IIT-Madras
-
ఇస్రో చైర్మన్ కల నెరవేరిన వేళ.. ఇకపై డాక్టర్ సోమనాథ్
గతేడాది ఆగస్టు 23న చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపిన సమయంలోనూ ఆయన అంత సంతోష పడలేదేమో, చంద్రయాన్-3 సక్సెస్‌తో దేశ విదేశాల నుంచి పొగడ్తలు అందుకున్నప్పుడు కూడా ఆయన ఇంత ఆనందంగా లేరేమో.. ఆయన ఎవరో కాదు.. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్.. ఇప్పుడు ఆయన గురించి ఎందుకంటే.. ఇన్నెళ్లకు సోమనాథ్ తన కల నెరవేర్చుకున్నారట.ఐఐటీ మద్రాస్ 61వ కన్వోకేషన్ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ అక్కడ మెరిశారు. అతిథిగా అనుకునేరు.. కానే కాదు..61 ఏళ్ల వయసులో ఆయన తన పీహెచ్డీ పట్టా అందుకున్నారు. ప్రస్తుతం ఆయన చంద్రుడిపై కాలు మోపినం సంతోషంలో ఉన్నారు. యూనివర్సిటీ అధికారుల నుంచి డాక్టరేట్ పొందుతున్న సమయంలో ఆయన ముఖంలో మెరిసిన ప్రకాశవంతమైన చిరునవ్వు ఆ విషయాన్ని చెప్పకనే చెబుతోంది. డాక్టరేట్ అందుకున్న తర్వాత సోమనాథ్ మాట్లాడుతూ.. ‘‘నాది గ్రామీణ నేపథ్యం. క్లాస్‌లో టాపర్‌ని. అయినా కూడా ఐఐటీ ఎంట్రన్స్ రాయాలనే ధైర్యం ఏనాడూ చేయలేకపోయా. కానీ, ఏదో ఒకనాడు ఇక్కడి నుంచి పట్టా పొందాలని మాత్రం కల గన్నా. నా మాస్టర్ డిగ్రీ బెంగళూరు ఐఐఎస్ నుంచి తీసుకున్నా. ఇప్పుడు పీహెచ్డీ ఐఐటీ మద్రాస్ నుంచి తీసుకోవడం గౌరవంగా ఉంది.పీహెచ్డీ అనేది కష్టమైంది. అదీ మద్రాస్ ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల నుంచి డిగ్రీ పొందడం ఇంకా కష్టం. నాది సుదీర్ఘమైన ప్రయాణం. ఎన్నో ఏళ్ల కింద రిజిస్టర్ చేయించుకున్నా. వైబ్రేషన్ ఐసోలేటర్స్.. నా మనసుకి దగ్గరైన టాపిక్. 35 ఏళ్ల నా కష్టానికి దక్కిన ఫలితం ఇది. ఇన్నేళ్ల నా శ్రమను పీహెచ్డీ కిందకు మార్చుకున్నా.’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇక ఇప్పటి నుంచి డాక్టర్ సోమనాథ్ అన్నమాట. -
ఐఐటీ–మద్రాస్ అత్యుత్తమం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అత్యుత్తుమ విద్యా సంస్థల జాబితాలో ఐఐటీ–మద్రాస్ వరసగా నాలుగో ఏడాది తొలి స్థానంలో నిలిచింది. ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)–బెంగళూరు తొలి స్థానం దక్కించుకుంది. ఫార్మసీ విభాగంలో నైపర్–హైదరాబాద్ రెండో ర్యాంకు, న్యాయ విద్యలో హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా నాలుగో ర్యాంకు సాధించాయి. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) కింద 11 విభాగాల్లో ర్యాంకుల జాబితాను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం విడుదల చేశారు. 2016 నుంచి కేంద్ర విద్యా శాఖ ఈ ర్యాంకులను ప్రకటిస్తోంది. విశ్వవిద్యాలయాల విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీకి 22వ ర్యాంకు, ఆంధ్ర యూనివర్సిటీ 36వ ర్యాంకు లభించింది. టాప్–100 ఇంజనీరింగ్ కాలేజీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 9 కాలేజీలున్నాయి. టాప్–100 ఫార్మసీ కాలేజీల్లో రెండు రాష్ట్రాలకు చెందిన 15 కాలేజీలున్నాయి. పరిశోధన విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ 12వ ర్యాంకు సాధించింది. మెడికల్ విభాగంలో 50 ర్యాంకులు ప్రకటించగా తెలంగాణ, ఏపీలోని కళాశాలలకు స్థానం దక్కలేదు. ఓవరాల్ ర్యాంకింగ్ ఐఐటీ–మద్రాస్ (87.59 స్కోరు) తొలిస్థానంలో నిలవగా, 83.57 స్కోరుతో ఐఐఎస్సీ–బెంగళూరు రెండోస్థానంలో 82.35 స్కోరుతో ఐఐటీ–బాంబే మూడో స్థానంలో నిలిచాయి. ఐఐటీ–హైదరాబాద్ 62.86 స్కోరుతో 14వ ర్యాంకు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 59.67 స్కోరుతో 20వ ర్యాంకు, ఎన్ఐటీ–వరంగల్ 50.61 స్కోరుతో 45వ ర్యాంకు, ఉస్మానియా యూనివర్సిటీ 50.60 స్కోరుతో 46వ ర్యాంకు సాధించాయి. కాలేజీల విభాగంలో ఆంధ్రా లయోలా కాలేజ్ (విజయవాడ) 52.38 స్కోరుతో 94వ ర్యాంకు సాధించింది. ఇంజినీరింగ్ ఐఐటీ మద్రాస్ 90.94 స్కోరుతో తొలిస్థానం, ఐఐటీ న్యూఢిల్లీ 88.12 స్కోరుతో రెండో స్థానం, ఐఐటీ బాంబే 83.96 స్కోరుతో మూడో స్థానంలో నిలిచాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐఐటీ హైదరాబాద్ 68.03 స్కోరుతో తొమ్మిదో స్థానం, ఎన్ఐటీ వరంగల్ 60 స్కోరుతో 21వ ర్యాంకు, కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ 44వ ర్యాంకు, ఐఐటీ తిరుపతి 48.16 స్కోరుతో 56వ ర్యాంకు, ఐఐఐటీ–హైదరాబాద్ 46.41 స్కోరుతో 62వ ర్యాంకు, జేఎన్టీయూ–హైదరాబాద్ 42.77 స్కోరుతో 76వ ర్యాంకు సాధించాయి. మేనేజ్మెంట్ ఐఐఎం–అహ్మదాబాద్ 83.35 స్కోరుతో తొలి ర్యాంకు, ఐఐఎం–బెంగళూరు 82.62 స్కోరుతో 2వ ర్యాంకు, ఐఐఎం–కలకత్తా 78.64 స్కోరుతో మూడో ర్యాంకు సాధించాయి. ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్–హైదరాబాద్ 54.88 స్కోరుతో 32వ ర్యాంకు, ఐఐఎం–విశాఖపట్నం 54.36 స్కోరుతో 33వ ర్యాంకు, కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 51.27 స్కోరుతో 47వ ర్యాంకు సాధించాయి. ఫార్మసీ జామియా హమ్దర్ద్–న్యూఢిల్లీ 79.50 స్కోరుతో తొలి ర్యాంకు, నైపర్–హైదరాబాద్ 79.46 స్కోరుతో రెండో ర్యాంకు సాధించగా, హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ 47.38 స్కోరుతో 44వ ర్యాంకు సాధించింది. -
తమిళనాడులో దాడి, ఖండించిన కేరళ సీఎం
మద్రాస్–ఐఐటీలో బీఫ్ విందు ఇచ్చిన విద్యార్థిపై దాడి తిరువొత్తియూరు (చెన్నై): మద్రాస్–ఐఐటీలో బీఫ్ విందు ఏర్పాటు చేసిన విద్యార్థిపై కొందరు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశువధ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ 80 మంది విద్యార్థులు ఆదివారం రాత్రి బీఫ్ బిరియాని తిన్నారు. ఐఐటీలో పీహెచ్డీ చేస్తున్న విద్యార్థి సూరజ్ ఈ విందు ఏర్పాటు చేసినట్లు తెలుసుకున్న ఐఐటీలోని మరో వర్గం అతనిపై సోమవారం దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన సూరజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు కంటి చూపు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని మద్రాస్–ఐఐటీ అధికార ప్రతినిధి తెలిపారు. సూరజ్‌పై దాడిని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ్ ఖండించారు. దాడి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పశువులను వధ కోసం అమ్మకుండా, కొనకుండా కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోమని కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. -
మద్రాస్ ఐఐటీలో మరో ఆత్మహత్య!
చెన్నై: మద్రాస్ ఐఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బీ టెక్ (ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్) ఫైనల్ ఇయర్ చదువుతున్న రాహుల్ జీ ప్రసాద్ సోమవారం తనువు చాలించాడు. గంగా హాస్టల్ మూడో అంతస్తులో ఉంటున్న అతను తన గదిలో సీలింగ్‌కు ఉరి వేసుకొని కనిపించాడు. అయితే ఆత్మహత్య లేఖ లాంటిది ఏమీ దొరకలేదు. మృతుడి స్వస్థలం కేరళలోని కొల్లాం. అతని తల్లిదండ్రులు సాయంత్రానికి ఐఐటీకి చేరుకునే అవకాశముంది. గత నెలలో మద్రాస్ ఐఐటీలో చదువుతున్న వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన నాగేంద్ర రెడ్డి (23) ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోకపోవడం వల్ల ఒత్తిడితో నాగేంద్ర ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. మరో విద్యార్థి మృతి పట్ల ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. విద్యార్థి మృతికి కారణాలు ఏమిటన్నది తెలియరాలేదని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ వృత్తి నిపుణులను అందిస్తున్న జాతీయస్థాయి సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ (ఐఐటీ). ఇలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదువుతున్న 68 మంది విద్యార్థులు గత మూడు దశాబ్దాల్లో ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఐఐటీల్లో జరుగుతున్న ఈ ఆత్మహత్యలపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ముట్టడి
మద్రాసు ఐఐటీలోని అంబేద్కర్-పెరియార్ విద్యార్థి సంఘం గుర్తింపు రద్దు వ్యవహారం రాష్ట్రంలో విద్యార్థి సంఘాల ఆందోళనకు తెరతీసింది. ఇప్పటికే అనేక సంఘాలు ఆందోళన బాటపట్టగా, డీఎంకే, విడుదలై చిరుతైగళ్ కట్చి వేర్వేరుగా సోమవారం పోరాటాలకు దిగాయి. చెన్నై, సాక్షి ప్రతినిధి: మద్రాసు ఐఐటీలో అనేక రాష్ట్రాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు ఉన్నతవిద్య అభ్యసిస్తున్నారు. వీరి సంఖ్యకు తగినట్లుగా అనేక విద్యార్థి సంఘాలు ఉన్నాయి. వీటిల్లో ఒకటైన అంబేద్కర్-పెరియార్ విద్యార్థి సంఘం గత నెల ఒక సమావేశాన్ని నిర్వహించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీ పరిపాలనా తీరును తప్పుపట్టింది. కరపత్రాలు ముద్రించి వ్యతిరేక ప్రచారం నిర్వహించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ విచారణ జరిపించి సదరు విద్యార్థి సంఘం గుర్తింపును రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై అనేక విద్యార్థి సంఘాలతోపాటూ వివిధ రాజకీయపార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. ఇందులో భాగంగా డీఎంకే విద్యార్థి విభాగం ఐఐటీ సమీపంలోని మధ్య కైలాష్ వద్ద ఉదయం 11 నుంచి ఆందోళన చేపట్టింది. అక్కడి నుంచి ఊరేగింపుగా ఐఐటీ వద్దకు చేరుకుని ముట్టడికి ప్రయత్నించాయి. అయితే పోలీసులు అడ్డుకుని 200 మందిని అరెస్ట్ చేశారు. తరువాత విడుదలై చిరుతైగళ్ కట్చి అధ్యక్షులు తిరుమావళవన్ నేతృత్వంలో మరో పోరాటం మొదలైంది. వీరుకూడా ఊరేగింపుగా ఐఐటీ వద్దకు చేరుకుని లోనికి చొరబడేందుకు ప్రయత్నించారు. 150 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుచ్చిరాపల్లి ప్రధాన బస్‌స్టేషన్ వద్ద వీసీకే నేతలు రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం రైల్వేస్టేషన్లో రైల్‌రోకోకు ప్రయత్నిం చారు. పోలీసులు రైల్వేస్టేషన్ ప్రవేశద్వారం వద్ద వారిని అరెస్ట్ చేశారు. తిరుచ్చిలో 200 మంది అరెస్టయ్యారు. -
మద్రాస్ ఐఐటీ వివాదాస్పద నిర్ణయం
చెన్నై: మద్రాస్ ఐఐటీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదస్సదమైంది. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, విధానాలను విమర్శించినందుకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘంపై నిషేధం విధించింది. నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారన్న ఆరోపణతో అంబేద్కర్ పెరియార్ స్టూడెంట్ సర్కిల్(ఏపీఎస్సీ)పై వేటు వేసింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు ఏపీఎస్సీపై నిషేధం విధించినట్టు మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ ప్రిస్కా మాథ్యూ లేఖ రాశారు. మోదీ సర్కారును, విధానాలను విమర్శిస్తూ ఏపీఎస్సీ పంచిన కరపత్రాలతో విద్యార్థులు హెచ్ ఆర్డీ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయడంతో ఈ చర్య తీసుకున్నట్టు లేఖలో పేర్కొన్నారు. అయితే ఆకాశరామన్న ఉత్తరాలతో తమపై నిషేధం విధించడం పట్ల ఏపీఎస్సీ నిరసన వ్యక్తం చేసింది. హిందూమత సంస్థలే తమపై ఫిర్యాదు చేశాయని ఆరోపించింది. -
ఐఐటీ మద్రాసే ఇండియా స్టాన్ ఫోర్ఢ్
దేశంలో అనేక విఙ్నాన పరిశోధనలకు ఇప్పుడు ఐఐటీ మద్రాస్ బాటలు వేస్తోంది. ఈ-కామర్స్, ఈ-మార్కెటింగ్ రంగాల్లో దిగ్గజాలను గమనించినట్లైతే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. అదేంటంటే ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, జొమాలో, క్వికర్, ఓలా లేదా హౌసింగ్ రంగాల్లోని దిగ్గజాలందరూ ఐఐటీ ఢిల్లీలోగానీ, లేదా ఐఐటీ ముంబైలో గానీ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అయితే స్టాన్ ఫోర్డ్ లాంటి యూనివర్శిటీలు వందల్లో ఇంజనీర్లను తయారుచేస్తున్నాయి. అయిదేళ్ల క్రితం వరకు టెక్నాలజీ, అకడమిక్ టీచింగ్ లో కొన్ని సంవత్సరాలపాటు వాటి హవా నడిచింది. అయితే ఇటీవల ఐఐటీ మద్రాస్ రీసెర్చ్ పార్క్ ప్రొఫెసర్లు అశోక్ ఝుంఝుంవాలా, ఎంఎస్ అనంత్ ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. అదేంటంటే తరగతి గదుల్లో విద్యార్థులకు, ప్రొఫెసర్లకు మధ్య సఖ్యతను పెంపొందించడం. ఈ విషయాన్ని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ భాస్కర్ రామ్మూర్తి తెలియజేస్తూ....మా విద్యార్థులు, ప్రొఫెసర్లు కలిసి పనిచేస్తే ఆర్ అండ్ డీ విభాగం తప్పకుండా అభివృద్ధి బాటలో నడుస్తుంది అని అన్నారు. సృజనాత్మక ఆలోచనలు.... ధ్వనితరంగాల నియంత్రణలో విజయం సాధించాలంటే ప్రతిఒక్కరూ కలిసిరావాలి. వర్టెక్స్ ఇంజనీరింగ్ లో ఏటీఎం టెక్నాలజీని ఉపయోగించి ధ్వని తరంగాలను నియంత్రించవచ్చు. ఈ ఎకో టెక్నాలజీని వర్టెక్స్ కంపెనీ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రశంసిస్తూ....మా కంపెనీ ఏసీ అవసరం లేకుండా పనిచేసే ఏటీఎంలు, ఎంఎన్ ఆర్ ఈజీఏ లోని ఏటీఎంలకు ఉపయోగపడేలా వ్యాపారాత్మక సోలార్ సిస్టమ్ ను ఉత్పత్తి చేస్తోందన్నారు. యూనిక్ మోడల్... ఐఐటీ ముంబై భారతీయ సాంప్రదాయాలకు విరుద్ధంగా ఈ కొత్త విధానాన్ని రూపొందించారు. ఐఐటీ ముంబై డైరెక్టర్ రామమూర్తి మాట్లాడుతూ...క్రెడిట్ సిస్టమ్ ద్వారా వినియోగదారుల సహకారంతో రీసెర్చ్ పార్క్ ఒక్కటే సరైంది. ఏంజిల్ ప్రైమ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీపతి ఆచార్య మాట్లాడుతూ...రీసెర్చ్ పార్క్ లోని స్టార్టప్స్‌ను అనేకరకాలుగా ఉపయోగించుకోవచ్చన్నారు. ఇతర కంపెనీలు కూడా ఈ మోడల్ ను అనుకరిస్తుండటమే ఐఐటీ ముంబై మోడల్ విజయవంతమైందనడానికి కారణంమని ఐఐటీ ముంబై డైరెక్టర్ దేవాంగ్ ఖతార్ తెలిపారు. -
దృక్పథం మారాలి.. విస్తృతంగా ఆలోచించాలి..
‘దేశంలో మేనేజ్మెంట్ ఔత్సాహికుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఆయా ఇన్స్టిట్యూట్లలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలకు లక్షల సంఖ్యలో విద్యార్థులు హాజరవుతున్నారు. విద్యార్థులు కెరీర్ క్రేజ్ కోణంలోనే కాకుండా.. వాస్తవ నైపుణ్యాలు పొందే లక్ష్యంతో అడుగుపెడితేనే ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుంది’ అని అంటున్నారు ఐఐటీ-మద్రాస్‌లోని డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ డీన్ ప్రొఫెసర్ ఎల్.ఎస్.గణేశ్. 1977లో బిట్స్ పిలానీలో బీటెక్, 1986లో ఐఐటీ - మద్రాస్‌లో పీహెచ్డీ చేసి.. ఐఐఎం-బెంగళూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెరీర్ ప్రారంభించి.. తర్వాత ఐఐటీ-మద్రాస్‌లో డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ సెంటర్ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. దేశవ్యాప్తంగా ఐఐఎంలు వంటి ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్స్‌లో ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో.. మేనేజ్మెంట్ విద్య ఔత్సాహికులు అకడమిక్స్‌తోపాటు మరెన్నో అంశాలపై అవగాహన పొందాలని సూచిస్తున్నప్రొఫెసర్ ఎల్.ఎస్.గణేశ్‌తో ఇంటర్వ్యూ.. ముందుగా.. 4ఉట ఎంతో ముఖ్యం మేనేజ్మెంట్ విద్య ఔత్సాహికులు ఆ కోర్సుల్లో ప్రవేశం కోసం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తీవ్ర పోటీని తట్టుకుని ఐఐఎంలు, ఐఐటీలు వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లలో అడుగుపెడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ.. ఆ తర్వాతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పటివరకు కేవలం పరీక్ష-ఉత్తీర్ణత కోణంలో విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు ఇక్కడి ప్రాక్టికల్ ఎన్విరాన్మెంట్ను త్వరగా ఆకళింపు చేసుకోలేకపోతున్నారు. అందుకే ఎలాంటి ఇన్స్టిట్యూట్ అయినా.. మేనేజ్మెంట్ విద్యార్థులకు వ్యక్తిగత అభిరుచి, ఆసక్తి ఉంటేనే ఈ రంగంలో అడుగుపెట్టాలి. బిజినెస్ మార్కెటింగ్‌లో 4Ps (Product, Price, Promotion, Place)కు ఎంత ప్రాధాన్యం ఉంటుందో.. మేనేజ్మెంట్ విద్యార్థులు తాము అకడమిక్‌గా రాణించే విషయంలో 4Es (Effectiveness, Efficiency, Excellence, Ethics)కు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే అన్ని రకాల నైపుణ్యాలు లభిస్తాయి. ఐఐటీల్లో ఎంబీఏ.. అదనపు ప్రయోజనం సాంకేతిక విద్యలో పేరు గడించిన ఐఐటీల్లో మేనేజ్మెంట్ కోర్సులను ప్రవేశ పెట్టడం వల్ల వీటిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేరనే అభిప్రాయాలు సరికాదు. వాస్తవ పరిస్థితుల్లో విశ్లేషిస్తే టెక్నికల్ ఇన్స్టిట్యూట్లలో మేనేజ్మెంట్ కోర్సులు చేయడం విద్యార్థులకు అదనపు ప్రయోజనంగా ఉపకరిస్తుంది. సదరు మేనేజ్మెంట్ విద్యార్థులు పలు సందర్భాల్లో ఇంజనీరింగ్ విద్యార్థులతో కలిసి కూడా కొన్ని ప్రాజెక్ట్స్, ప్రాక్టికల్స్ చేసే విధంగా ఐఐటీల్లో బోధన ఉంటోంది. దీంతో రెండు విభాగాల వారికీ ఇంటర్ డిసిప్లినరీ నైపుణ్యాలు లభిస్తున్నాయి. భవిష్యత్తులో ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా రాణించాలనుకునే ఇంజనీరింగ్ విద్యార్థులకు నిర్వహణపరమైన నైపుణ్యాలు, అదేవిధంగా మేనేజ్మెంట్ విద్యార్థులకు ఒక ఉత్పత్తి ప్రక్రియలో ఇమిడి ఉండే సాంకేతిక అంశాలపై అవగాహన లభిస్తుంది. ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ పెంచుకోవాలంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో స్కిల్స్ పెంచుకోవాలంటే.. విద్యార్థులు కోర్సులో అడుగుపెట్టిన తొలిరోజు నుంచే ఆ దిశగా ఆలోచించాలి. ఈ క్రమంలో మన సామాజిక పరిస్థితులపై, అవసరాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. తాజా మార్పులను గుర్తించాలి. ఏ రంగంలో పరిధి ఎక్కువ ఉందో గమనించాలి. అదే విధంగా ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ అనేవి కేవలం ఒక్క పుస్తకాల అభ్యసనంతోనే అలవడవు. వీటిని పెంచుకోవడానికి ప్రాక్టికల్ నైపుణ్యాలు అవసరం. ఇందుకోసం అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు ఐఐటీ-చెన్నైలో సి-టైడ్స్, ఈ-సెల్ వంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కేంద్రాలు ఉన్నాయి. ఇలాంటి సదుపాయాలు అన్ని ఐఐటీలు, ఐఐఎంలలో అందుబాటులో ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. తమ ఆలోచనలు వాస్తవరూపం దాల్చేందుకు ఉన్న అన్ని అవకాశాలను గుర్తించాలి. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో ఎంటర్ప్రెన్యూర్ ఔత్సాహికులు సామాజిక అవసరాలు తీర్చే స్టార్టప్స్ ఏర్పాటు దిశగా దృష్టి సారించాలి. దీనివల్ల సమాజానికి మేలు కలగడంతోపాటు, వ్యక్తిగత సంతృప్తి కూడా లభిస్తుంది. నెగోషియేషన్ స్కిల్స్ మేనేజ్మెంట్ కోర్సు విద్యార్థులు అకడమిక్‌గా, భవిష్యత్తులో ఉద్యోగ విధుల్లో రాణించేందుకు విస్తృతంగా దోహదపడే అంశం.. నెగోషియేషన్ స్కిల్స్. అప్పుడే ఆశించిన ఫలితాలు లభిస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎంబీఏ విద్యార్థులు అకడమిక్‌గా గ్రూప్ డిస్కషన్స్, కేస్ స్టడీస్ అనాలిసిస్ వంటి వాటిలో నిరంతరం పాల్పంచుకోవాలి. అదేవిధంగా సెమినార్లు, కాన్ఫరెన్స్‌లకు హాజరవడం, అక్కడ ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడే చొరవ వంటి వ్యక్తిగత నైపుణ్యాలు పెంచు కోవాలి. ఇంటర్న్షిప్స్.. ఇంపార్టెంట్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం ప్రాజెక్ట్ వర్క్ తప్పనిసరి. విద్యార్థులు అదనంగా ఇంటర్న్షిప్స్ చేస్తే మరింత ప్రయోజనం చేకూరుతుంది. ప్రాజెక్ట్ వర్క్ అనేది అభ్యర్థి తన అభిరుచి మేరకు ఎంచుకున్న అంశంలో మాత్రమే చేయడానికి వీలు కల్పిస్తుంది. ఉదాహరణకు ఫైనాన్స్ స్పెషలైజేషన్ అభ్యర్థి పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ను ప్రాజెక్ట్ వర్క్ సబ్జెక్ట్‌గా ఎంచుకుంటే.. ఆ అంశంపై మాత్రమే అవగాహన వస్తుంది. కానీ ఇంటర్న్‌షిప్‌తో బహుళ అంశాలపై అవగాహన లభిస్తుంది. ఇటీవల కాలంలో పలు సంస్థలు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తూ తమ వెబ్‌సైట్స్‌లో ప్రకటనలు కూడా విడుదల చేస్తున్నాయి. వీటిని సద్విని యోగం చేసుకోవాలి. సర్టిఫికెట్స్.. ఎంట్రీ పాస్‌లు మాత్రమే ప్రొఫెషనల్ కోర్సుల ఔత్సాహికులు ప్రధానంగా గుర్తించాల్సిన అంశం.. ఐఐటీలు, ఐఐఎంలైనా.. సాధారణ ఇన్స్టిట్యూట్ అయినా ప్రొఫెషనల్ కోర్సుల సర్టిఫికెట్లు సంబంధిత కెరీర్స్‌కు ఎంట్రీ పాస్‌ల వంటివే. అంటే.. భవిష్యత్తులో సమున్నత కెరీర్స్ సొంతం చేసుకునే క్రమంలో అవసరమైన ప్రాథమిక నైపుణ్యాలను అందిస్తాయి. దీనికి అదనంగా విద్యార్థులు వ్యక్తిగతంగా చేయాల్సిన కృషి ఎంతో ఉంటుంది. ప్రాక్టికల్ అప్రోచ్, క్రిటికల్ థింకింగ్, కంపేరిటివ్ అప్రోచ్, సోషల్ అవేర్నెస్, ఆటిట్యూడ్, ఆప్టిట్యూడ్ వంటి ఎన్నో అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు అకడమిక్ నైపుణ్యాలు సొంతం చేసుకుంటూనే సదరు అంశానికి సంబంధించి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయాలి. అప్పుడే పోటీలో ఇతరుల కంటే ముందంజలో నిలవగలుగుతారు. వ్యక్తిగత ఆసక్తి, అభిరుచి ముఖ్యం విద్యార్థులు, తల్లిదండ్రులకు నా సలహా.. ఇంజనీరింగ్ కోర్సు అంటే కేరాఫ్ ఐఐటీలు, మేనేజ్మెంట్ కోర్సులకు చిరునామాగా ఐఐఎంలు నిలుస్తున్నాయి. ఇందులో సందేహం లేదు. కారణం.. ఇక్కడి బోధన, ఇతర మౌలిక సదుపాయాలు. కానీ ఔత్సాహికులందరూ తమ గమ్యం ఇవి మాత్రమే అనే దృక్పథాన్ని వీడాలి. ఐఐటీలు, ఐఐఎంలతోపాటు మరెన్నో ఇన్స్టిట్యూట్లు అందుబాటులో ఉన్నాయి. దానికి అనుగుణంగా తమ ఆలోచన పరిధిని కూడా విస్తృతం చేసుకోవాలి. ఏ స్థాయి ఇన్స్టిట్యూట్ అయినా అధ్యాపకులు, బోధన పాత్ర కొంత మేరకే ఉంటుంది. వ్యక్తిగతంగా ఆసక్తి, అభిరుచి, అవగాహన స్థాయిలపైనే కోర్సులో రాణించడం, తదుపరి కెరీర్ అవకాశాలు సొంతం చేసుకోవడమనే అంశాలు ఆధారపడి ఉంటాయి. దీనికి అనుగుణంగా ముందుకు సాగితే మారుమూల గ్రామంలోని ఇన్స్టిట్యూట్లో చదివినా, మెట్రో సిటీల్లో చదివినా ఒకే విధంగా రాణించగలరు!!