
మాక్ ఒలంపిక్స్
రామచంద్రాపురం: రియో ఒలింపిక్స్ సందర్భంగా తీసుకొని మండల పరిధిలోని వెలిమెల గ్రామంలోని గాడియం ఇంటర్నేషనల్ పాఠశాలలో శనివారం మాక్ ఒలింపిక్స్ క్రీడాపోటీలను నిర్వహించారు. కార్యక్రమాన్ని పాఠశాల అడ్మిన్ సుధాకర్‌రెడ్డి, డైరెక్టర్ కీర్తిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పలు పోటీలు నిర్వహించారు. ఒలింపిక్స్‌కు సంబంధించిన విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారిణి అర్చన మాట్లాడుతూ రియో ఒలింపిక్స్ ఎలా ప్రారంభమయ్యాయే అదే మాదిరిగా ఇక్కడ కూడా ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.
అనంతరం పాఠశాల డైరెక్టర్ కీర్తిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. క్రీడల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. ఒలింపిక్స్‌పై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఒలింపిక్స్ జ్యోతిని సీఎస్ రెడ్డి వెలిగించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హేమ తదితరులు పాల్గొన్నారు. (ఒక్కటే ఫొటో)
రియో ఒలంపిక్స్, మాక్ ప్రోగ్రామ్, రామచంద్రాపురం
06పీటీసీ24: క్రీడాకారి అర్చనకు పుష్పగుచ్చం అందజేత