వానలోనూ సౌరవిద్యుత్
బీజింగ్: సూర్య కాంతితోపాటు వర్షపు నీటి బిందువుల నుంచి కూడా విద్యుత్తును ఉత్పత్తి చేసే సౌరఘటాలను చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వర్షాకాలంలో తక్కువ సూర్యకాంతి వల్ల ప్రస్తుతం వాడుతున్న సౌరఘటాలు విద్యుత్తును ఉత్పత్తి చేయలేవు. ఓషన్, యానాన్ నార్మల్ వర్సిటీ పరిశోధకులు తయారు చేసిన సౌరఘటాలతో దీన్ని అధిగమించొచ్చు.
కర్బన మూలకాలకు చెందిన ‘గ్రాఫేన్’ వాడి వీటిని తయారు చేశారు. విద్యుత్తుకు వాహకమైన గ్రాఫేన్‌పై వర్షపు నీరు పడినప్పుడు ధనావేశం ఉన్న అయాన్లు, ఎలక్ట్రాన్ల మధ్య బంధం ఏర్పడుతుంది. దీన్ని అనుసరించి గ్రాఫేన్ ఎలక్ట్రోడ్లను వాడి, నీటి బిందువుల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు.