
సాక్షి, న్యూఢిల్లీ: గత దశాబ్దకాలంగా దేశాన్ని పట్టిపీడిస్తున్న భారీ కుంభకోణాల నేపథ్యంలో భారతదేశంలోని టాప్ ఐఐఎం సంస్థలు కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల పీఎన్‌బీ స్కాం, రుణ ఎగవేదారులు మోసగాళ్లు, ఉబెర్ వ్యవహారం తదితర కేస్ స్టడీస్‌ను పాఠ్యాంశాలుగా చేర్చాలని నిర్ణయించింది. ముఖ్యంగా కార్పొరేట్ నైతిక విలువలు, కార్పొరేట్ గవర్నెన్స్, కీలక సమయాల్లో నిర‍్ణయాత్మక నిర్ణయాలు వంటి అంశాలపై ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లు, ఇతర బిజినెస్ స్కూళ్లలో ప్రత్యేకంగా కోర్సులను రూపొందించనున్నాయి.
వేలకోట్ల రూపాయలమేర భారతీయ బ్యాంకులకు అతి సులువుగా, అక్రమంగా ఎగవేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా, డైమండ్ కింగ్ నీరవ్ మోదీ సహా ఇతర భారీ మోసగాళ్లపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్మేనేజ్‌మెంట్(ఐఐఎంలు), ఐఐఎం-బెంగళూరు, ఐఐఎం-ఇండోర్‌సహా, జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ)జెమ్‌షెడ్‌పూర్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు విద్యార్థులకు వీటిని బోధించనున్నాయి. తద్వారా నైతిక విలువలు, కార్పోరేట్ గవర్నెన్స్, కార్పోరేట్ సామాజిక బాధ్యత గురించి విద్యార్ధులకు అవగాహన కల్పిస్తాయి. ఇందుకోసం నిపుణుల సమాచారం, సహాయంతో కోర్సులను రీడిజైన్ చేయనున్నాయి.
కార్పొరేట్ పాలన, నీతి వంటి వివిధ కోర్సులద్వారా విద్యార్థుల్లో విజ్ఞానం నైపుణ్యం-నిర్మాణాత్మక లక్ష్యాలను అధిగమించటంతోపాటు, సమాజంలో సానుకూల మార్పు తీసుకురాగలవని తాము భావిస్తున్నామని ఐఐఎం బెంగళూరు చైర్‌పర్సన్ పద్మిని శ్రీనివాసన్ తెలిపారు. మేనేజర్స్ తమ కెరీయర్ ఎదురయ్యే ఎథికల్ డైలమా, సంఘర్షణల సమయంలో సరైన నిర్ణయం తీసుకునేలా తర్ఫీదు నిచ్చేందుకు ఈ కోర్సులను రూపొందిస్తున్నామన్నారు. ప్రస్తుత తరుణంలో మంచి నిపుణులైన బోధకుల అవసరం చాలా ఉందనీ, అలాంటి అత్యుత్తమ ఉపాధ్యాయులను గుర్తించాల్సి ఉందన్నారు. అలాగే విధాన రూపకర్తలు, విశ్లేషణలతో తమకున్న సంబంధాలు గత దశాబ్దాలుగా క్షీణిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment