
150 ఎంబీబీఎస్ సీట్లకు కోత
- 2017-18కుగాను అనుమతి నిరాకరించిన ఎంసీఐ
- ఉస్మానియాలో తగ్గిపోయిన 50 ఎంబీబీఎస్ సీట్లు
- నిజామాబాద్ కాలేజీలోని మొత్తం 100 సీట్లూ గల్లంతు
- తగిన సిబ్బంది, మౌలిక సదుపాయాల లేమే కారణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 150 ఎంబీబీఎస్ సీట్లకు కోత పడింది. 2017-18 సంవత్సరానికి సంబంధించి ఉస్మానియా మెడికల్ కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లు, నిజామాబాద్ మెడికల్ కాలేజీలోని మొత్తం 100 ఎంబీబీఎస్ సీట్లకు భారత వైద్య మండలి (ఎంసీఐ) అనుమతి నిరాకరించింది. లేబొరేటరీ, లైబ్రరీ, సిబ్బంది, తగిన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే మౌలిక వసతులు లేకపోవడంపై ఈ సందర్భంగా ఎంసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది.
నిబంధనలను పాటించరా?
వచ్చే ఏడాదికిగాను మెడికల్ సీట్ల భర్తీకి అనుమతి కోసం ఈ కాలేజీలు ఎంసీఐకి దరఖాస్తు చేసుకున్నారుు. ఈ మేరకు ఆయా కాలేజీల్లో పరిస్థితులపై పరిశీలన జరిపిన ఎంసీఐ.. నిబంధనల మేరకు లేకపోవడంతో కఠిన నిర్ణయం తీసుకుంది. ఉస్మానియా వైద్య కళాశాలలో మొత్తంగా 250 ఎంబీబీఎస్ సీట్లుండగా.. అందులో 50 సీట్లకు కోత పడింది. నిజామాబాద్ మెడికల్ కాలేజీలోని మొత్తం 100 ఎంబీబీఎస్ సీట్లూ రద్దయ్యారుు. వాస్తవానికి 2013-14లో ఉస్మానియాలో 50 సీట్ల పెంపునకు ఎంసీఐ అనుమతి ఇచ్చింది. పెరిగిన సీట్లకు అనుగుణంగా మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలు, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లను నియమించాలని ఆదేశించింది. కానీ ఇప్పటికీ ఎంసీఐ నిబంధనలకు తగ్గట్లుగా చర్యలు చేపట్టలేదు.
ప్రమాణాలకు పాతర
ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంసెట్ టాప్ ర్యాంకర్లు చేరుతుంటారు. అలాంటి కాలేజీలో మౌలిక సదుపాయాలు లేకపోతే ఎలా, దీనికి బాధ్యులెవరనే ప్రశ్నలు తలెత్తుతున్నారుు. ఎంసీఐ నిబంధనల ప్రకారం మెడికల్ కాలేజీలో నిర్ణీత సంఖ్యలో పడకలు, లేబొరేటరీలు, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. సెంట్రల్ లైబ్రరీ, హాస్టల్ భవనం, తరగతి గదులు, రెసిడెన్షియల్ క్వార్టర్లు, మందులు నిర్ణీత పరిమాణంలో తప్పనిసరిగా ఉండాలి. ఎంసీఐ నిబంధనల ప్రకారం 100 సీట్లున్న మెడికల్ కాలేజీలో మొదటి బ్యాచ్ ప్రారంభ మయ్యేప్పుడు ఫ్యాకల్టీ 58 మంది, రెసిడెంట్లు 45 మంది ఉండాలి. మొదటి ఏడాది రెన్యువల్ చేసే సమయంలో రెండో బ్యాచ్ ప్రారంభ సమయంలో ఇవే సీట్లకు 85 మంది ఫ్యాకల్టీ, 47 మంది రెసిడెంట్లు ఉండాలి. ఇలా ఐదో బ్యాచ్ వచ్చే సమయానికి (నాలుగో ఏట నుంచి ఐదో ఏడాదికి రెన్యువల్ సమయానికి) 105 మంది ఫ్యాకల్టీ, 67 మంది రెసిడెంట్లు ఉండాలి. కానీ ఎంసీఐ తనిఖీలకు వచ్చినప్పు డు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది సగానికి మించి ఉండటం లేదనే విమర్శలున్నారుు. దాంతో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు తదితర అధ్యాపక సిబ్బందిని తాత్కాలికంగా బయటి నుంచి తీసుకొచ్చి చూపి ఎంసీఐని పక్కదారి పట్టిస్తున్నట్లుగా ఆరోపణలున్నారుు.
మహబూబ్‌నగర్‌లోనూ ఇదే పరిస్థితి?
రెండేళ్ల క్రితం ఉస్మానియా, కాక తీయ మెడికల్ కాలేజీల్లో మౌలిక వస తులు లేకపోవడంపై ఎంసీఐ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది నుంచి మహబూబ్‌నగర్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభమైం ది. కానీ ఇప్పటివరకు పూర్తిస్థారుులో మౌలిక వసతులు సమకూర్చలేదు. మొత్తం 400పైగా అధ్యాపక, అధ్యాపకే తర సిబ్బందిని నియమించాలని నిర్ణ రుుంచినా... చాలా మందిని కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తున్నారు. అలాగే అక్కడ భవనాల నిర్మాణం, మౌలిక సదు పాయాల కల్పన వంటివీ పూర్తికాలేదు. జిల్లా ఆస్పత్రినే బోధనాస్పత్రిగా చూపించడం గమనార్హం.