
ప్రమాదంలో ధ్వంసమైన బాణసంచా తయారీ కేంద్రాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: దీపావళి మందుగుండు సామగ్రి తయారు చేసే క్రమంలో ప్రమాదశాత్తూ పేలుడు సంభవించి ఇద్దరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలైన సంఘటన రాజమహేంద్రవరం లాలాచెరువు సుబ్బారావునగర్‌లోని దేవాడ ముత్యాలరెడ్డి ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. దీపావళి సామగ్రి తయారు చేస్తుండగా పేలుడు జరగడంతో ఒక్కసారిగా అగ్నికీలలు చుట్టుముట్టాయి.
ఈ ప్రమాదంలో దేవాడ ముత్యాల రెడ్డి, దేవాడ ధనలక్ష్మి, దేవాడ సూర్యకాంతం, దేవాడ వినయ్ రెడ్డి, దేవాడ దుర్గారెడ్డి, కర్రి వైష్ణవి తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనలో దేవాడ ధనలక్ష్మి (35) ఘటనా స్థలంలో మృతి చెందింది. సూర్యకాంతం, వైష్ణవి, వినయరెడ్డి, దేవాడ దుర్గారెడ్డి, పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని అర్బన్ జిల్లా ఎస్పీ షిమోషీ బాజ్‌పేయ్ సందర్శించి వివరాలు సేకరించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. 50వ డివిజన్ కార్పొరేటర్ గుత్తుల మురళీధరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment