నేటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం నేటి నుంచి (18వ తేదీ) 23 వర కు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు ప్రవేశాల కమిటీ తెలిపింది. ప్రతిరోజూ రెండు దశలుగా వెరిఫికేషన్‌ను కమిటీ చేపట్టనుంది. ఉదయం 9 గంటలకు తొలిదశ వెరిఫికేషన్, మధ్యాహ్నం 12:30 గంటలకు రెండో దశ వెరిఫికేషన్ ఉంటుంది. ఎంసెట్‌లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా సర్టిఫికెట్ల వెరి ఫికేషన్ చేపట్టే హెల్ప్‌లైన్ కేంద్రాలు, ఇతర పూర్తి వివరాలను తమ వెబ్‌సైట్‌లో (tseamcet. nic.in) పొందవచ్చని కమిటీ పేర్కొంది.
విద్యార్థులకు సూచనలు..
సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యే విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు సెట్ల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు వెంట తెచ్చుకోవాలి. అలా గే ఎంసెట్ ర్యాంకు కార్డు, హాల్‌టికెట్, ఇంటర్ మార్కుల మెమో, పాస్ సర్టిఫికెట్, పదో తరగతి మార్కుల మెమో, ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, జనవరి 1 తరువాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం మొదలైనవాటిని వెంట తెచ్చుకోవాలి. ప్రాసెసింగ్ ఫీజు కింద ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 800, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 400 చెల్లిం చాలి.
వికలాంగులు, ఎన్‌సీసీ కోటా, ఆంగ్లో-ఇండియన్, స్పోర్ట్స్ కోటా విద్యార్థులకు ఈ నెల 18 నుంచి 21 వరకు హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్యాభవన్‌లో సర్టిఫికె ట్ల వెరిఫికేషన్ చేపడతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ విద్యార్థులకు 18 నుంచి 23 వరకు ర్యాంకులవారీగా నిర్ణీత కేంద్రాల్లో వెరిఫికేషన్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ, ఎస్టీ విద్యార్థులకు వేర్వేరుగా హెల్ప్‌లైన్‌కేంద్రాలను ఏర్పాటు చేశారు. వివరాలను వెబ్‌సైట్‌లో (tseamcet. nic.in) పొందవచ్చు.