
కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన
ఎస్కేయూ : ఎస్కేయూ సెట్ (2017) కౌన్సెలింగ్‌లో భాగంగా నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల పరిశీలన రెండో రోజూ కొనసాగింది. కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్సెస్ విభాగాలకు సంబంధించి మొత్తం 679 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా, 381 మంది హాజరైనట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ బీవీ రాఘవులు తెలిపారు. కౌన్సెలింగ్‌కు అన్ని రకాల ఒరిజినల్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.