
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 15వ తేదీ (శుక్రవారం) విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. విజయనగరం మెడికల్ కాలేజీ ప్రాంగణం నుంచి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీ (విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల)లను వర్చువల్‌గా ప్రారంభిస్తారు.
ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహావిష్కరణ, తర్వాత నూతన మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం, ల్యాబ్‌ల పరిశీలన, మిగిలిన 4 మెడికల్ కాలేజీల వర్చువల్ ప్రారంభోత్సవం తర్వాత సీఎం ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం బయలుదేరి తాడేపల్లి నివాసానికి తిరిగి చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment