మద్రాస్ ఐఐటీ వివాదాస్పద నిర్ణయం
చెన్నై: మద్రాస్ ఐఐటీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదస్సదమైంది. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, విధానాలను విమర్శించినందుకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘంపై నిషేధం విధించింది. నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారన్న ఆరోపణతో అంబేద్కర్ పెరియార్ స్టూడెంట్ సర్కిల్(ఏపీఎస్సీ)పై వేటు వేసింది.
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు ఏపీఎస్సీపై నిషేధం విధించినట్టు మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ ప్రిస్కా మాథ్యూ లేఖ రాశారు. మోదీ సర్కారును, విధానాలను విమర్శిస్తూ ఏపీఎస్సీ పంచిన కరపత్రాలతో విద్యార్థులు హెచ్ ఆర్డీ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయడంతో ఈ చర్య తీసుకున్నట్టు లేఖలో పేర్కొన్నారు. అయితే ఆకాశరామన్న ఉత్తరాలతో తమపై నిషేధం విధించడం పట్ల ఏపీఎస్సీ నిరసన వ్యక్తం చేసింది. హిందూమత సంస్థలే తమపై ఫిర్యాదు చేశాయని ఆరోపించింది.