రామచంద్రాపురం (తూర్పుగోదావరి జిల్లా) : తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో శనివారం సాయంత్రం 6.30 గంటలకు ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ముచ్చుమిల్లి వీధిలోని సాయిబాబా ఆలయ సమీపంలో నివాసముండే వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది.
అయితే ఇంట్లో బాణాసంచా నిల్వ ఉంచడంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న వాణి అనే మహిళ తీవ్రంగా గాయపడింది. మంటలు వేగంగా చెలరేగడంతో ఇరుగుపొరుగువారు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. ఫైరింజన్ మంటలను ఆర్పుతోంది.
అగ్నిప్రమాదంలో మహిళకు తీవ్రగాయాలు
Published Sat, Jan 23 2016 7:55 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement