సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు నేడు ప్రమాణం చేశారు. జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి, జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జున రావులతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తులుగా ప్రమాణం చేయించారు.
ఈ మేరకు గురువారం రాష్ట్ర హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో ఇరువురు న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. కాగా, వీరిద్దరూ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తూ న్యాయమూర్తులుగా నియమించబడ్డారు. ఈ ప్రమాణ కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఘంటా రామారావు, ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు జానకి రామిరెడ్డి, రిజిష్ట్రార్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment