అస్సాంలోని లోక్‌ప్రియ గోపినాథ్ బోర్డొలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం(గువాహటి ఎయిర్‌పోర్ట్) జలపాతాన్ని తలపించింది. సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఎయిర్‌పోర్ట్ పైకప్పు నుంచి వర్షపు నీరు ప్రయాణికుల లాంజ్‌లోకి చేరింది. ఏసీ, లైట్ల రంధ్రాల నుంచి కారుతున్న వర్షపు నీటితో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.