Business schools
-
స్కూల్ ఫేర్వెల్ ఈవెంట్లో నటుడు హర్షవర్ధన్ రాణే సందడి (ఫోటోలు)
-
WeareHiring రూటు మార్చిన ఆటోమేకర్స్: క్యాంపస్ ఇంటర్వ్యూల్లో భారీ నియామకాలు
న్యూఢిల్లీ: ప్రతిభావంతులైన యువ సిబ్బందిని రిక్రూట్ చేసుకునే క్రమంలో ఆటోమొబైల్ కంపెనీలు గతంలో ఎన్నడూ లేనంతగా ఇంజినీరింగ్ కాలేజీలు, బిజినెస్ స్కూల్స్ మీద దృష్టి పెడుతున్నాయి. దీంతో గౌహతి, మండీ లాంటి ప్రాంతాల్లోని ఐఐటీల్లో (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) క్యాంపస్ రిక్రూట్మెంట్లు ఈసారి గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్యాసింజర్ కార్ల మార్కెట్లలో ఒకటిగా భారత్ ఎదుగుతున్న నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు వివిధ విభాగాల్లో ప్రతిభావంతులను మరింతగా నియమించు కోవడంపై దృష్టి సారిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇంజినీరింగ్, ఎల్రక్టానిక్స్, ప్రోడక్ట్ డెవలప్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ విభాగాల్లో హైరింగ్‌ను పెంచుకుంటున్నట్లు వివరించాయి. అనలిటిక్స్, ఎలక్ట్రిఫికేషన్, ఇండస్ట్రీ 5.0 నైపుణ్యాలు ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నాయి. 2024 బ్యాచ్ నుంచి మేనేజ్మెంట్, గ్రాడ్యుయేట్ ట్రైనీలను తీసుకోవాలని జర్మనీ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ భావిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి 15-20శాతం ఎక్కువమందిని తీసుకోబోతున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. క్యాంపస్ నుంచి రిక్రూట్ చేసుకున్న వారికి కొత్త టెక్నాలజీలు, ప్లాట్‌ఫాంలపై తగు శిక్షణ ఇచ్చి భవిష్యత్ అవసరాల కోసం సిద్ధం చేసుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే డేటా అనలిటిక్స్ తదితర విభాగాల్లో నైపుణ్యాలున్న వారిని రిక్రూట్ చేసుకునే ప్రక్రియ కూడా ప్రారంభించింది. డేటా మైనింగ్ తదితర సాంకేతికతలతో ఈ–కామర్స్ చానల్స్‌ను అభివృద్ధి చేసేందుకు, బ్యాక్–ఎండ్ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేసేందుకు వీరిని వినియోగించుకోవాలనేది కంపెఈ యోచన. మారుతీ కూడా.. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు అమ్మకాల ఊతంతో భవిష్యత్ అవసరాల కోసం నియామకాలను మరింతగా పెంచుకునేందుకు మారుతీ సుజుకీ కూడా సన్నద్ధమవుతోంది. వ్యాపార విస్తరణకు అనుగుణంగా క్యాంపస్ నుంచి నియామకాలను కూడా పెంచుకుంటున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది క్యాంపస్‌ల నుంచి 1,000 మంది వరకూ సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు పేర్కొన్నాయి. సంస్థలో అంతర్గతంగా కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టడం, డిజిటల్ పరివర్తన మొదలైన వాటిని వేగంగా అమలు చేస్తున్నామని, ఇందుకోసం తత్సంబంధ నైపుణ్యాలున్న ప్రతిభావంతుల అవసరం చాలా ఉంటోందని వివరించాయి. (యూట్యూబ్ వీడియో లైక్ చేస్తే..రోజుకు రూ. 8వేలు: కట్ చేస్తే!) మరోవైపు, మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఇటీవలే తమ క్యాంపస్ హైరింగ్‌ల జాబితాలో మరిన్ని కొత్త ఐఐటీలు, ఎంబీయే సంస్థలను కూడా చేర్చింది. 2022లో దాదాపు 50 పైగా ఇంజినీరింగ్, ఎంబీఏ సంస్థల నుంచి మహీంద్రా ఎంట్రీ లెవెల్ సిబ్బందిని తీసుకుంది. సగటున 500-600 మందిని రిక్రూట్ చేసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అటు హీరో మోటోకార్ప్ సంస్థ డిప్లొమా ఇంజినీర్ల నియామకం కోసం ఢిల్లీ స్కిల్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ యూనివర్సిటీతో జట్టు కట్టింది. క్రితం సంవత్సరంతో పోలిస్తే తాము 40 శాతం ఎక్కువ మందిని క్యాంపస్ నుంచి రిక్రూట్ చేసుకున్నట్లు సంస్థ ప్రతినిధులు వివరించారు. వీరిలో ఎక్కువగా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకాట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్లు, ఎంబీఏలు ఉన్నట్లు పేర్కొన్నారు. కొరియా దిగ్గజం హ్యుందాయ్ మోటార్ భారత్‌లో తన కార్యకలాపాల కోసం వివిధ విభాగాల్లో, హోదాల్లో 1,000 పైగా ఉద్యోగాలను భర్తీ చేసే యత్నాల్లో ఉంది. క్యాంపస్‌ల విషయానికొస్తే.. ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ నేపథ్యం ఉన్నవారికి ప్రాధాన్యం లభించనుంది. (టీ స్టాల్ కోసం ఐఏఎస్ డ్రీమ్‌ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు) క్యాంపస్‌లలోనూ ఆసక్తి.. ఆటోమొబైల్ కంపెనీల నియామకాల ప్రణాళికలపై క్యాంపస్‌లలో కూడా ఆసక్తి నెలకొంది. ఐఐటీ–గౌహతిలో గతేడాదితో పోలిస్తే ఈసారి కోర్ ఇంజినీరింగ్ నైపుణ్యాలున్న వారికి ఆఫర్లు గణనీయంగా పెరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కోర్ ఇంజినీర్, డిజైన్ ఇంజినీర్, బిజినెస్ అనలిస్ట్, డేటా ఇంజినీర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్ తదితరుల కోసం డిమాండ్ నెలకొన్నట్లు పేర్కొన్నాయి. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి తమ దగ్గర నుంచి రిక్రూట్ చేసుకునే ఆటోమొబైల్ కంపెనీల సంఖ్య పెరిగినట్లు ఐఐటీ-మండీ వర్గాలు తెలిపాయి. కోవిడ్‌పరమైన మందగమనం ప్రభావం తగ్గడం ఇందుకు కారణం కావచ్చని భావిస్తున్నట్లు వివరించాయి. -
ఘనంగా ఐసీబీఎం స్కూల్ స్నాతకోత్సాహం
-
దేశంలో 1.. ప్రపంచంలో16
హైదరాబాద్: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) మరో ఘనతను సాధించింది. పోయట్స్ అండ్ క్వాంట్స్ సోమవారం ప్రకటించిన బిజినెస్ స్కూళ్ల ర్యాంకింగ్స్‌లో ఐఎస్బీ సత్తా చాటింది. దేశంలోనే టాప్ బిజినెస్ స్కూల్‌గా గచ్చిబౌలిలోని ఐఎస్బీ నిలిచింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూళ్లలో ఐఎస్బీ 16వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ మేరకు పోయట్స్ అండ్ క్వాంట్స్ పదో వార్షిక ర్యాంకింగ్స్‌లో ఐఎస్బీ సాధించిన ఘనతలను సంస్థ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. కార్పొరేట్ రిక్రూటర్లు, ఎంబీఏ గ్రాడ్యుయేట్లు, డీన్లు, ఫ్యాకల్టీ, ప్రచురణల రికార్డులు, తరగతులు, జీమ్యాట్ స్కోర్లు, పూర్వ విద్యార్థుల తాజా జీతం, ఉపాధి గణాంకాలు ఇతరత్రా పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులను ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా మొదటి ఐదు స్థానాల్లో ఇన్సీడ్, లండన్ బిజినెస్ స్కూల్, ఐఈఎస్ఈ, హెచ్ఈసీ పారిస్, ఐఎండీ నిలిచాయి. సమష్టి కృషికి నిదర్శనం.. ఐఎస్బీ విద్యార్థులు, పూర్వవిద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు, సిబ్బంది సమష్టి కృషికి నిదర్శనమే తాజాగా అత్యుత్తమ ర్యాంకులను సాధించడం. 2019లో ర్యాంకుల్లో చాలా మెరుగుపడ్డాం. ప్రస్తుతం పోయట్స్ అండ్ క్వాంట్స్ ర్యాంకుల్లో దేశంలో టాప్ ర్యాంక్, ప్రపంచంలో 16వ స్థానం పొందడం గర్వంగా ఉంది. ఆశాభావ దృక్పథంతో 2020లో ముందుకుసాగుతాం. –ప్రొఫెసర్ రాజేంద్ర శ్రీవాత్సవ, డీన్, ఐఎస్బీ -
బెస్ట్ బిజినెస్ స్కూల్ ఐఐఎం అహ్మదాబాద్
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ దేశంలోనే నంబర్ వన్ బిజినెస్ స్కూల్ గా స్థానం సంపాదించుకుంది. ఆ తరువాతి స్థానాల్లో ఐఐఎం కలకత్తా, ఐఐఎం బెంగుళూరు ఉన్నాయి. ఫైనాన్షియల్ టైమ్స్ మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ ర్యాంకింగ్‌లో ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం కలకత్తాలు ఆసియాలోనే ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ యేడాది సర్వేలో మొత్తం 104 బిజినెస్ స్కూల్స్ పాల్గొన్నాయి. గత యేడాది అంతర్జాతీయంగా 28వ స్థానంలో ఉన్న ఇండియన్ బిజినెస్ స్కూల్స్ ఈ యేడాది కొంత మెరుగై ఐఐఎం అహ్మదాబాద్ 21వ ర్యాంకులోనూ, ఐఐఎం కలకత్తా 23 ర్యాంకులోనూ నిలిచాయి. ఎఫ్‌టి ర్యాంకింగ్ 2018 ఆసియాలోనే టాప్ టెన్ బిజినెస్ స్కూల్స్... 1. షాంఘై జియాఓ టాంగ్ యూనివర్సిటీ, ఆంటాయ్ – చైనా 2. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ – ఇండియా 3. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కలకత్తా – ఇండియా 4.స్కేమ బిజినెస్ స్కూల్ – చైనా 5. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగుళూరు – ఇండియా 6. టోంగ్జీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ మనేజ్మెంట్ – చైనా 7. గ్రేనోబెల్ ఎకోల్ డి మేనేజ్మెంట్ – సింగపూర్ 8. ఐక్యూఎస్–ఎఫ్జెయు–యుఎస్ఎఫ్ – తైవాన్ 9. హల్ట్ ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ – చైనా 10. సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ, లీ కాంగ్ చైనా– సింగపూర్. రెండు వేర్వేరు అధ్యయనాలను అనుసరించి బిజినెస్ స్కూల్స్‌కి ఈ ర్యాంకులు ఇచ్చారు. ఒకటి బిజినెస్ స్కూల్స్ నిర్వహించే అధ్యయనం అయితే, మరొకటి 2015లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన పూర్వ విద్యార్థుల అధ్యయనం ద్వారా కేటాయించే ర్యాంకులు. 2015 పూర్వ విద్యార్థుల సర్వే ప్రకారం వివిధ బిజినెస్ స్కూల్స్‌లో బోధించే సబ్జెక్టులఅనుసారం ఎకనామిక్స్ బోధనలో నంబర్ వన్ ర్యాంకునీ, ఫైనాన్స్ సబ్జెక్టు బోధనలో ఏడవ ర్యాంకునీ ఐఐఎం కలకత్తా కైవసం చేసుకుంది. టాప్ టెన్ బిజినెస్ స్కూల్స్‌లో బోధించే వివిధ సబ్జెక్టుల ఆధారంగా ఈ ర్యాంకులు ఇస్తారు. విద్యాబోధన, వసతులు, స్పోర్ట్స్ తదితర అంశాల్లో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడం వల్ల అత్యధిక మంది విదేశీ విద్యార్థులను ఈ యూనివర్సిటీలు ఆకర్షిస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల కోసం (సెమ్స్, ఐఎస్‌సిపి(యూరప్)తో సంయుక్తంగా నిర్వహిస్తోన్న డబుల్ డిగ్రీ కార్యక్రమాలు విద్యాప్రమాణాలు పెంచడానికి దోహదపడుతున్నాయి. దీంతో పాటు ప్రపంచప్రసిద్ధ యూనివర్సిటీలతో కలిసి చేస్తోన్న స్టూడెంట్స్ ఎక్సేంజ్ ప్రోగ్రాం కూడా ఈ విజయానికి కారణం. ప్రస్తుతం ఐఐఎం కలకత్తా మరో 100 బిజినెస్ స్కూల్స్‌తో కలిసి స్టుడెంట్ ఎక్చేంజ్ కార్యక్రమం ప్రతియేటా నిర్వహిస్తోంది. 2017–18లో ఐఐఎం కలకత్తా నుంచి 133 మంది విద్యార్థులు స్టూడెంట్ ఎక్చేంచ్ కార్యక్రమంలో భాగమయ్యారు. భాగస్వామ్య స్కూల్స్ నుంచి 87 మంది విద్యార్థులు ఐఐఎం కలకత్తా లో అధ్యయనం చేసినట్టు వెల్లడించారు. -
బిజినెస్ స్కూళ్లలో నీరవ్, మాల్యా కేస్ స్టడీలు
సాక్షి, న్యూఢిల్లీ: గత దశాబ్దకాలంగా దేశాన్ని పట్టిపీడిస్తున్న భారీ కుంభకోణాల నేపథ్యంలో భారతదేశంలోని టాప్ ఐఐఎం సంస్థలు కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల పీఎన్బీ స్కాం, రుణ ఎగవేదారులు మోసగాళ్లు, ఉబెర్ వ్యవహారం తదితర కేస్ స్టడీస్‌ను పాఠ్యాంశాలుగా చేర్చాలని నిర్ణయించింది. ముఖ్యంగా కార్పొరేట్ నైతిక విలువలు, కార్పొరేట్ గవర్నెన్స్, కీలక సమయాల్లో నిర్ణయాత్మక నిర్ణయాలు వంటి అంశాలపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లు, ఇతర బిజినెస్ స్కూళ్లలో ప్రత్యేకంగా కోర్సులను రూపొందించనున్నాయి. వేలకోట్ల రూపాయలమేర భారతీయ బ్యాంకులకు అతి సులువుగా, అక్రమంగా ఎగవేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా, డైమండ్ కింగ్ నీరవ్ మోదీ సహా ఇతర భారీ మోసగాళ్లపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్మేనేజ్మెంట్(ఐఐఎంలు), ఐఐఎం-బెంగళూరు, ఐఐఎం-ఇండోర్‌సహా, జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్(ఎక్స్ఎల్ఆర్ఐ)జెమ్షెడ్పూర్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు విద్యార్థులకు వీటిని బోధించనున్నాయి. తద్వారా నైతిక విలువలు, కార్పోరేట్ గవర్నెన్స్, కార్పోరేట్ సామాజిక బాధ్యత గురించి విద్యార్ధులకు అవగాహన కల్పిస్తాయి. ఇందుకోసం నిపుణుల సమాచారం, సహాయంతో కోర్సులను రీడిజైన్ చేయనున్నాయి. కార్పొరేట్ పాలన, నీతి వంటి వివిధ కోర్సులద్వారా విద్యార్థుల్లో విజ్ఞానం నైపుణ్యం-నిర్మాణాత్మక లక్ష్యాలను అధిగమించటంతోపాటు, సమాజంలో సానుకూల మార్పు తీసుకురాగలవని తాము భావిస్తున్నామని ఐఐఎం బెంగళూరు చైర్పర్సన్ పద్మిని శ్రీనివాసన్ తెలిపారు. మేనేజర్స్ తమ కెరీయర్ ఎదురయ్యే ఎథికల్ డైలమా, సంఘర్షణల సమయంలో సరైన నిర్ణయం తీసుకునేలా తర్ఫీదు నిచ్చేందుకు ఈ కోర్సులను రూపొందిస్తున్నామన్నారు. ప్రస్తుత తరుణంలో మంచి నిపుణులైన బోధకుల అవసరం చాలా ఉందనీ, అలాంటి అత్యుత్తమ ఉపాధ్యాయులను గుర్తించాల్సి ఉందన్నారు. అలాగే విధాన రూపకర్తలు, విశ్లేషణలతో తమకున్న సంబంధాలు గత దశాబ్దాలుగా క్షీణిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. -
జీమ్యాట్ ఇకపై మూడున్నర గంటలే
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూళ్లల్లో ప్రవేశాల కోసం నిర్వహించే గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్(జీమ్యాట్) పరీక్షా సమయాన్ని 4 గంటల నుంచి మూడున్నర గంటలకు తగ్గించారు. ఈ నిర్ణయం ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి రానుందని జీమ్యాట్‌ను నిర్వహించే గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కౌన్సెల్ (జీమ్యాక్) సీనియర్ డైరెక్టర్ వినీత్ ఛబ్రా తెలిపారు. తాజా విధానంలో జీమ్యాట్ ప్రశ్నల స్థాయి, స్కోరింగ్‌లో ఎలాంటి మార్పులు చేయలేదన్నారు. క్వాంటిటేటివ్, వెర్బల్ రీజనింగ్ విభాగాల్లో అన్‌స్కోర్డ్, రీసెర్చ్ ప్రశ్నలను తగ్గించినట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రంలో ట్యుటోరియల్ స్క్రీన్లను తొలగించినట్లు తెలిపారు. జీమ్యాట్ పరీక్షలో అనలిటికల్ రైటింగ్, ఇంటిగ్రేటెడ్ రీజనింగ్ విభాగాల్లో ఎలాంటి మార్పు జరగలేదన్నారు. పరీక్షా విధానాన్ని మరింత మెరుగుపర్చడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గతేడాది జీమ్యాట్ పరీక్షలకు ప్రపంచవ్యాప్తంగా 2.50 లక్షల మంది హాజరైతే.. అందులో భారతీయులు 32,514 మంది ఉన్నారని తెలిపారు. ప్రతి 16 పని దినాలకు ఓసారి, మొత్తంగా ఏడాదికి ఐదు సార్లకు మించకుండా విద్యార్థులు జీమ్యాట్ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. ఓ అభ్యర్థి తన జీవితకాలంలో గరిష్టంగా 8 సార్లు మాత్రమే జీమ్యాట్ రాయొచ్చు. ప్రపంచవ్యాప్తంగా 2,300 బిజినెస్ స్కూళ్లు, ఏడు వేలకుపైగా కోర్సుల్లో జీమ్యాట్ స్కోరును ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. -
‘బి’ స్కూల్ విద్యార్థులకు కొలువులేవీ?
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తదితర అంశాల కారణంగా బి–కేటగిరీకి చెందిన బిజినెస్ స్కూల్స్ విద్యార్థులకు కొలువులు దొరకడం కష్టంగా మారుతోంది. కేవలం 20 శాతం విద్యార్థులకే ఉద్యోగాలు లభిస్తున్నాయి. పరిశ్రమల సమాఖ్య అసోచామ్ అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. డీమోనిటైజేషన్, వ్యాపార సెంటిమెంట్ అంతంతమాత్రంగా ఉండటం, కొత్త ప్రాజెక్టులు నిల్చిపోవడం మొదలైనవి ఇందుకు కారణంగా ఉంటున్నాయని అసోచామ్ నివేదికలో పేర్కొంది. క్యాంపస్ నియామకాలు గతేడాది కన్నా ఈ ఏడాది మరింత భారీగా క్షీణించిందని వివరించింది. ఇక ఈ విభాగం బిజినెస్ స్కూల్స్, ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులకు ఆఫర్ చేసే ప్యాకేజీలు కూడా గతేడాదితో పోలిస్తే 40–45 శాతం తక్కువగా ఉంటున్నాయని వివరించింది. లక్షలు పోసి మూడు–నాలుగేళ్ల పాటు బిజినెస్ కోర్సులు చేయాలంటే చాలా మంది విద్యార్థులు, చదివించేందుకు తల్లిదండ్రులు పునరాలోచిస్తున్నారని అసోచాం ఎడ్యుకేషన్ కౌన్సిల్ (ఏఈసీ) పేర్కొంది. -
‘వారిలో 20 శాతం మందికే ఉద్యోగాలు’
సాక్షి, న్యూఢిల్లీ: బిజినెస్ స్కూళ్లు ప్లేస్మెంట్ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బిజినెస్ స్కూల్ విద్యార్ధుల్లో కేవలం 20 శాతం మందికే జాబ్ ఆఫర్లు వస్తున్నాయని పరిశ్రమ సంస్థ అసోచామ్ అంచనా వేసింది. ఈసారి ప్లేస్మెంట్ ఇయర్ ఇటీవల ఎన్నడూ లేని విధంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొందని ఆందోళన వ్యక్తం చేసింది. నోట్ల రద్దు, నిరుత్సాహకర వ్యాపార వాతావరణం, నూతన ప్రాజెక్టులు నిలిచిపోవడం వంటి కారణాలతో బీ స్కూల్ విద్యార్ధులకు జాబ్ ఆఫర్లు తగ్గిపోయాయని అసోచామ్ అభిప్రాయపడింది. గత ఏడాది బీ స్కూల్ ప్లేస్మెంట్ 30 శాతంగా ఉంటే ఇప్పుడు 20 శాతం బీ స్కూల్ విద్యార్థులకే జాబ్ ఆఫర్లు పరిమితమయ్యాయని పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే వేతన ప్యాకేజీలు కూడా 40-45 శాతం తక్కువగా ఉన్నాయని వివరించింది. ఓ కోర్సుపై మూడు నాలుగేళ్ల సమయం వెచ్చించి రూ లక్షలు ఖర్చు చేయడంపై తల్లితండ్రులు, విద్యార్ధులు పునరాలోచిస్తున్నారని కూడా అసోచామ్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (ఏఈసీ) తెలిపింది. 400 విద్యా సంస్థల్లో తగినంత విద్యార్ధులు లేకపోవడంతో ఆయా సంస్థల మనుగడ ప్రశ్నార్థకమైందని ఆందోళన వ్యక్తం చేసింది. పెద్దసంఖ్యలో బీ స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజీలు విద్యార్థులను తమ సంస్థల్లోకి ఆకర్షించలేకపోతున్నట్టు తమ అథ్యయనంలో వెల్లడైందని పేర్కొంది. 2015 నుంచి ఇప్పటివరుకూ 250 పైగా బిజినెస్ స్కూళ్లు మూతపడ్డాయని వెల్లడించింది. -
వీరికి కొలువులే..కొలువులు
సాక్షి, న్యూఢిల్లీ : ఐటీ ఉద్యోగుల లేఆఫ్స్‌తో కొలువుల మార్కెట్ కళ కోల్పోయినా టాప్ కాలేజీలకు చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు మాత్రం భారీ డిమాండ్ నెలకొంది. నోట్ల రద్దు, మందగమనం నేపథ్యంలోనూ దేశంలోని ప్రతిష్టాత్మక 26 బిజినెస్ స్కూల్స్‌కు చెందిన గ్రాడ్యుయేట్లను ఈ ఏడాది మెరుగైన వేతన ప్యాకేజీలతో దిగ్గజ కంపెనీలు రిక్రూట్ చేసుకున్నాయి. పలు క్యాంపస్ నియామకాల్లో వేతన ప్యాకేజీలు గత ఏడాదితో పోలిస్తే పది శాతం పెరిగాయి. వ్యాపారాల డిజిటలీకరణ, విభిన్న పరిస్థితులను ఎదుర్కోవాల్సిన క్రమంలో బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్లకు బహుళజాతి కంపెనీల ప్రాధాన్యత పెరిగింది. ఈ ఏడాది 1700 మంది ఎంబీఏ గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకున్నట్టు కాగ్నిజెంట్ వెల్లడించింది. ప్రయివేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ 223 మంది బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్లను నియమించుకుంది. ఇంకా క్యాప్‌జెమని, డెలాయిట్, ఇన్ఫోసిస్, విప్రో,యాక్సెంచర్, కేపీఎంజీ, టీసీఎస్, అమెజాన్, ఐబీఎంలూ పెద్ద సంఖ్యలో ఎంబీఏలను రిక్రూట్ చేసుకున్నాయి. -
యూఎస్‌లో బెస్ట్ బిజినెస్ స్కూల్స్ ఇవే..
వాషింగ్టన్: మార్కెట్లో ఎన్ని కోర్సులున్నా మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ)కు ఉన్న క్రేజ్ వేరే. కోర్సు సమయంలో ఇంటర్న్‌షిప్ అవకాశాలతో పాటు.. అనంతరం మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు సాధించాలనుకునే వారు సాధారణంగానే ఈ కోర్సు వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే యూఎస్‌లోని టాప్ బిజినెస్ స్కూల్స్‌లో ఈ కోర్సు కాస్త వ్యయంతో కూడుకున్నదనే విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరముంది. బ్లూమ్‌బర్గ్ బిజినెస్ వీక్ ఇటీవల ఫుల్ టైం ఎంబీఏ కోర్సును అందిస్తున్న అమెరికాలోని ఉత్తమ బిజినెస్ స్కూళ్ల జాబితా-2016ను విడుదల చేసింది. ఈ జాబితాలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ మొదటి స్థానంలో నిలువగా.. స్టాన్ఫోర్డ్ రెండో స్థానం దక్కించుకుంది. బిజినెస్ స్కూళ్ల పూర్వ విద్యార్థుల అనుభవాలు, కోర్సు పూర్తయిన తరువాత ఉద్యోగాలు పొందుతున్న సరళి, ట్యూషన్ ఫీజులు, ఇంటర్న్‌షిప్ అవకాశాలు లాంటి విస్తృతమైన సమాచారంతో ఈ ర్యాంకులను రూపొందించినట్లు బ్లూమ్‌బర్గ్ బిజినెస్ వీక్ వెల్లడించింది. ఈ జాబితాలో టాప్ 20లో నిలిచిన యూఎస్‌లోని ఉత్తమ బిజినెస్ స్కూళ్లు ఇవే.. 1. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ 2. స్టాన్ఫోర్డ్ 3. డ్యూక్ 4. చికాగో(బూత్) 5. డర్ట్మోత్ 6. పెన్సిల్వేనియా(వార్టన్) 7. ఎమ్ఐటీ 8. రైస్(జోన్స్) 9. నార్త్ వెస్టర్న్ (కెల్లాగ్) 10. యూసీ బర్క్లీ(హాస్) 11. కొలంబియా 12. వర్జీనియా 13. మిచిగాన్(రాస్) 14. యేల్ 15. కార్నేగి మిలాన్(టెప్పర్) 16. కార్నెల్(జాన్సన్) 17. ఎన్‌వైయూ(స్టెర్న్) 18. టెక్సాస్(మేస్) 19. వాషింగ్టన్(ఫాస్టర్) 20. ఎమోరి(గొయ్జుటా) -
ప్రపంచ బిజినెస్ స్కూళ్లకు దీటుగా సిలబస్
చేబ్రోలు: ప్రపంచంలోని ప్రఖ్యాత బిజినెస్ స్కూళ్లకు దీటుగా బీబీఏ కోర్సు కోసం సిలబస్ రూపొందించి అమలు చేస్తున్నామని విజ్ఞాన్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఎంఎస్.రఘునాధన్ తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్శిటీలో శుక్రవారం బీబీఏ మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించారు. రఘునాధన్ మాట్లాడుతూ మేనేజ్మెంట్ విభాగంలో ఉత్తమ అధ్యాపకులు ఉన్నారని తెలిపారు. ఇక్కడ ర్యాగింగ్ అనే మాటే ఉండదన్నారు. తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. డీన్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ వి.మధుసూధనరావు మాట్లాడుతూ విద్యార్థులకు మార్కులు, డిగ్రీలు ముఖ్యం కాదని, నైతిక విలువలు ఎంతో అవసరం అన్నారు. ఎంబీఏ మేనేజ్మెంట్ విభాగాధిపతి విజయకృష్ణ, ఆయా విభాగాల అధిపతులు పాల్గొన్నారు. -
GMR బిజినెస్ స్కూల్‌ను ప్రారంభించిన కెసిఆర్
-
ప్రి-ప్లేస్‌మెంట్స్‌కు ప్రిపేరవ్వండిలా!
దేశవ్యాప్తంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)లతోపాటు ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రి-ప్లేస్‌మెంట్స్ సీజన్ మొదలైంది. ఈ తరుణంలో కొన్ని ముఖ్యమైన విషయాలను దృష్టిలో ఉంచుకొని తదనుగుణంగా సిద్ధమైతే ప్రి-ప్లేస్మెంట్ ద్వారా అవకాశం పొందొచ్చు. మన సిటీలోనూ పేరొందిన బిస్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్లేస్‌మెంట్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. విద్యార్థులు ప్రధానంగా దృష్టిసారించాల్సిన అంశాలేవో తె లుసుకుందాం.. ప్రి-ప్లేస్‌మెంట్స్‌కు సిద్ధమయ్యే క్రమంలో.. ఏ విభాగంలోకి అడుగుపెట్టాలనుకుంటున్నారు? జాబ్ ప్రొఫైల్, వేతన ప్యాకేజీ వంటి వాటి గురించి తెలుసుకోవాలి. ప్లేస్‌మెంట్స్‌లో స్థానం పదిలం చేసుకోవాలంటే.. ఉత్తమమైన మార్గం.. యాక్టివ్ ప్రిపరేషన్. కోర్ కాన్సెప్ట్లపై దృష్టిపెట్టాలి. గ్రూప్ డిస్కషన్లు, మాక్ ఇంటర్వ్యూలను సాధన చేయాలి. అసలైన మౌఖిక పరీక్షలో విజయానికి ఇవి ఉపయోగపడతాయి. సబ్జెక్టు పరిజ్ఞానంతోపాటు సమకాలీన అంశాలపై పట్టు పెంచుకోవాలి. ముఖ్యమైన నాలుగు దశలు.. ప్రి-ప్లేస్మెంట్ ప్రక్రియను సాధారణంగా నాలుగు విధాలుగా వర్గీకరించొచ్చు. అవి..ప్రభావవంతమైన కరిక్యులమ్ విటేను తయారు చేసుకోవడం; దరఖాస్తు చేసుకోవడంతోపాటు ఇంటర్వ్యూకు ప్రిపేర్ కావడం; ఇంటర్వ్యూను ఎదుర్కోవడం; అంతిమంగా ఇంటర్న్‌షిప్‌లో చేరడం! ఇంటర్న్‌షిప్‌లో మంచి పనితీరును ప్రదర్శించి, యాజమాన్యాన్ని ఆకట్టుకుంటే ప్రి-ప్లేస్మెంట్ ఆఫర్ పొంది, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ప్రక్రియను ఎదుర్కొనే అవసరం లేకుండా కోర్సు పూర్తికాగానే అదే సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఇష్టమైన కొలువును సొంతం చేసుకోవాలంటే.. అభ్యర్థులు శ్రమించక తప్పదు. సీవీ.. సులభం కాదు ప్రభావవంతమైన కరిక్యులమ్ విటే(సీవీ)ను తయారు చేసుకోవడం అనుకున్నంత సులభం కాదు. ఈ విషయంలో కాలేజీలో సీనియర్ల సలహాలు తీసుకోవాలి. సీవీలో రాసే ప్రతి పదానికి ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి అప్రమత్తత అవసరం. అభ్యర్థులు తమ నైపుణ్యాలు, అర్హతలను అందులో చక్కగా పొందుపర్చాలి. వ్యాకరణ దోషాలు, అక్షర దోషాలు లేకుండా ఒకటికి రెండుసార్లు క్షుణ్నంగా సరిచూసుకోవాలి. రిక్రూటర్ దృష్టిని ఆకర్షించేలా సీవీని తీర్చిదిద్దుకోవాలి. దరఖాస్తు, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ సీవీ తయారు చేసుకున్న తర్వాతి దశ దరఖాస్తు చేసుకోవడం, ఇంటర్వ్యూకు సిద్ధం కావడం. సంస్థకు దర ఖాస్తు పంపిన తర్వాత ఇంటర్వ్యూ సాధన ప్రారంభించాలి. ముఖ్యంగా రెండు సెక్టార్లపై ఫోకస్ చేయడం మంచిది. అన్నింటిపై దృష్టిపెడితే దేనికీ సరైన న్యాయం చేయలేరు. సదరు సెక్టార్/కంపెనీలో ఇప్పటికే పనిచేస్తున్న సీనియర్లను సంప్రదించాలి. జాబ్ ప్రొఫైల్, యాజమాన్యం ఆకాంక్షలు, ఇంటర్వ్యూ ప్రక్రియ గురించి తెలుసుకోవాలి. తదనుగుణంగా ఇంటర్వ్యూకు సిద్ధం కావాలి. మౌఖిక పరీక్షలో ఏయే అంశాలను ప్రస్తావిస్తారో గుర్తించి, వాటిని సాధన చేయాలి. కంపెనీ గురించి ముందుగానే వివరాలు తెలుసుకోవాలి. మౌఖిక పరీక్ష విషయంలో ఇతరుల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. వారు చేసిన తప్పులు చేయకుండా అభ్యర్థులు జాగ్రత్తపడాలి. ఇంటర్వ్యూకు ప్రిపేర్ కావడం అంటే.. సిలబస్‌లోని సబ్జెక్టు అంశాలతో కుస్తీ పట్టడం మాత్రమే కాదని తెలుసుకోవాలి. ఇంటర్న్‌షిప్‌లో ప్రతిభ చూపాలి అభ్యర్థులు పూర్తి ఆత్మవిశ్వాసంతో గ్రూప్ డిస్కషన్‌కు, ఇంటర్వ్యూకు హాజరు కావాలి. రిక్రూటర్ అడిగే ప్రశ్నలకు నిజాయతీగా సమాధానాలు ఇవ్వాలి. ఇంటర్వ్యూ బోర్డును మెప్పిస్తే ఇంటర్న్‌షిప్‌లో చేరేందుకు అవకాశం లభిస్తుంది. ఇంటర్న్‌షిప్‌లో చేరడానికంటే ముందు గతేడాది అక్కడ పనిచేసిన సీనియర్లను సంప్రదించి వారి సూచనలు తీసుకోవాలి. ప్రాజెక్ట్ వివరాలు, అక్కడి పని వాతావరణం, ఉద్యోగుల పనితీరును యాజమాన్యం అంచనా వేసే విధానం.. తదితర విషయాలపై అవగాహన పెంచుకోవాలి. ఎంబీఏలో, ఇంజనీరింగ్‌లో ఉండగా నిర్మాణాత్మకమైన ఇంటర్న్‌షిప్, కార్పొరేట్ ప్రాజెక్ట్‌లను విజయవంతంగా పూర్తిచేస్తే అభ్యర్థులకు కోర్సు తర్వాత కొలువు తప్పనిసరిగా లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు! -
ఎంబీఏ.. జోష్‌పుల్ రిక్రూట్మెంట్
టాప్ స్టోరీ: మన భాగ్యనగరం ఇప్పటికే సాఫ్ట్వేర్, ఫార్మా రంగాల్లో ప్రపంచ యవనికపై తనదైన గుర్తింపు తెచ్చుకుంది. వీటితోపాటు వివిధ కంపెనీలు, వస్తూత్పత్తి సంస్థలు నగరంలో కొలువుదీరాయి. కంపెనీలకు అవసరమైన నిష్ణాతులైన మానవ వనరులను అందించే ఉద్దేశంతో.. పేరొందిన బిజినెస్ స్కూల్స్ తమ క్యాంపస్‌లను సిటీలో ఏర్పాటు చేశాయి. ఇదే సమయంలో ఈ ఏడాది అధిక శాతం మేనేజ్మెంట్, బిజినెస్ గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకోవాలని కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయని... జీమ్యాక్ 13వ వార్షిక సర్వే వెల్లడించింది. ఇది ఎంబీఏ, బిజినెస్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేట్లకు నిజంగా శుభవార్తే... వన్నె తగ్గని ఎంబీఏ అమెరికాకు చెందిన గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కౌన్సిల్ (జీమ్యాక్) ప్రకారం- 87 శాతం కంపెనీలు ఎంబీఏ గ్రాడ్యుయేట్లను నియమించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. గతంతో పోల్చితే ఈ ఏడాది ఎంబీఏ గ్రాడ్యుయేట్లను, బిజినెస్ స్కూల్ విద్యార్థులను ఎక్కువ మొత్తంలో రిక్రూట్ చేసుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయి. దాదాపు 87 శాతం కంపెనీలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఇది 7 శాతం అధికం. అదే 2009తో పోల్చితే ఇది 30 శాతం అధికం. అప్పటి ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో 40 శాతం కంపెనీలే ఎంబీఏలను నియమించుకున్నాయి. గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలకు చెందిన కంపెనీలు ఈ ఏడాది బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్లను అధిక శాతంలో నియమించుకోనున్నాయి. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఇది ఎక్కువగా ఉండొచ్చు. రంగాల వారీగా చూస్తే..కన్సెల్టింగ్ రంగం ముందంజలో నిలుస్తుంది. అన్ని రంగాల్లో: ఆ రంగం.. ఈ రంగం అంటూ తేడా లేకుండా అన్ని రంగాల్లోనూ ఎంబీఏ గ్రాడ్యుయేట్ల అవసరం ఉంది. ప్రతి రంగంలోనూ సంబంధిత కంపెనీ/వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించాలన్నా.. వ్యాపారాభివృద్ధికి అవసరమైన వ్యూహాలను రూపొందించాలన్నా.. సంస్థ మనుగడకు అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నా మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లపై ఆధారపడాల్సిందే. కాబట్టి కంపెనీలు, వ్యాపార నిర్వహణా సంస్థలూ సంబంధిత స్పెషలైజేషన్‌లో బిజినెస్ మేనేజ్మెంట్ను అధ్యయనం చేసి నిష్ణాతులుగా రూపొందినవారి కోసం జల్లెడ పడుతున్నాయి. తమ సంస్థల్లో నియమించుకుని ఏ రంగానికీ తీసిపోని వేతనాలను అందిస్తున్నాయి. మేనేజ్మెంట్ కళాశాలల్లో మేటి.. సిటీ: హైదరాబాద్‌లో ఎన్నో ఎంబీఏ కళాశాలలున్నాయి. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ - యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, నర్సీమొంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ (ఐఎంటీ), ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ (ఐపీఈ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, నేషనల్ అకాడెమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ వంటి దేశంలోనే పేరున్న ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్స్ నగరంలో కొలువుదీరాయి. వీటితోపాటు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, జేఎన్టీయూ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ వంటివి కూడా మేనేజ్మెంట్ కోర్సులను అందిస్తున్నాయి. పాపులర్ స్పెషలైజేషన్లు ఎన్నో: సిటీ.. ప్రముఖ బీ స్కూల్స్‌కే కాదు.. జాబ్ మార్కెట్లో అపార అవకాశాలు ఉన్న స్పెషలైజేషన్లను అందించడంలోనూ అన్నిటికంటే ముందుంది. ఫార్మా సంబంధిత కోర్సులను అందించడంలో దేశంలోనే పేరున్న సంస్థ.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్). కేంద్ర ప్రభుత్వ ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈ సంస్థ.. మన హైదరాబాద్‌లోనూ క్యాంపస్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఎంబీఏలో ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్ కోర్సును అందిస్తున్నారు. అదేవిధంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) ఆధ్వర్యంలోని నేషనల్ అకాడెమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ కూడా భాగ్యనగరంలోనే ఉంది. ఈ సంస్థ అగ్రికల్చర్లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (పీజీడీఎం) కోర్సును అందిస్తోంది. సిటీలో కొలువుదీరిన మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (ఎన్ఐఆర్డీ). ఇది రూరల్ డెవలప్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (పీజీడీఎం) కోర్సును ఆఫర్ చేస్తోంది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్లో పీజీడీఎంలో అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు ఉంది. దేశంలోని బెస్ట్ బీ స్కూల్స్ సర్వేలో చోటు ద క్కించుకుంటున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రెజ్ (ఐపీఈ) కూడా జాబ్ మార్కెట్లో మంచి ఉద్యోగావకాశాలున్న పీజీడీఎం-రిటైల్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్-ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి స్పెషలైజేషన్లను అందిస్తోంది. ఉస్మానియా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ - సెల్ఫ్ ఫైనాన్స్.. ఎంబీఏలో టెక్నాలజీ మేనేజ్మెంట్ను ఆఫర్ చేస్తోంది. ప్రత్యేకంగా హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్మెంట్, టూరిజం సంబంధిత కోర్సులను అందించడానికి ఏర్పాటైన సంస్థ డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. గచ్చిబౌలిలో ఉన్న ఈ సంస్థ పీజీడీఎంలో భాగంగా టూరిజం మేనేజ్మెంట్ కోర్సును, ఎంబీఏలో భాగంగా టూరిజం అండ్ హాస్పిటాలిటీ, హాస్పిటాలిటీ కోర్సులను అందిస్తోంది. అర్హతలు.. ప్రవేశ విధానం: బీస్కూల్స్ను బట్టి అర్హతలు, ఎంపిక విధానం వేర్వేరుగా ఉంటాయి. సాధారణంగా 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులు మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరొచ్చు. పీజీడీఎం - అగ్రికల్చర్, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులకు మాత్రం అగ్రికల్చర్ సంబంధిత కోర్సుల్లో నాలుగేళ్ల డిగ్రీ ఉండాలి. ప్రముఖ బీస్కూల్స్ అన్నీ క్యాట్/జీమ్యాట్/ఎక్స్‌ఏటీ వంటి స్కోర్లతోపాటు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల ఆధారంగా ప్రవేశం కల్పిస్తున్నాయి. మన రాష్ట్ర యూనివర్సిటీల్లో ఐసెట్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశం ఉంటుంది. నైపర్, ఎన్ఐఆర్డీ వంటి సంస్థలు సొంత ప్రవేశపరీక్షను నిర్వహిస్తున్నాయి. ఉద్యోగావకాశాలు : హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్ వంటి స్పెషలైజేషన్లలో ఎంబీఏ పూర్తిచేసినవారికి కంపెనీల్లో పలు విభాగాల్లో అవకాశాలు లభిస్తాయి. అలాగే నైపర్ అందించే ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తిచేసినవారికి ఫార్మాస్యూటికల్స్ కంపెనీల్లో మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. పీజీడీఎం-అగ్రికల్చర్, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులు పూర్తిచేసినవారు వ్యవసాయ సంబంధిత కంపెనీల్లో ఉద్యోగావకాశాలు దక్కించుకోవచ్చు. రిటైల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లకు మంచి వేతనాలు అందుతున్నాయి. టూరిజం మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు పూర్తిచేసినవారికి అవకాశాలు కోకొల్లలు. కావల్సిన స్కిల్స్: క్రిటికల్ థింకింగ్ డెసిషన్ మేకింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బృందాన్ని సమర్థవంతంగా నడిపించగలగడం మార్కెట్ రీసెర్చ్ కళాశాల ఎంపిక: హైదరాబాద్‌లో ఎంబీఏ, పీజీడీఎం కోర్సులను అందించే సంస్థలు వందల్లో ఉన్నాయి. అయితే నాణ్యతపరంగా, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అందిస్తున్న సంస్థలు పదుల్లోనే. కాబట్టి కళాశాల గత చరిత్ర, ప్లేస్‌మెంట్స్, నిపుణులైన ఫ్యాకల్టీ, ఇండస్ట్రీ ఇంటరాక్షన్ ఉన్న కళాశాలలను ఎంచుకోవాలనేది నిపుణుల మాట. మంచి కళాశాల ఏదో తెలుసుకోవడానికి పూర్వ విద్యార్థులు సహాయపడతారు. లేదా వివిధ సంస్థలు, పత్రికలు, మ్యాగజైన్లు దేశంలో, రాష్ట్రాల్లో బెస్ట్ బీ స్కూల్స్ సర్వేలను వెలువరిస్తుంటాయి. వీటి ఆధారంగా కూడా ఒక నిర్ణయానికి రావొచ్చు.