క్యూకాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్‌లో నీటిని తొలగించే పనులు చేస్తున్న కూలీలు
యాదగిరిగుట్ట: ఇటీవల కురిసిన భారీ వర్షానికి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ పరిసరాలు, క్యూలైన్లు చెల్లాచెదురైన విషయం తెలిసిందే. క్యూలైన్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో వర్షం నీటితోపాటు చెత్తాచెదారం చేరింది. ప్రత్యేక సిబ్బందితో చెత్తాచెదారం తొలగించడంతోపాటు మట్టిని తీసి పక్కన పోస్తున్నారు. వర్షపునీరు లీకవుతున్న ప్రధానాలయం మండపాలకు మరమ్మతులు చేస్తున్నారు.
శిల్పులు వాటర్ క్యూరింగ్ పనులను చేపట్టారు. ఆలయ సన్నిధిలో కుంగిపోయిన స్టోన్ ఫ్లోరింగ్‌ను అధికారులు పరిశీలించి, వాటిని బాగుచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కొండపైనే గల విష్ణు పుష్కరిణి వద్ద మట్టి అంతా ఒకేచోటకు చేరడంతో దానిని కూడా తొలగిస్తున్నారు. కూలిపోయిన చలువ పందిళ్లను పునరుద్ధరిస్తున్నారు. కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి, రింగ్ రోడ్డు వంటి ప్రాంతాల్లో మరమ్మతులు చేయాల్సిన చోట్లను ఆర్‌అండ్ బీ అధికారులు పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment