మొదటి సెషన్‌లో 89.81 శాతం..
రెండో సెషన్‌లో 90.78 శాతం హాజరు
కేయూ క్యాంపస్: రాష్ట్రంలో ఏంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకుగాను టీఎస్ ఐసెట్‌ను బుధవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 116 కేంద్రాల్లో నిర్వహించారు. ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ పద్ధతిన జరిగిన ఈ ప్రవేశ పరీక్షకు నిమిషం నిబంధన ఉండడంతో అభ్యర్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి వరంగల్ కాకతీయ యూనివర్సిటీలోని టీఎస్ ఐసెట్ కార్యాలయంలో ఉదయం 8గంటలకే ప్రశ్నపత్రం సెట్‌ను డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు.
ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12–30గంటల వరకు మొదటి సెషన్ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని111 పరీక్ష కేంద్రాల్లో 27,801మంది అభ్యర్థులకు గానూ 25,086 మంది హాజరు(90.2శాతం) కాగా, ఏపీలోని నాలుగు కేంద్రాల్లో 1,130మంది అభ్యర్థులకు గానూ 896మంది (79.3శాతం) హాజరయ్యారని టీఎస్ ఐసెట్ కన్వీనర్, కాకతీయ యూ నివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంటు కళాశాల ప్రొఫెసర్ ఎస్.నర్సింహాచారి వెల్లడించా రు. గురువారం జరిగే మొదటి సెషన్‌తో ఈ ప్రవేశ పరీక్ష ముగుస్తుందని నర్సింహాచారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment