దేశంలో అనేక విఙ్నాన పరిశోధనలకు ఇప్పుడు ఐఐటీ మద్రాస్ బాటలు వేస్తోంది. ఈ-కామర్స్, ఈ-మార్కెటింగ్ రంగాల్లో దిగ్గజాలను గమనించినట్లైతే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. అదేంటంటే ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, జొమాలో, క్వికర్, ఓలా లేదా హౌసింగ్ రంగాల్లోని దిగ్గజాలందరూ ఐఐటీ ఢిల్లీలోగానీ, లేదా ఐఐటీ ముంబైలో గానీ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అయితే స్టాన్ ఫోర్డ్ లాంటి యూనివర్శిటీలు వందల్లో ఇంజనీర్లను తయారుచేస్తున్నాయి. అయిదేళ్ల క్రితం వరకు టెక్నాలజీ, అకడమిక్ టీచింగ్ లో కొన్ని సంవత్సరాలపాటు వాటి హవా నడిచింది. అయితే ఇటీవల ఐఐటీ మద్రాస్ రీసెర్చ్ పార్క్ ప్రొఫెసర్లు అశోక్ ఝుంఝుంవాలా, ఎంఎస్ అనంత్ ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. అదేంటంటే తరగతి గదుల్లో విద్యార్థులకు, ప్రొఫెసర్లకు మధ్య సఖ్యతను పెంపొందించడం.
ఈ విషయాన్ని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ భాస్కర్ రామ్మూర్తి తెలియజేస్తూ....మా విద్యార్థులు, ప్రొఫెసర్లు కలిసి పనిచేస్తే ఆర్ అండ్ డీ విభాగం తప్పకుండా అభివృద్ధి బాటలో నడుస్తుంది అని అన్నారు.
సృజనాత్మక ఆలోచనలు....
ధ్వనితరంగాల నియంత్రణలో విజయం సాధించాలంటే ప్రతిఒక్కరూ కలిసిరావాలి. వర్టెక్స్ ఇంజనీరింగ్ లో ఏటీఎం టెక్నాలజీని ఉపయోగించి ధ్వని తరంగాలను నియంత్రించవచ్చు. ఈ ఎకో టెక్నాలజీని వర్టెక్స్ కంపెనీ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రశంసిస్తూ....మా కంపెనీ ఏసీ అవసరం లేకుండా పనిచేసే ఏటీఎంలు, ఎంఎన్ ఆర్ ఈజీఏ లోని ఏటీఎంలకు ఉపయోగపడేలా వ్యాపారాత్మక సోలార్ సిస్టమ్ ను ఉత్పత్తి చేస్తోందన్నారు.
యూనిక్ మోడల్...
ఐఐటీ ముంబై భారతీయ సాంప్రదాయాలకు విరుద్ధంగా ఈ కొత్త విధానాన్ని రూపొందించారు. ఐఐటీ ముంబై డైరెక్టర్ రామమూర్తి మాట్లాడుతూ...క్రెడిట్ సిస్టమ్ ద్వారా వినియోగదారుల సహకారంతో రీసెర్చ్ పార్క్ ఒక్కటే సరైంది. ఏంజిల్ ప్రైమ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీపతి ఆచార్య మాట్లాడుతూ...రీసెర్చ్ పార్క్ లోని స్టార్టప్స్ను అనేకరకాలుగా ఉపయోగించుకోవచ్చన్నారు. ఇతర కంపెనీలు కూడా ఈ మోడల్ ను అనుకరిస్తుండటమే ఐఐటీ ముంబై మోడల్ విజయవంతమైందనడానికి కారణంమని ఐఐటీ ముంబై డైరెక్టర్ దేవాంగ్ ఖతార్ తెలిపారు.
ఐఐటీ మద్రాసే ఇండియా స్టాన్ ఫోర్ఢ్
Published Fri, Mar 20 2015 11:00 AM | Last Updated on Sat, Sep 2 2017 11:09 PM
Advertisement