రామచంద్రాపురం: ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, పదిమంది తీవ్ర గాయాలపాలయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలం జగన్నాథగిరి సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. రామచంద్రాపురం మండలం గల్ల గ్రామానికి చెందిన పది మంది అన్నవరం క్షేత్రానికి ఆటోలో బయలు దేరారు. ఆ ఆటో జగన్నాథగిరి మలుపులో అదుపు తప్పి ర్యాంపులోకి దూసుకెళ్లింది. దీంతో ఆటోలో ఉన్న ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.