
హైదరాబాద్: ఛత్రీనాక పీఎస్ పరిధి కందికల్ గేట్ వద్ద గురువారం అర్ధరాత్రి పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇద్దరు మృతి చెందగా, మరోకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు బెంగాల్‌కు చెందిన విష్ణు,జగన్నాథ్‌లుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ పేలుడుకు గల కారణాలను పరిశీలిస్తున్నారు. మృతులు పీవోపీ విగ్రహ తయారీ కార్మికులని పోలీసులు తెలిపారు.
అయితే, ఈ పేలుడులో కొత్తకోణం బయటపడింది. యువకులు గుంతలో టపాసులతోపాటు కెమికల్స్‌ను పెట్టి కాల్చడం వల్ల పేలుడు సంభవించిందని పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. విగ్రహ తయారీ పరిశ్రమలో బాణాసంచా కారణంగానే పేలుడు సంభవించిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించిన విషయం తెలిసిందే. పేలుడు ఘటనపై సమగ్ర విచారణ చేపట్టామని ఏసీపీ మజీద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment