ఆది.. అంతం.. అవార్డు..
ఎక్కడో పర్వతాల్లో పుట్టిన ఏరు పారుతూ.. పర్వత పాదాలను తాకుతూ అంతర్థానమైపోతున్న అద్భుత దృశ్యం. స్కాట్లాండ్లోని గ్లెన్‌కో పర్వతాల్లో పారుతున్న ఈ ఏరు ఆది.. అంతాన్ని ఒకే ఫొటోలో బంధించారు బ్రిటన్‌లోని కంబ్రియాకు చెందిన ఫొటోగ్రాఫర్ మార్క్ లిటెజాన్. వర్షపు నీటి వల్ల ఏర్పడిన ఈ ఏరు మొత్తాన్ని ఒకే ఫొటోలో క్లిక్‌మనిపించిన మార్క్‌కు తాజాగా బ్రిటన్ లాండ్స్కేప్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరించింది. ఈ అవార్డు కింద అతనికి రూ.10 లక్షల నగదు లభిస్తుంది. ఈ ఏరు వర్షం పడినప్పుడు మాత్రమే ఏర్పడుతుందట. మామూలు సమయంలో ఉండదట. ఓ రోజు అర్ధరాత్రి ఆ ప్రాంతంలో భారీ వర్షం పడిందన్న విషయం తెలుసుకున్న మార్క్ అదే రోజు అర్ధరాత్రి 1.30 సమయంలో అక్కడికి చేరుకుని.. ఫొటో కోసం తెల్లారేదాకా వేచి చూశారట.