వ్యాధుల కాలం వచ్చేసింది
ఖాళీ స్థలాల్లో నిలుస్తున్న నీరు
పట్టించుకోని అధికారులు
వర్ధన్నపేట : ఎండలతో ఉక్కిరిబిక్కిరిగా గడిపిన ప్రజలకు ఇటీవల కురుస్తున్న వర్షాలు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఈ వర్షాలతో వాతావరణం చల్లబడినప్పటికీ వ్యాధులు మాత్రం పొంచి ఉన్నాయి. వర్షపు నీరు నివాస గృహాల మధ్య ఉన్న ఖాళీ స్థలాల్లోకి వచ్చి చేరుతుండడంతో దోమలు, ఈగల ఉధృతి ఎక్కువై సీజనల్ వ్యా ధులు ప్రబలే ప్రమాదం ఉంది. గ్రామాల్లో నెలకొన్న పారి శుద్ధ్యంతో సీజనల్ వ్యాధులపై ఆందోళన పెరుగుతోంది.
లోపిస్తున్న పారిశుద్ధ్యం
వర్షాకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ పంచాయతీ అధికారులు పారిశుద్ధ్య నిర్వహణకు పూర్తిస్థాయి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో అంతర్గత రహదారుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. చినుకు పడితే చిత్తడిగా మారుతున్నాయి. మండలంలోని కొత్తపెల్లి, కట్య్రాల, ల్యాబర్తి, నందనం, బండౌతపురం, రాంధాన్‌తండా, డీసీతండాల్లో బురదనీరు రోడ్లపై చేరుతోం ది. ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్యం క్షీణిం చడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
వ్యాధులు ప్రబలే అవకాశం..
డ్రైయినేజీలు అస్తవ్యస్తంగా ఉండడం మూలంగా వర్షపు నీటితో చెత్తాచెదారం చేరుకుని వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం వర్షపు నీరు చెరువులు, కుంటలు, రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చేరుతున్నాయి. వర్ధన్నపేట, ల్యాబర్తి, కట్య్రాల గ్రామాల్లో పైప్‌లై న్ల లీకేజీతో వర్షపు నీరు తాగునీటిని కలుషితం చేస్తున్నాయి. వాటర్‌ట్యాంకుల క్లోరినేషన్ చేసిన దాఖలాలు కనిపించడం లేదు.
వేధిస్తున్న కార్యదర్శుల కొరత
మండలంలోని 24 గ్రామాల పర్యవేక్షణకు 13 మంది కార్యదర్శులు అందుబాటులో ఉన్నారు. ఒక్కో కార్యదర్శికి రెండు గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకున్నారు. కార్యదర్శుల పని ఒత్తిడితో పూర్తిస్థాయిలో పర్యవేక్ష ణ కరువైంది. గ్రామాల్లో పరిస్థితి సాధారణంగా ఉండగా, శివారు తండా ల్లో పారిశుధ్యం క్షీణించింది.
పాటించాల్సిన జాగ్రత్తలు
వర్షాకాలంలో కలుషిత నీటిని తాగకుండా ఉండాలి.వేడిచేసి చల్లార్చిన నీటిని తీసుకోవాలి.రాత్రి వేళల్లో దోమల బారి నుంచి రక్షించుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి.విషజ్వరాలు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉండడంతో జ్వరం సూచనలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.
ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం
గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాం. గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్‌లను నిర్వహిస్తున్నాం. వచ్చే నెల 2 వరకు అన్ని గ్రామాల్లో పర్యటి ంచి పారి శుద్ధ్య పనులను పూర్తిచేస్తాం. డ్రైనేజీ కాలువలు, నీరు నిల్వ ఉండే అవకాశం ఉన్న ప్రదేశాల్లో బ్లీచింగ్ చేస్తాం.
- శంకర్, ఈవోపీఆర్‌డీ