే జ్యూస్ తీసినప్పుడు పీచును చాలావరకు కోల్పోయే అవకాశాం ఉంది. కాబట్టి దీన్ని పండుగా తినడమే మంచిది. అదీగాక మిగతా పండ్లలో ఉండే చక్కెర వేగంగా విడుదల అవుతుందేమోగాని... నారింజ పండు తిన్నవారిలో దీనివల్ల లభ్యమయ్యే చక్కెర చాలా మెల్లగా శరీరంలోకి విడుదల అవుతుంది. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అందుకే చక్కెరవ్యాధి గ్రస్తులు సైతం నిరభ్యంతరంగా దీన్ని తినవచ్చు. వాళ్లకూ ఇది సురక్షితమైన పండు అని చెప్పవచ్చు. -
ఐఐటీ మద్రాసే ఇండియా స్టాన్ ఫోర్ఢ్
దేశంలో అనేక విఙ్నాన పరిశోధనలకు ఇప్పుడు ఐఐటీ మద్రాస్ బాటలు వేస్తోంది. ఈ-కామర్స్, ఈ-మార్కెటింగ్ రంగాల్లో దిగ్గజాలను గమనించినట్లైతే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. అదేంటంటే ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, జొమాలో, క్వికర్, ఓలా లేదా హౌసింగ్ రంగాల్లోని దిగ్గజాలందరూ ఐఐటీ ఢిల్లీలోగానీ, లేదా ఐఐటీ ముంబైలో గానీ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అయితే స్టాన్ ఫోర్డ్ లాంటి యూనివర్శిటీలు వందల్లో ఇంజనీర్లను తయారుచేస్తున్నాయి. అయిదేళ్ల క్రితం వరకు టెక్నాలజీ, అకడమిక్ టీచింగ్ లో కొన్ని సంవత్సరాలపాటు వాటి హవా నడిచింది. అయితే ఇటీవల ఐఐటీ మద్రాస్ రీసెర్చ్ పార్క్ ప్రొఫెసర్లు అశోక్ ఝుంఝుంవాలా, ఎంఎస్ అనంత్ ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. అదేంటంటే తరగతి గదుల్లో విద్యార్థులకు, ప్రొఫెసర్లకు మధ్య సఖ్యతను పెంపొందించడం. ఈ విషయాన్ని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ భాస్కర్ రామ్మూర్తి తెలియజేస్తూ....మా విద్యార్థులు, ప్రొఫెసర్లు కలిసి పనిచేస్తే ఆర్ అండ్ డీ విభాగం తప్పకుండా అభివృద్ధి బాటలో నడుస్తుంది అని అన్నారు. సృజనాత్మక ఆలోచనలు.... ధ్వనితరంగాల నియంత్రణలో విజయం సాధించాలంటే ప్రతిఒక్కరూ కలిసిరావాలి. వర్టెక్స్ ఇంజనీరింగ్ లో ఏటీఎం టెక్నాలజీని ఉపయోగించి ధ్వని తరంగాలను నియంత్రించవచ్చు. ఈ ఎకో టెక్నాలజీని వర్టెక్స్ కంపెనీ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రశంసిస్తూ....మా కంపెనీ ఏసీ అవసరం లేకుండా పనిచేసే ఏటీఎంలు, ఎంఎన్ ఆర్ ఈజీఏ లోని ఏటీఎంలకు ఉపయోగపడేలా వ్యాపారాత్మక సోలార్ సిస్టమ్ ను ఉత్పత్తి చేస్తోందన్నారు. యూనిక్ మోడల్... ఐఐటీ ముంబై భారతీయ సాంప్రదాయాలకు విరుద్ధంగా ఈ కొత్త విధానాన్ని రూపొందించారు. ఐఐటీ ముంబై డైరెక్టర్ రామమూర్తి మాట్లాడుతూ...క్రెడిట్ సిస్టమ్ ద్వారా వినియోగదారుల సహకారంతో రీసెర్చ్ పార్క్ ఒక్కటే సరైంది. ఏంజిల్ ప్రైమ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీపతి ఆచార్య మాట్లాడుతూ...రీసెర్చ్ పార్క్ లోని స్టార్టప్స్‌ను అనేకరకాలుగా ఉపయోగించుకోవచ్చన్నారు. ఇతర కంపెనీలు కూడా ఈ మోడల్ ను అనుకరిస్తుండటమే ఐఐటీ ముంబై మోడల్ విజయవంతమైందనడానికి కారణంమని ఐఐటీ ముంబై డైరెక్టర్ దేవాంగ్ ఖతార్ తెలిపారు.