ఆది.. అంతం.. అవార్డు.. | Mark littlejohn gets Landscape Photographer of the Year award | Sakshi
Sakshi News home page

ఆది.. అంతం.. అవార్డు..

Published Thu, Nov 13 2014 3:34 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

ఆది.. అంతం.. అవార్డు..

ఆది.. అంతం.. అవార్డు..

ఎక్కడో పర్వతాల్లో పుట్టిన ఏరు పారుతూ.. పర్వత పాదాలను తాకుతూ అంతర్థానమైపోతున్న అద్భుత దృశ్యం. స్కాట్లాండ్‌లోని గ్లెన్‌కో పర్వతాల్లో పారుతున్న ఈ ఏరు ఆది..

ఎక్కడో పర్వతాల్లో పుట్టిన ఏరు పారుతూ.. పర్వత పాదాలను తాకుతూ అంతర్థానమైపోతున్న అద్భుత దృశ్యం. స్కాట్లాండ్‌లోని గ్లెన్‌కో పర్వతాల్లో పారుతున్న ఈ ఏరు ఆది.. అంతాన్ని ఒకే ఫొటోలో బంధించారు బ్రిటన్‌లోని కంబ్రియాకు చెందిన ఫొటోగ్రాఫర్ మార్క్ లిటెజాన్. వర్షపు నీటి వల్ల ఏర్పడిన ఈ ఏరు మొత్తాన్ని ఒకే ఫొటోలో క్లిక్‌మనిపించిన మార్క్‌కు తాజాగా బ్రిటన్ లాండ్‌స్కేప్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరించింది. ఈ అవార్డు కింద అతనికి రూ.10 లక్షల నగదు లభిస్తుంది. ఈ ఏరు వర్షం పడినప్పుడు మాత్రమే ఏర్పడుతుందట. మామూలు సమయంలో ఉండదట. ఓ రోజు అర్ధరాత్రి ఆ ప్రాంతంలో భారీ వర్షం పడిందన్న విషయం తెలుసుకున్న మార్క్ అదే రోజు అర్ధరాత్రి 1.30 సమయంలో అక్కడికి చేరుకుని.. ఫొటో కోసం తెల్లారేదాకా వేచి చూశారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement