20న విశాఖలో డీ పార్మశీ విద్యార్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన
Published Wed, Aug 17 2016 11:45 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
ఎచ్చెర్ల: జిల్లాలోని శ్రీకాకుళం ప్రభుత్వ మహిళలు పాలిటెక్నిక్ కళాశాల, ఎచ్చెర్ల ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలతో పాటు పలు కళాశాలల్లో డీ ఫార్మశీ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ఈనెల 20న విశాఖపట్నంలోని కంచరపాలేం వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని సహాయ కేంద్రంలో జరగనుంది. ఇక్కడ ధృవీకరణ పత్రాలు పరిశీలించనున్నట్లు శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.త్రినాథరావు తెలిపారు. గతం లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు హా జరు కావాలని సూచించారు. ధృవీకరణ పత్రాల పరిశీలన అనంతరం, విద్యార్థులు కళాశాలల ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు. మొదటి ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు ఒకే రోజులు పత్రాలు పరిశీలిస్తారని తెలిపారు. ఒరిజనల్ ధృవీ కరణ పత్రాలు, జిరాక్సు పత్రాలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో పాటు హాజరు కావాలని సూచించారు.
Advertisement
Advertisement