Case Studies
-
మాటలు వినే మనుషులు కావాలి...
మార్నింగ్ వాక్ చేస్తోందా యువతి. ‘అమ్మాయ్. నా దగ్గర కాసేపు కూచుంటావా?’ అడిగిందో పెద్దవిడ. పరిచయం లేదు. పిలించింది కదా అని కూచుంది. ఆ పెద్దావిడ అరగంట సేపు ఏవేవో మాట్లాడింది. తన గురించి పిల్లల గురించి చెప్పింది. ఏవేవో ఆలోచనలు వెళ్లబోసుకుంది. అంతా అయ్యాక ‘నేను మాట్లాడితే వినే మనుషులు లేరమ్మా. థ్యాంక్యూ’ అని వెళ్లిపోయింది. ఊహ తెలిసినప్పటి నుంచి పసిబిడ్డ మాట్లాడటం మొదలెడతాడు. రెండవ పసితనం వృద్ధాప్యమే. ఆ సమయంలో పెద్దవాళ్లతో ఎవరూ మాట్లాడరు. వారు మాట్లాడితే వినరు. వారు నోరు కట్టేసుకోలేక తమ గోడు వినే మనుషుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వర్తమాన పరిస్థితిపై కథనం. కేస్‌స్టడీ 1: కోటేశ్వరమ్మకు 70 ఉంటాయి. కూతురి దగ్గర ఉంటోంది. టూ బెడ్రూమ్ ఫ్లాట్ అది. డైనింగ్ ఏరియాలో మంచం వేసి ఆమెకు ఉండే ఏర్పాటు చేశారు. కూతురు ఇంట్లో ఉంటుంది కాని ఇంటి పనులే సరిపోతాయి. తల్లితో పెద్దగా మాట్లాడదు. అల్లుడు ఆఫీసు. మనవలది వాళ్ల లోకం. కోటేశ్వరమ్మకు ఎవరితోనైనా మాట్లాడాలని ఉంటుంది. తాను ఏదో ఒకటి చెప్పుకోవాలని ఉంటుంది. ఎవరు వింటారు? కారిడార్లోకి వచ్చి చూస్తుంది. ఎవరూ కనిపించరు. విజయవాడలో ఉన్న చుట్టం ఒకామె కోటేశ్వరమ్మతో రెగ్యులర్‌గా మాట్లాడుతుంది. అయితే ఆమె రాత్రి 10 తర్వాతే ఫ్రీ అవుతుంది. ఆ సమయంలో కోటేశ్వరమ్మ ఆ చుట్టానికి కాల్ చేసి మాట్లాడుతుంటే ఇంట్లో అల్లుడు, మనవలు డిస్ట్రబ్ అయ్యి విసుగ్గా చూస్తున్నారు. ‘ఫోన్లు పొద్దున మాట్లాడుకో’ అంటారు. పొద్దున మనిషి ఉండడు. రాత్రి మాట్లాడనివ్వరు. కోటేశ్వరమ్మ మూగది కాదు. మాటలు వచ్చు. ఎన్నో మాట్లాడుతూ ఇన్నేళ్లూ సంసారాన్ని లాక్కు వచ్చింది. ఇప్పుడు మాటలు మానేయమంటే ఎలా? కేస్‌స్టడీ 2: రమాదేవికి చీటికి మాటికి కన్నీరు ఆగదు. ఆమెకు కూడా 70 దాటాయి. కొడుకు దగ్గర ఉంటోంది. బాగా చూసుకుంటారు. కాని ఆమెకు ఇంకో ఇద్దరు కొడుకులు ఉన్నారు. వేరే ఊళ్లల్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. వారు తనతో మాట్లాడరని తాను చెప్పే మాటలు వినడానికి టైమ్ ఇవ్వరని ఆమె ఏడుస్తూ ఉంటుంది. ‘ఏమ్మా.. భోం చేశావా. ఉంటా‘ ఈ రెండు మాటలే ఆ కొడుకులు మాట్లాడేది. వాళ్లు చిన్నగా ఉన్నప్పుడు ఆమె కథలు చెప్పేది. సినిమా కథలు చెప్పేది. బంధువులపై ఫిర్యాదులు మాట్లాడేది. నాన్న కోపతాపాలను వారితో పంచుకునేది. ఇంకా ఏవేవో మాటలు పిల్లలతో చెప్పుకునేది. ఇప్పుడలా చెప్పుకోవడానికి లేదు. మాట్లాడటం కూడా ఒక మాత్ర వేసుకున్నంత ఆరోగ్యంతో సమానమే. కాని రమాదేవికి మాట్లాడే వాళ్లు లేరు. మాటలు వినేవారు లేరు. వినాలి... మనుషులు కావాలి మగవాళ్లు బజారులోకి ఎలాగో జారుకుంటూ వయసు మీద పడ్డాక. అపార్ట్మెంట్లో తమలాంటి మరో ఇద్దరు ముగ్గురు మగవాళ్లతో కింద సెక్యూరిటీ దగ్గర బాతాఖానీ వేస్తారు. లేదా టీకొట్టు దగ్గరో రచ్చబండ దగ్గరో ఎవరో ఒక మనిషి వారికి మాట్లాడటానికి దొరుకుతాడు. లేదంటే ఫోన్ పట్టుకుని డాబా మీదకు వెళ్లి ఎన్ని మాటలైనా మాట్లాడుకోవచ్చు. కాని వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలకు ఆ వెసులుబాటు లేదు. భర్త మరణించి ఉంటే ఆ ఒంటరితనం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఆడవారికి ఏ వయసు వచ్చినా ఇంకొకరి ఇళ్లకు వెళ్లి గంటలు గంటలు కూచుని మాట్లాడటానికి లేదు. పైగా ఇవాళ ఎవరి ఇంటికీ ఎవరినీ రానివ్వడం లేదు. పాత రోజుల్లో సాయంత్రమైతే అరుగుల మీద కూచుని ఇరుగుపొరుగు ఆడవాళ్లతో మాటలు నడిచేవి. ఇవాళ అరుగులు లేవు. ఇరుగుపొరుగు వాళ్లు సీరియళ్లలో, ఫోన్లలో బిజీగా ఉంటారు. ఎవరితో చెప్పుకోవాలి మేము అంటున్నారు ఈ వార్థక్యంలో ఉన్న స్త్రీలు. అపార్థాలు–అవస్థలు కొడుకు దగ్గర ఉంటున్న పెద్ద వయసు స్త్రీలు ఫోన్లు మాట్లాడితే తమ ఇంటి విషయాలు బయటకు చెప్తారన్న అనుమానంతో వారికి ఫోన్లకు దూరం చేస్తున్న ఘటనలు ఉన్నాయి. ఇంట్లో ఉన్న సభ్యులు మాట్లాడక బయటవారితో మాట్లాడనివ్వక ఇదో పెద్ద సంకటంగా మారుతోంది. ‘మీ అమ్మ చాడీలు చెబుతోంది నా మీద’ అని కోడలు అన్నా... ‘నేను నా భార్యను ఎంత నెత్తిన పెట్టుకుంటే నీకెందుకమ్మా’ అని కొడుకు అన్నా ఆమె మాటల మీదే అడ్డంకి. దాంతో ఇలాంటి స్త్రీలు మాకో హెల్ప్‌లైన్ ఉంటే బాగుండు... ముక్కు ముఖం వారితో ఏదో ఒకటి మాట్లాడుకుని గుండెల మీద భారం దించుకుంటాం అంటున్నారు. హెల్ప్‌లైన్ మానసిక సమస్యలు వినడానికి హెల్ప్‌లైన్స్ ఉన్నట్టే వార్థక్యంలో ఉన్న స్త్రీల మనసులో మాటలు ఆలోచనలు ఒత్తిడులు పంచుకోవడానికి ఊరికే ఊసుపోని కబుర్లు చెప్పడానికి అవతలి వైపు స్త్రీలు ఉండేలా హెల్ప్‌లైన్ ఉంటే చాలా బాగుంటుందని కొన్ని సూచనలు వస్తున్నాయి.భద్రతాపరమైన అంశాలను పాటిస్తూ ప్రభుత్వాలు ఇలాంటి హెల్ప్లైన్లు ఏర్పాటు చేయకపోతే వయోవృద్ధుల హృదయభారం మరింత పెరుగుతూనే ఉంటుంది. మాటలతో దిగిపోయే బరువును దింపాల్సిన బాధ్యత గురించి తప్పక ఆలోచన చేయాలి. -
బిజినెస్ స్కూళ్లలో నీరవ్, మాల్యా కేస్ స్టడీలు
సాక్షి, న్యూఢిల్లీ: గత దశాబ్దకాలంగా దేశాన్ని పట్టిపీడిస్తున్న భారీ కుంభకోణాల నేపథ్యంలో భారతదేశంలోని టాప్ ఐఐఎం సంస్థలు కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల పీఎన్బీ స్కాం, రుణ ఎగవేదారులు మోసగాళ్లు, ఉబెర్ వ్యవహారం తదితర కేస్ స్టడీస్‌ను పాఠ్యాంశాలుగా చేర్చాలని నిర్ణయించింది. ముఖ్యంగా కార్పొరేట్ నైతిక విలువలు, కార్పొరేట్ గవర్నెన్స్, కీలక సమయాల్లో నిర్ణయాత్మక నిర్ణయాలు వంటి అంశాలపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లు, ఇతర బిజినెస్ స్కూళ్లలో ప్రత్యేకంగా కోర్సులను రూపొందించనున్నాయి. వేలకోట్ల రూపాయలమేర భారతీయ బ్యాంకులకు అతి సులువుగా, అక్రమంగా ఎగవేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా, డైమండ్ కింగ్ నీరవ్ మోదీ సహా ఇతర భారీ మోసగాళ్లపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్మేనేజ్మెంట్(ఐఐఎంలు), ఐఐఎం-బెంగళూరు, ఐఐఎం-ఇండోర్‌సహా, జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్(ఎక్స్ఎల్ఆర్ఐ)జెమ్షెడ్పూర్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు విద్యార్థులకు వీటిని బోధించనున్నాయి. తద్వారా నైతిక విలువలు, కార్పోరేట్ గవర్నెన్స్, కార్పోరేట్ సామాజిక బాధ్యత గురించి విద్యార్ధులకు అవగాహన కల్పిస్తాయి. ఇందుకోసం నిపుణుల సమాచారం, సహాయంతో కోర్సులను రీడిజైన్ చేయనున్నాయి. కార్పొరేట్ పాలన, నీతి వంటి వివిధ కోర్సులద్వారా విద్యార్థుల్లో విజ్ఞానం నైపుణ్యం-నిర్మాణాత్మక లక్ష్యాలను అధిగమించటంతోపాటు, సమాజంలో సానుకూల మార్పు తీసుకురాగలవని తాము భావిస్తున్నామని ఐఐఎం బెంగళూరు చైర్పర్సన్ పద్మిని శ్రీనివాసన్ తెలిపారు. మేనేజర్స్ తమ కెరీయర్ ఎదురయ్యే ఎథికల్ డైలమా, సంఘర్షణల సమయంలో సరైన నిర్ణయం తీసుకునేలా తర్ఫీదు నిచ్చేందుకు ఈ కోర్సులను రూపొందిస్తున్నామన్నారు. ప్రస్తుత తరుణంలో మంచి నిపుణులైన బోధకుల అవసరం చాలా ఉందనీ, అలాంటి అత్యుత్తమ ఉపాధ్యాయులను గుర్తించాల్సి ఉందన్నారు. అలాగే విధాన రూపకర్తలు, విశ్లేషణలతో తమకున్న సంబంధాలు గత దశాబ్దాలుగా క్షీణిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. -
వితంతు కోడలికి ఆస్తిలో హక్కుంటుంది
అవని, ఆనంద్‌లది అన్యోన్యమైన దాంపత్యం. చక్కటి పిల్లలు. ఏ కొరతాలేని కుటుంబం. కానీ, లేనిదొక్కటే ఇరువురి తల్లిదండ్రుల ఆదరణ, అంగీకారం. కారణం... ఇరువురూ పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. పదేళ్లయినా పెద్దలు పట్టు వీడలేదు. వారి యోగక్షేమాలు పట్టించుకోలేదు. ఇక ఆనంద్ అమ్మానాన్నలైతే తమకు కోడుకే లేడన్నారు. ఇంతలోనే అనుకోని శరాఘాతం. గుండెపోటుతో ఆనంద్ హఠాన్మరణం. కుటుంబం వీధిపాలైంది. ఆనంద్ ఉన్నన్ని రోజులు అవని గుమ్మం దాటి వెళ్లలేదు. ఇప్పుడేమో షాక్‌కు లోనై బయటకు వెళ్లలేని పరిస్థితి. ఆదుకొనే నాథుడెవరూ లేరు. అవని స్నేహితురాలు, ఆనంద్ తల్లిదండ్రులను సంప్రదించింది. కోడలూ మనుమళ్లను ఆదుకోమని అర్థించింది. తమకు కొడుకే లేప్పుడు అవనితో మాకు సంబంధం లేదు అని నిర్దాక్షిణ్యంగా చెప్పారు. కనీసం కొడుకు ఆఖరి చూపుకోసమైనా రాలేదు. అవని స్నేహితురాలు అవని వివాహం గురించి ఆరా తీసింది. తరచి తరచి అడగ్గా ఆ పెండ్లి స్నేహితుల సమక్షంలో అయిందని, తర్వాత రిజిష్టర్ ఆఫీస్‌కు వెళ్లామని అవని తెలిపింది. అవని స్నేహితురాలు ఊపిరి పీల్చుకుంది. ఎందుకంటే అవని అత్తమామలు ఆమె వివాహం గురించి అనేక అభ్యంతరాలు లేవనెత్తారు. అసలామె కోడలేకాదన్నారు. ఆస్తి రాదన్నారు. కానీ ‘అవని-ఆనంద్‌ల వివాహం’ కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్ 2002 ప్రకారం రిజిష్టర్ చేయబడింది. ఈ చట్టం ఉద్దేశం వివాహాలు రిజిష్టర్ అయితే... బాల్యవివాహాలు జరగకుండా నిరోధించవచ్చు; అక్రమ వివాహాలని నియంత్రించవచ్చు; ఇంకా... బైగమీ, పాలీగమీ వంటి వివాహాలు జరుగకుండా చూసేందుకు, భర్త ఇంటిలో హక్కులను కోరేందుకు, భార్యలను వదిలేయకుండా భర్తలను నిరోధించేందుకు, దురదృష్టవశాత్తూ భర్తను కోల్పోయిన స్త్రీలకు వారసత్వ హక్కులు కోరేందుకూ అవకాశం ఉంటుంది. కనుక అవనికి, ఆమె పిల్లలకూ ఆస్తిలో వారసత్వ హక్కులు సంక్రమిస్తాయి. వివాహం పెద్దల నెదిరించి చేసుకున్నా ‘రిజిస్ట్రేషన్’ చేయించి ఆనంద్ మంచి పనిచేశాడు. ఇక అవని, ఆమె పిల్లలకు ఆస్తిలో వారసత్వ హక్కులు వస్తాయి. ఆమె వివాహాన్ని ఎవ్వరూ చెల్లదని తృణీకరించే అవకాశం లేదు. -
పసుపుతాడే దిక్కు!
-
పసుపుతాడే దిక్కు!
* ఒక్క పుస్తెలతాడు కూడా విడిపించలేదు * చంద్రబాబు బంగారు రుణాల మాఫీ తీరిదీ * బంగారు రుణమాఫీపై ‘సాక్షి’ ప్రత్యక్ష కేస్ స్టడీస్‌లో వెల్లడి * ఎన్నికల ప్రచారంలో తాకట్టు బంగారం విడిపిస్తానన్న బాబు * తాళిబొట్లను మీ ఇళ్లకు తెచ్చిస్తానంటూ నమ్మబలికిన వైనం * అధికారంలోకి వచ్చాక మాఫీని అటకెక్కించే ప్రయత్నం * జాబితాలో మూడో ప్రాధాన్యంలోకి బంగారం తాకట్టు రుణాలు * 90% బంగారు రుణాలకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు పేరు: తోటకూరు సుబ్బమ్మ (2 ఎకరాలు) ఊరు: నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కొమ్మిపాడు గ్రామం బంగారు రుణం: రూ. 70,000 మాఫీ: ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు నావద్ద ఉన్న బంగారం, పొలం పేపర్లు తాకట్టుపెట్టి 2011లో బ్యాంకులో రూ.70 వేలు రుణం తీసుకున్నా. ఆ డబ్బులతో మినుము, పెసర పంట వేశాం. టీడీపీకి ఓటేస్తే తీసుకున్న బాకీలన్నీ తీసేస్తానని ఎన్నికలప్పుడు చంద్రబాబు చెప్పారు. బాబు అధికారంలోకి వస్తారని వడ్డీ కూడా కట్టకుండా ఉండిపోయా. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. తీసుకున్న అప్పు పోతుందని ఆశపడ్డా. ఇప్పుడేమో ఒక్క రూపాయి కూడా తీసేయలేదు. తీసుకున్న అప్పు వెంటనే చెల్లించాలని బ్యాంకోల్లు నోటీసులు పంపారు. వడ్డీనే ఎక్కువైందంట. కట్టకపోతే నగలు వేలం వేస్తామని హెచ్చరిస్తున్నారు. అంత డబ్బు ఇప్పుడు ఎక్కడ నుంచి తేవాలి? ‘‘బంగారం తాకట్టు పెట్టి బ్యాంకుల్లో తెచ్చిన వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తా. తాకట్టులోఉన్న ఆడపడుచుల తాళిబొట్లను మీ ఇళ్లకు తెచ్చిస్తా. ఒక్క అవకాశం ఇవ్వండి. రైతు తలెత్తుకు తిరిగేలా సంపూర్ణ రుణ విముక్తుణ్ణి చేస్తా...’’ - ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఊరూరూ తిరిగి చెప్పిన మాట ఇది. ఒక్క పంట రుణాల మాఫీ అంటే మహిళల ఓట్లు పడవేమో అన్న అనుమానంతో చంద్రబాబు మహిళల బంగారం సెంటిమెంటునూ వాడుకున్నారు. తాకట్టులో ఉన్న బంగారు నగలను విడిపించే పూచీ తనదే అని ఊరూరా నమ్మబలికారు. అలా మహిళల ఓట్లను కొల్లగొట్టారు. అధికారంలోకి వచ్చాక ఆర్నెల్ల తర్వాత రుణ మాఫీ చేసేస్తున్నానని.. చేసేశానని ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు. కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్న 40 లక్షల ఖాతాల్లో.. ఒక్కరంటే ఒక్కరికి కూడా పుస్తెల తాడు చేతికి రాలేదు. అసలు వారిలో నూటికి 90 శాతం మందికి ఒక్క రూపాయి కూడా తొలి దశలోనే మాఫీ కాలేదు. మిగతా అరకొర మందికి తొలి దశలో ప్రకటించిన మాఫీ ఎంతో చూస్తే.. కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఆయా రుణాలకు చంద్రబాబు సర్కారు ప్రకటించిన మాఫీ సొమ్ము.. ఐదు విడతలు మొత్తం కలిపినా.. ఇప్పటివరకూ అయిన వడ్డీకి కూడా చాలటం లేదు. దీంతో.. వడ్డీతో సహా రుణం కట్టండి.. లేదంటే పుస్తెలు, నగలు వేలం వేస్తామంటూ బ్యాంకులు తాఖీదుల మీద తాఖీదులు పంపుతున్నాయి. ఆ నోటీసులు చేతపట్టుకుని రైతన్నలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎన్నికల్లో చంద్రబాబు మాటలు నమ్మి ఆయనను గెలిపించామని.. ఇప్పుడు నిలువునా మోసపోయామని రైతులు, మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. - సాక్షి నెట్వర్క్ రాష్ట్రంలో బంగారు నగలు తాకట్టు పెట్టి పంట రుణాలు పొందిన ఖాతాలు దాదాపు 40 లక్షల వరకూ ఉన్నాయి. తాకట్టు రుణాల మొత్తం దాదాపు రూ. 35 వేల కోట్లు. చంద్రబాబు హామీ మేరకు రుణ మాఫీ జరిగి బంగారు నగలను ఇంటికి తెచ్చుకున్న మహిళ ఒక్కరంటే ఒక్కరు కూడా ఇంతవరకూ రాష్ట్రంలో లేరు. రూ. 50 వేల లోపు ఉన్న రుణాలకు కూడా విడతల వారీగా రూ. 2 వేలు, రూ. 3 వేలు చెల్లింపులే ఉంటున్నాయి. ఈ లెక్కన ఐదేళ్లు దాటినా బ్యాంకులో నగలను విడిపించుకునే పరిస్థితులు లేవు. అసలు అప్పటివరకూ బ్యాంకులు వాటిని వేలం వేయకుండా ఆపి ఉంచే ప్రసక్తి అసలే ఉండదు. అంటే.. రైతులు తమ తిప్పలు తాము పడి అప్పు, వడ్డీ తీర్చుకుంటేనే వారి పుస్తెలు, నగలు చేతికందుతాయి. లేదంటే.. ఇళ్లలో ఆడపడుచులకు పసుపు తాడే దిక్కవుతుంది. కోటయ్య కమిటీతోనే.. రుణ మాఫీ విషయంలో బంగారం తాకట్టు రుణాలకు సంబంధించి చంద్రబాబు వేసిన కోటయ్య కమిటీలోనే కుట్రకు బీజం పడింది. కేవలం మహిళల పేర్లపై ఉన్న తాకట్టు రుణాలనే మాఫీ చేయాలని కోటయ్య కమిటీ సిఫారసు చేసింది. సామాన్యంగా రైతు కుటుంబాల్లో ఎక్కువ భాగం మగవారి పేరుపై భూములు ఉంటాయి. బంగారం తాకట్టు పెట్టి వ్యవసాయ రుణం పొందాలంటే విధిగా పొలం ఎవరి పేరుపై ఉంటే వారి పేరుపైనే బ్యాంకులో రుణం తీసుకోవడం సాధ్యమవుతుంది. కోటయ్య కమిటీ సిఫారసుల మేరకైతే మొత్తం బంగారు తాకట్టు రుణాల్లో 10 శాతం కూడా మాఫీ కిందకు రావు. ఈ విషయమై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావడంతో చంద్రబాబు రూటు మార్చారు. రుణ మాఫీ జీవోలో బంగారు తాకట్టు రుణాలను మూడో ప్రాధాన్యతా అంశంగా చేర్చారు. ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ను తెరపైకి తెచ్చి బంగారం తాకట్టు రుణాల మాఫీని దాదాపు అటకెక్కించారు. బ్యాంకుల్లో పంట రుణం తీసుకున్న తర్వాత కూడా పంటల సాగు క్రమంలో అనుకోకుండా వచ్చి పడే తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా చేజారిపోతున్న పంటను దక్కించుకునేందుకు రైతుకు అదనపు పెట్టుబడి అవసరం అవుతుంది. విధిలేని పరిస్థితుల్లో ఆడవారి మెడల్లో ఉన్న తులమో, రెండు తులాలో బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టి అదనపు పెట్టుబడి సమకూర్చుకుంటారు. ఈ పరిస్థితుల్లో బంగారు తాకట్టు రుణాలను ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ పరిధిలోకి తేవడమంటే.. ‘మాఫీ’ని అటకెక్కించడమే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. చివరి ప్రత్యామ్నాయంగానే.. ఎంతో అవసరమైతేగానీ మహిళలు తాళిబొట్టును తాకట్టు పెట్టరు. పుస్తెల తాడో.. చేతికున్న రెండు గాజులో.. బ్యాంకులో తాకట్టుకు తీసుకెళుతున్నప్పుడు రైతు కుటుంబం ఆవేదనతో తల్లడిల్లుతుంది. చేలో పంట ఒకవైపు పురుగుబారిన పడిపోతుంటే.. దాన్ని దక్కించుకోడానికి చేసే చివరి ప్రయత్నం బంగారం తాకట్టు పెట్టడం. ఇంతటి భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అంశాన్ని చంద్రబాబు ఎన్నికల అవసరానికి వాడుకోవడమే కాక.. పదవిలోకి రాగానే ఆడపడుచుల ఆశలను చిదిమేశారు! ఈ విషయమై ‘సాక్షి’ రాష్ట్రవ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో అన్నదాతల లోగిళ్లకు వెళ్లింది. బంగారు నగలు తాకట్టు పెట్టిన కుటుంబాలకు ‘మాఫీ’ ఏ మేరకు వర్తించిందని పరిశీలించింది. ‘సాక్షి’ పరిశీలనలో రుణ మాఫీ కింద బంగారు నగలను బ్యాంకు నుంచి విడిపించుకున్న ఒక్క కుటుంబమూ తారస పడలేదు. ఎవరిని పలుకరించినా ‘చంద్రబాబు ఇంతగా మోసం చేస్తాడనుకోలేదు’ అన్న నిట్టూర్పులే వినిపించాయి. ‘రెండున్నర ఎకరాల సాగుకోసం ఓ అయ్యకిచ్చిన కూతురి మెళ్లో పుస్తెలు తాకట్టు పెట్టా. రూ. 80 వేలు రుణం తీసుకున్నా. చంద్రబాబు హామీతో వడ్డీ కూడా కట్టలేదు. తీరా చూస్తే ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. నగలు విడిపించలేక.. అమ్మాయి ముఖం చూడలేక ఎంతగా సతమతమవుతున్నామో.. ఆ చంద్రబాబుకేం అర్థమవుతుంది’ అని కళ్ల నీళ్లు పెట్టుకున్న బొబ్బిలి మండలం కొత్తపెంట గ్రామం రైతు చోడవరపు సూర్యనారాయణ బాధను పంచుకునేదెవరు?! పేరు: పెంకి విజయనాయుడు (2.50 ఎకరాలు) ఊరు: శ్రీకాకుళం జిల్లా వంగర మండలం కె.కొత్తవలస గ్రామం బంగారు రుణం: రూ. 40,000 మాఫీ: ఒక్క రూపాయి కూడా కాలేదు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు... ‘‘బంగారు ఆభరణాలు తనఖా పెట్టి పట్టాదారు పాసుపుస్తకాలతో రూ. 40,000 పంట రుణం పొందాను. టీడీపీ గెలిస్తే రుణాలు మాఫీ చేస్తారని నమ్మి బాబుకు ఓట్లేశాం. రూపాయి కూడా మాఫీ కాలేదు.బ్యాంకులు, రెవె న్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి ఫిర్యాదు చేసినా ఫలితంలే దు.వ్యవసాయ శాఖ నుంచీ ఇంత వరకు సమాధానం లేదు.’’ పేరు: బీరవల్లి చంద్రశేఖర్‌రెడ్డి (3.40 ఎకరాలు) ఊరు: గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం పట్లవీడు బంగారు రుణం: రూ. 62,000 మాఫీ: ఒక్క రూపాయి కూడా కాలేదు వివరాలు లేవని మాఫీ చేయలేదు... ‘‘మిర్చి పంట సాగు చేసేందుకు పాసుపుస్తకం, బంగారు ఆభరణాలు తనఖా పెట్టి రూ. 62 వేలు రుణం తీసుకున్నా. అందులో ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. అదేమంటే.. మా కుటుంబ సభ్యుల వివరాలు నమోదు కాలేదని, అందుకే మాఫీ చేయలేదని చెప్పారు. మళ్లీ బ్యాంకులకు వివరాలు ఇచ్చాను. అయినా రుణ మాఫీ కాలేదు.’’ పేరు: కోడిరెక్కల సామ్రాజ్యం (1.5 ఎకరాలు) ఊరు: కృష్ణా జిల్లా మైలవరం మండలం మొర్సుమల్లి బంగారు రుణం: రూ. 28,500 (24 గ్రాములు) మాఫీ: ఒక్క రూపాయి కూడా కాలేదు రుణం కట్టాలంటున్నారు ‘‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో బంగారం కుదువ పెట్టి, 1.25 ఎకరాల కాయితాలు పెట్టి రూ. 28,500 వ్యవసాయానికి అప్పు తీసుకున్నాం. బ్యాంకు వాళ్లేమో నాలుగైదు సార్లు రుణం కట్టాలని వచ్చారు. వడ్డీతో కలిపి లోను రూ. 40 వేల వరకు అయింది. ప్రస్తుతం చేతిలో నయాపైసా లేక పంట వేయలేదు.’’ పేరు: శ్రీనివాసరెడ్డి (5 ఎకరాలు) ఊరు: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నాగసముద్రం బంగారు రుణం: రూ. 70,000 (భార్య గొలుసు) మాఫీ: ఒక్క రూపాయి కూడా కాలేదు పత్రాలన్నీ ఇచ్చినా మాఫీ కాలేదు... ‘‘ఐదెకరాల పొలంలో వేరుశనగ సాగు చేసేందుకు గతేడాది ఫిబ్రవరిలో ఎస్బీఐలో బంగారం తాకట్టు పెట్టి రూ. 70,000 రుణం తీసుకున్నా. దీనికి రూ. 4,160 వడ్డీ అయింది. బ్యాంకుల్లో పత్రాలన్నీ సమర్పించినా. కానీ ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో నా పేరు లేదు. బ్యాంకోళ్లను అడిగితే ఏమో తెలీదు అంటున్నారు.’’ పేరు: చోడవరపు సూర్యనారాయణ (2.5 ఎకరాలు) ఊరు: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కొత్తపెంట గ్రామం బంగారు రుణం: రూ. 80,000 (కూతురు పుస్తెలతాడు, నగలు) మాఫీ: ఒక్క రూపాయి కూడా కాలేదు మాఫీ లేదు... పుస్తెలూ లేవు... ‘‘నాకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. దానిలో చెరుకు, వరి పంట వేయడానికి నా కూతురుకు చెందిన పుస్తెల తాడు, ఇతర బంగారు గొలుసులు స్టేట్ బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాను.అది చాలక రూ. 30 వేల వరకూ ప్రైవేటు అప్పులు వడ్డీకి తెచ్చి సాగు చేశాను. పంట చేతికి వచ్చాక బంగారం ఇడిపించేద్దామనుకున్నాను. మాఫీ చేస్తారని ఆశతో అసలు వడ్డీ కట్టలేదు. కొత్త అప్పులు పుట్టడం లేదు. మాఫీ అవ్వడం లేదు. బాబు అందలం ఎక్కాక మాట తప్పాడు.’’ పేరు: లోకనాథరెడ్డి (3 ఎకరాలు) ఊరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి బంగారు రుణం: రూ. 1.22 లక్షలు (భార్య నగలు) మాఫీ: రూ. 5,861 ఐదేళ్లలో వడ్డీ కూడా తీరదు... ‘‘నేను 2012 మార్చిలో ఎస్బీఐలో పట్టాదారు పాసుపుస్తకంతో పాటు నా భార్య నగలు తాకట్టు పెట్టి, చెరకు పంట కోసం రూ. 1.22 లక్షలు రుణం తీసుకున్నా. అది వడ్డీతో కలిపి రూ. 1,55,802 అయ్యింది. తొలి విడత మాఫీ కింద రూ. 5,861 జమ అయ్యాయని బ్యాంకు వాళ్లు చెప్పారు. మొత్తంగా నాకు రూ. 29,304 మాత్రమే మాఫీ అయిందని అది ఐదు విడతలుగా ఇస్తారని చెప్పారు. అంటే.. నాకు ఇప్పటివరకూ పడిన వడ్డీ కూడా ఐదేళ్ల వరకూ తీరదు. ’’ పేరు: ఎ.డి.వి.ప్రసాద్ ఊరు: తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం గ్రామం బంగారు రుణం: రూ. 1.70 లక్షలు (భార్య నగలు) మాఫీ: ఒక్క రూపాయి కూడా కాలేదు కొత్త అప్పూ లేదు... ‘‘బంగారు నగలపై ఉన్న అప్పులు మాఫీ చేస్తానని, మీ బంగారం మీ ఇంటికి తెచ్చిస్తానని చంద్రబాబు చెప్పిన మాటలు నమ్మాం. ఇంట్లో ఆడవాళ్లు అయితే పూర్తిగా నమ్మేశారు. ఇంత పచ్చి మోసం చేస్తాడనుకోలేదు. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఇంతవరకు బ్యాంకు అధికారులు రుణమాఫీపై ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటున్నారు. ఉన్న అప్పు తీరక కొత్తగా అప్పు పుట్టక రైతులందరం నానా అవస్థలు పడుతున్నాం.’’ పేరు : సయ్యద్ షకీల్ అహమ్మద్ ఊరు : వైఎస్ఆర్ జిల్లా చిన్నమండెం మండలం చాకిబండ కస్పా బంగారు రుణం : రూ. 54,000 మాఫీ : ఇంత వరకు ఏమీ కాలేదు ప్రభుత్వం మాయ మాటలు చెప్తోంది... ‘‘చిన్నమండెం ఎస్బీఐ బ్రాంచ్‌లో 2012 మే 11వ తేదీన బంగారం తాకట్టు పెట్టి, నాకు ఉన్న 3.50 ఎకరాల పట్టాదారు పాసుపుస్తకాల జిరాక్స్ పెట్టి రూ. 54,000 అప్పు తీసుకున్నాను. అది ఇప్పటి వరకు వడ్డీతో కలిపి మొత్తం రూ. 60,934 అయ్యింది. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. రేషన్‌కార్డు, ఆధార్ కార్డు నంబర్లు కరెక్టుగానే కంప్యూటర్లో నమోదు అయినా.. అవి తప్పుగా ఉన్నాయని రిపోర్టు వచ్చినట్లు బ్యాంకర్లు, రెవెన్యూ సిబ్బంది అంటున్నారు. ’’ పేరు: అంకిరెడ్డిపల్లె తిరుపాల్‌రెడ్డి (2 ఎకరాలు) ఊరు: కడప జిల్లా, చాపాడు మండలం, చియ్యపాడు గ్రామం రుణం: రూ.54,000 మాఫీ: రూ. 2,626 నమ్మించి మోసం చేస్తున్నాడు... ‘‘పంట కోసం 2011లో బంగారం తాకట్టు పెట్టి రూ. 54,000 రుణం తీసుకున్నాను. అప్పటి నుంచి పంట సరిగా రాలేదు. ఎన్నికల ముందు చంద్రబాబు పంట, బంగారు రుణాలన్నీ మాఫీ చేస్తామన్నాడు. గెలిచిన తర్వాత కూడా మాఫీ చేస్తానన్నాడు. తీరా చేయాల్సిన సమయం రాగానే నమ్మించి మోసం చేస్తున్నాడు. ఐదేళ్లలో రూ. 13,131 మాత్రమే మాఫీ అవుతుందని బ్యాంకు వాళ్లు చెప్పారు. మిగిలిన అప్పు చెల్లిస్తే కొత్త రుణం ఇస్తామంటున్నారు. ’’ పేరు : ఇసరపు అప్పయ్యమ్మ (2.74 ఎకరాలు) ఊరు : విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం రామయ్యపట్నం గ్రామం, బంగారు రుణం : రూ. 45,000 మాఫీ : ఒక్క రూపాయి కూడా కాలేదు అటూ ఇటూ తిప్పుతున్నారు... ‘‘నేను ఏటా చెరకు సాగు చేసుకుంటున్నాను. 2013 సెప్టెంబర్‌లో పెదగుమ్ములూరు గ్రామీణ వికాస్ బ్యాంకు నుంచి పాస్‌పుస్తకాలు పెట్టి రూ. 45,000 రుణం తీసుకుని పెట్టుబడి పెట్టాను. అదిప్పుడు రూ. 54 వేలైంది. భారీ వర్షాలు, జల్ తుపానులతో పంట పూర్తిగా దెబ్బతిన్నది. 2014లో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రూ. 3 వడ్డీకి అప్పు చేసి మళ్లీ పంట పెట్టాను. జాబితాలో నా పేరులేదు. అడిగితే ఆఫీసుల చుట్టూ అదే పనిగా తిప్పుతున్నారు.’’ -
కేస్ స్టడీస్‌కు ప్రాధాన్యం ఎక్కువ
మై క్యాంపస్ లైఫ్ - ఐఐఎం- కోల్‌కతా కోల్‌కతా.. భారతదేశ తూర్పుతీరంలో.. హుగ్లీనది ప్రవాహ హోయలతో అలరారే అందమైన నగరం. బ్రిటిష్ ఇండియాకు తొలి రాజధాని. అంతేకాదు.. గీతాంజలితో.. ప్రపంచవ్యాప్తం గా అందరి గుర్తింపు పొందిన రవీంద్రనాథ్ ఠాగూర్.. సేవామూర్తి మదర్ థెరిస్సా నడయాడిన నేల. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి వెలుగెత్తి చాటిన స్వామి వివేకానందుడు.. మొక్కలకు ప్రాణం ఉందని నిరూపించిన ప్రఖ్యాత శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్‌లు ఇక్కడివారే. ఇక.. ఆ రోజుల్లోనే ఇండియన్ సివిల్ సర్వీసు (నేటి ఐఏఎస్)కు ఎంపికైనా.. దేశమాత దాస్య శృంఖలాలు తెంచడానికి.. తన ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలి, జైహింద్ నినాదాలతో బ్రిటిష్‌వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన భరతమాత ముద్దుబిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ విద్య నేర్చిందీ ఇక్కడే. ఇలా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సేవ, పరిశోధన వంటి అన్ని రంగాల్లోనూ స్వాత్రంత్యానికి ముందే తనదైన ముద్ర వేసిన ఈ నగరం.. అత్యుత్తమ మేనేజ్మెంట్ విద్యకు.. శిఖరంలా భాసిల్లుతోంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)- కోల్‌కతా ఇక్కడే కొలువు దీరింది. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (పీజీడీఎం) ద్వితీయ సంవత్సరం చదువుతున్న పల్లా రవితేజ తన క్యాంపస్ లైఫ్‌ను మనతో పంచుకుంటున్నారు. వివరాలు.. ఐఐటీ - మద్రాస్‌లో బీటెక్ చేశా మాది వైజాగ్. నాన్న రైల్వే డీఎస్పీగా పనిచేస్తున్నారు. అమ్మ గృహిణి. తమ్ముడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)- ఖరగ్‌పూర్‌లో కెమికల్ ఇంజనీరింగ్ చదువు తున్నాడు. నేను ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు వైజాగ్‌లో నే విద్యనభ్యసించాను. స్కూల్ డేస్‌లో వివిధ పోటీల్లో పతకాలు కూడా వచ్చాయి. పదో తరగతిలో (ఐసీఎస్ఈ సిలబస్) 92 శాతం మార్కులు, ఇంటర్మీడియెట్‌లో 911 మార్కులు సాధించాను. తర్వాత జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 236వ ర్యాంకుతో ఐఐటీ మద్రాస్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చదివాను. 6.82 సీజీపీఏతో బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించాక.. ఏడాదిపాటు పుణెలోని టాటా మోటార్స్‌లో సిస్టమ్ మేనేజర్ గా పనిచేశాను. ఆ తర్వాత కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)లో విజయం సాధించి ఐఐఎం - కోల్‌కతాలో చేరాను. దేశంలో మొదటి ఐఐఎం- కోల్‌కతా మేనేజ్మెంట్లో పీజీ కోర్సులు, పరిశోధనల కోసం దేశంలోని 13 ఐఐఎంల్లో తొలిగా ఏర్పడిన ఇన్స్టిట్యూట్.. ఐఐఎం- కోల్‌కతా. 1961లో నాటి కేంద్ర ప్రభుత్వం.. ఫోర్డ్ ఫౌండేషన్, భారతీయ పరిశ్రమల సమాఖ్య, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం, ఆల్ఫెడ్ పి. సోలన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ సహకారంతో ఐఐఎంను ఏర్పాటు చేసింది. ఇక్కడ వివిధ స్పెషలైజేషన్లలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్, డాక్టోరల్ ప్రోగ్రామ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఎగ్జిక్యూటివ్స్ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. సకల సదుపాయాలతో అలరారే క్యాంపస్ క్యాంపస్ మొత్తం 135 ఎకరాల్లో ఉంటుంది. కమలాలతో విలసిల్లే ఎన్నో చెరువులు, పచ్చని గడ్డి మైదానాలు, వృక్షాలతో.. ఉద్యానవనంలా కనిపిస్తోంది. విశాలమైన తరగతి గదులు ఉంటాయి. విద్యార్థులు చదువుకోవడానికి తెల్లవార్లూ తెరిచి ఉండే లైబ్రరీ, 750మందికి పైగా కూర్చొనే సౌకర్యం గల ఆడిటోరియం, క్రీడా మైదానం.. క్యాంపస్‌కే ప్రధాన ఆకర్షణ లు. ప్రవేశం లభించిన ప్రతి విద్యార్థికీ హాస్టల్ సదుపాయం కల్పిస్తారు. అల్పాహారం, భోజనం బాగుంటుంది. ఇన్స్టిట్యూ ట్ అంతా వై-ఫై సౌకర్యం ఉంది. స్పెషలైజేషన్లు ఎన్నో రెండేళ్ల పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (పీజీడీఎం) కోర్సులో భాగంగా ఎన్నో స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. మొదటి ఏడాది అందరికీ కామన్‌గా అన్ని అంశాలపై అవగాహన కల్పిస్తారు. రెండో సంవత్సరంలో విద్యార్థులు తమకు నచ్చిన స్పెషలైజేషన్‌ను ఎంచుకోవచ్చు. లేదంటే అందుబాటులో ఉన్న అన్ని స్పెషలైజే షన్లను చదివే అవకాశం ఉంటుంది. ట్రైమిస్టర్ విధానంలో కోర్సు ఉంటుంది. ఏడాదికి మూడు ట్రైమిస్టర్లు ఉంటాయి. ప్రతి ట్రైమిస్టర్లో పరీక్షలు ఉంటాయి. సమస్యల అధ్యయనం.. మేనేజ్మెంట్ అంటేనే.. నిర్వహణ, సమస్యలను పరిష్కరించడం. ఇందుకు అనుగుణంగానే ఇక్కడ బోధన ఉంటుంది. ఉదయం 8.30 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు క్లాసులుంటాయి. ఈ సమయంలో వీలును బట్టి తరగతులు నిర్వహిస్తారు. ఒక్కో పీరియడ్ వ్యవధి గంటన్నర. సాధారణంగా వారానికి 12 క్లాసులు ఉంటాయి. థియరీతో పాటు ప్రాక్టికల్స్‌కు పెద్దపీట వేస్తారు. కేస్ స్టడీస్‌ను ఎక్కువగా అధ్యయనం చేస్తుంటాం. అంతేకాకుండా ప్రస్తుతం వివిధ కంపెనీల్లో తలెత్తుతున్న సమస్యలను కేస్ స్టడీస్‌గా తీసుకుని పరిష్కార మార్గాలను అన్వేషిస్తాం. తద్వారా సంబంధిత సమస్య మాకు ఎదురైతే ఎలా ఎదుర్కోగలమో తెలుసు కుంటాం. స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్‌లో భాగంగా వేరే ఇన్స్టిట్యూట్లను సందర్శిస్తుంటాం. వీటి ద్వారా వివిధ అంశాలపై శిక్షణ పొందుతాం. ఏటా సమ్మర్లో రెండు నెలల పాటు ఇంటర్న్‌షిప్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఈ సమయంలో నెలకు రూ.50,000 వరకు స్టెఫండ్ అందిస్తారు. ఇంక్యుబేషన్.. ఇన్నోవేషన్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం వద్దనుకుని.. యువ వ్యాపారవేత్తలుగా రాణించాలనుకునేవారి కోసం ప్రత్యేకంగా ఇంక్యుబేషన్ సెల్ ఉంది. కొత్త స్టార్టప్‌ను ప్రారంభించాలను కునేవారికి ఆఫీసు కోసం కార్యాలయం కేటాయిస్తారు. స్టార్టప్ విజయవంతం కావడానికి కావాల్సిన సూచనలు, సలహాలు, సాంకేతిక సహకారం కూడా అందిస్తారు. స్టార్టప్‌కు అవసరమైన ఆర్థిక వనరులను కూడా సమకూరుస్తారు. ఇంక్యుబేషన్ సెంటర్‌తోపాటు ఇన్నోవేషన్ పార్క్ కూడా ఉంది. ఇక్కడ వివిధ సమస్యలను అధ్యయనం చేస్తుంటారు. గత ఐదేళ్ల నుంచి ఇప్పటివరకు క్యాంపస్‌లో 40కు పైగా స్టార్టప్‌లు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. అలుమ్ని అసోసియేషన్ సేవలెన్నో క్యాంపస్‌లో విద్యనభ్యసించి వివిధ కంపెనీల్లో మంచి హోదాల్లో ఉన్నవారు.. సొంతంగా వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్నవారి నుంచి ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహం ఉంటుంది. ప్రతి డిసెంబర్లో పూర్వ విద్యార్థులు క్యాంపస్‌ను సందర్శి స్తుంటారు. ప్రస్తుత విద్యార్థులకు వివిధ అంశాలపై గెస్ట్ లెక్చర్స్ కూడా ఇస్తారు. విజయవంతమైన గ్రాడ్యుయేట్‌గా, మేనేజర్‌గా ఎదగడానికి సూచనలు, సలహాలు అందిస్తారు. ప్లేస్‌మెంట్స్ విషయంలోనూ సహాయపడతారు. http:// alumninet.iimcal.ac.in/ద్వారా నిత్యం పూర్వ విద్యార్థులతో అందుబాటులో ఉండొచ్చు. ప్రతిభావంతులకు పురస్కారాలు పీజీడీఎం కోర్సు రెండేళ్లలో అన్ని ఖర్చులు కలుపుకుని దాదాపు రూ.20 లక్షలు అవుతుంది. అయితే ప్రవేశం లభించిన విద్యార్థులకు ఎలాంటి గ్యారెంటీ, సెక్యూరిటీ అవసరం లేకుండానే బ్యాంకులు రుణాలిస్తున్నాయి. ప్రతిభావంతులకు నగదు పురస్కారాలను కూడా ఇన్స్టిట్యూట్ అందిస్తోంది. క్యాంపస్‌లో తరచుగా నిర్వహించే బిజినెస్ కాంపిటీషన్స్‌లో బెస్ట్ ఐడియాలు ఇచ్చినవారికి నగదు బహుమతులు కూడా ఉంటాయి. ఇవేకాకుండా ప్రతి ఏటా జనవరిలో మేనేజ్మెంట్ ఫెస్ట్, ఫిబ్రవరిలో కల్చరల్ ఫెస్ట్ కూడా నిర్వహిస్తారు. ఇందులో విజేతలకు వివిధ బహుమతులు ఇస్తారు. లెక్కకు మిక్కిలి.. ప్లేస్‌మెంట్స్ ఐఐఎంలు అంటేనే.. భారీ వేతనాలు అందించే ప్లేస్‌మెంట్స్‌కు పెట్టింది పేరు. ప్రతి ఏటా వేసవిలో ఎన్నో కంపెనీలు, పరిశ్రమలు ఇన్స్టిట్యూట్లో ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తాయి. విశాఖలో కంపెనీ ఏర్పాటు చేస్తా ప్రస్తుతానికి నా లక్ష్యం.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో మంచి ఉద్యోగం సాధించడం. పదేళ్లపాటు ఉద్యోగం చేసి ఆర్థికంగా నిలదొక్కుకున్నాక.. విశాఖపట్నంలో సొంతంగా ఏదైనా కంపెనీని ఏర్పాటు చేస్తా.