నిన్న ఏపీ సచివాలయం.. నేడు హైకోర్టు | Rain Water Enters Into AP High Court Building | Sakshi
Sakshi News home page

ఏపీ హైకోర్టు ఆవరణలోకి వర్షపు నీరు

Published Wed, Sep 18 2019 4:16 PM | Last Updated on Wed, Sep 18 2019 5:50 PM

Rain Water Enters Into AP High Court Building - Sakshi

వర్షపు నీటిని బయటకు తోడి పోస్తున్న సిబ్బంది

సాక్షి, అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆవర్తనంతో రాష్ట్రంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో అమరావతిలోనూ బుధవారం భారీ వర్షం కురుస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చంద్రబాబు నిర్మించిన వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అమరావతి అతలాకుతలం అయిపోతోంది. చదరపు అడుగుకి ఏకంగా రూ. 11 వేలు వెచ్చించి నిర్మించిన అమరావతిలోని టెంపరెరీ భవనాలు.. వర్షపు నీటితో నిండిపోయాయి. 

వర్షపు నీరు నిన్న, ఈరోజు ఏకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లాబీల్లోకి రావటంతో.. కూలర్లు అన్నీ బయట పడేసి..  సిబ్బంది నీటిని ఎత్తిపోస్తున్నారు. గతంలో ఇదే పరిస్థితి తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయంలో కనిపించింది. ఈ విడత హైకోర్టు వంతు వచ్చింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం తరహాలోనే హైకోర్టు భవనంలోని పలు ఛాంబర్లలో సీలింగ్‌ నుంచి వర్షపు నీరు లీకైంది. దీంతో హైకోర్టు ఆవరణలోకి వచ్చిన వర్షపు నీటిని అక్కడ సిబ్బంది తోడి బయటపోశారు. 


జలమయం అయిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఫోటోలు

గతంలో కూడా  ఏపీ సచివాలయంలోని మంత్రుల ఛాంబర్లలోకి నీరు చేరిన విషయం తెలిసిందే. భారీ వర్షాలకు మంత్రులు ఛాంబర్‌ల్లో సీలింగ్‌ ఊడిపడి, ఏసీల్లోకి వర్షపు నీరు వచ్చింది. తాజాగా వర్షపు నీటితో.. హైకోర్టు భవన నిర్మాణం చేపట్టిన కంపెనీ డొల‍్లతనం మరోసారి బయటపడినట్లు అయింది.


 కూలర్లు అన్నీ బయట పడేసి నీటిని తోడుతున్న సిబ్బంది..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement