ప్రపంచంలోని ప్రఖ్యాత బిజినెస్ స్కూళ్లకు దీటుగా బీబీఏ కోర్సు కోసం సిలబస్ రూపొందించి అమలు చేస్తున్నామని విజ్ఞాన్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఎంఎస్.రఘునాధన్ తెలిపారు.
చేబ్రోలు: ప్రపంచంలోని ప్రఖ్యాత బిజినెస్ స్కూళ్లకు దీటుగా బీబీఏ కోర్సు కోసం సిలబస్ రూపొందించి అమలు చేస్తున్నామని విజ్ఞాన్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఎంఎస్.రఘునాధన్ తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్శిటీలో శుక్రవారం బీబీఏ మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించారు.
రఘునాధన్ మాట్లాడుతూ మేనేజ్మెంట్ విభాగంలో ఉత్తమ అధ్యాపకులు ఉన్నారని తెలిపారు. ఇక్కడ ర్యాగింగ్ అనే మాటే ఉండదన్నారు. తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. డీన్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ వి.మధుసూధనరావు మాట్లాడుతూ విద్యార్థులకు మార్కులు, డిగ్రీలు ముఖ్యం కాదని, నైతిక విలువలు ఎంతో అవసరం అన్నారు. ఎంబీఏ మేనేజ్మెంట్ విభాగాధిపతి విజయకృష్ణ, ఆయా విభాగాల అధిపతులు పాల్గొన్నారు.