సహాయ కేంద్రంలో ధృవీకరణ పత్రాలు పరిశీలిస్తున్న దృశ్యం
ఎంబీఏ, ఎంసీఏ ప్రథమ ఏడాది ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ రెండో విడత కౌన్సెలింగ్ మంగళవారం ప్రారంభమైంది. శ్రీకాకుళం పురుషుల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని సహాయ కేంద్రంలో ధృవీకరణ పత్రాలు పరిశీలించారు. తొమ్మిది మంది విద్యార్థులు ధృవీకరణ పత్రాలు పరిశీలనకు హాజరయ్యారు.
ఎచ్చెర్ల : ఎంబీఏ, ఎంసీఏ ప్రథమ ఏడాది ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ రెండో విడత కౌన్సెలింగ్ మంగళవారం ప్రారంభమైంది. శ్రీకాకుళం పురుషుల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని సహాయ కేంద్రంలో ధృవీకరణ పత్రాలు పరిశీలించారు. తొమ్మిది మంది విద్యార్థులు ధృవీకరణ పత్రాలు పరిశీలనకు హాజరయ్యారు. వీరిలో ఓసీ, బీసీ విద్యార్థులు 8 మంది, ఎస్సీ, ఎస్సీ కేటగిరిలో ఒకరు హాజరయ్యారు. ధృవీకరణ పత్రాలు పరిశీలన పూర్తయిన విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. క్యాంపు ఆఫీసర్ ఆర్.త్రినాధరావు, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్ టీవీ రాజశేఖర్ కౌన్సెలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు.