ముగిసిన బాస్కెట్‌బాల్‌ టోర్నీ లీగ్‌ మ్యాచ్‌లు | basket ball leagh matches | Sakshi
Sakshi News home page

ముగిసిన బాస్కెట్‌బాల్‌ టోర్నీ లీగ్‌ మ్యాచ్‌లు

Published Tue, Jan 17 2017 11:03 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM

basket ball leagh matches

  • నేడే సెమీఫైనల్స్, ఫైనల్స్‌ 
  • రామచంద్రపురం :
    పట్టణంలో నిర్వహిస్తున్న ఐదో జాతీయస్థాయి బాస్కెట్‌బాల్‌ టోర్నమెంట్‌లో లీగ్‌మ్యాచ్‌లు మంగళవారం ముగిశాయి. ఈ పోటీలు స్థానిక కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న విషయం తెలిసిందే. పురుషుల ప్రిలిమినరీ పోటీల్లో గుడివాడపై మార్టేరు జట్టు, ఏపీ పోలీస్‌ జట్టుపై రామచంద్రపురం ఎ, ఆర్‌బీఐ రాజమండ్రిపై రాయుడు వారియర్స్‌ ఒడిశా, అట్లరీ బాయిస్‌ హైదరాబాద్‌పై ఈస్ట్‌కోస్టు విశాఖ, ఎన్టీఆర్‌ గుంటూరుపై సాయిరాజ నందిని ఛత్తీస్‌గఢ్, రామచంద్రపురం బి జట్టుపై అనంతపురం, అమలాపురంపై తెలంగాణ పోలీస్, జి మామిడాడ జట్టుపై ఏఓసీ హైదరాబాద్‌ జట్లు విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. కాగా క్వార్టర్‌ ఫైనల్స్‌లో మార్టేరు జట్టు రామచంద్రపురం ఎ జట్టుతోను, రాయుడు వారియర్స్‌ ఒడిశా జట్టు ఈస్ట్‌కోస్టు విశాఖ, అనంతపురం జట్టు సాయిరాజ నందిని చత్తీస్‌గఢ్‌ జట్టుతోను, ఏఓసీ హైదరాబాద్‌ జట్టు తెలంగాణ పోలీస్‌ జట్టుతోను తలపడనున్నాయి. 
    మహిళల విభాగంలో..  మహిళల విభాగంలో సీపీఏ రాజమండ్రిపై మార్టేరు ఎన్టీఆర్‌ గుంటూరు జట్టు, ఆర్‌బీఐ రాజమండ్రిపై మార్టేరు జట్లు విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. మొత్తం పురుషుల విభాగంలో 36 జట్లు, మహిళల విభాగంలో 10 జట్లు పాల్గొన్న ఈ పోటీలలో ఇప్పటి వరకూ 46 లీగ్‌ మ్యాచ్‌లను నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచి క్వార్టర్‌ ఫైనల్స్‌తో పాటుగా సెమీ ఫైనల్స్‌ మ్యాచ్‌లకు కూడా నిర్వహిస్తారు. బాస్కెట్‌బాల్‌ అసోసియేష¯ŒS జిల్లా అధ్యక్షుడు సి స్టాలిన్, గన్నమని చక్రవర్తి పాల్గొన్నారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement