రామచంద్రాపురం, న్యూస్‌లైన్ : ఆర్సీ పురం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరుగుతున్న చైన్ స్నాచింగ్‌ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు ఐజీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం రామచంద్రాపురం డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించా రు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. పాత కేసు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. సబ్ డివిజన్ పరిధిలో జరుగుతున్న నేరాలు, కేసులు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రామచంద్రాపురం పట్టణ పరిధిలో జరుగుతున్న చైన్ స్నాచింగ్‌ల విషయం తన దృష్టి లో ఉందని, అందుకు సంబంధించిన విషయంపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.
దీనిపై ప్రజల్లో చైతన్యం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో నిఘాను పటిష్టం చేస్తున్నామన్నారు. రామచంద్రాపురం పటాన్‌చెరు పరిధిలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు పరిశీలనలో ఉందని తెలిపారు. మహబూబ్‌నగ ర్, ప్రకాశం జిల్లాల సరిహద్దులోని నల్లమల అ డవిలో ఓ దళం సంచరిస్తున్నట్లు అనుమానం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కవిత, సీఐలు శ్రీనివాస్, శంకర్‌రెడ్డి, భీంరెడ్డి,గంగాధర్, ఎస్‌ఐలు రవీందర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, వెంకట్, లోకేష్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
పటాన్‌చెరు పీఎస్ తనిఖీ చేసిన ఐజీ
పటాన్‌చెరు టౌన్ : శాంతి భద్రతల పరిరక్షణలో భా గంగా గ్రామాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు హైదరాబాద్ రేంజ్ ఐజీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపా రు. పోలీస్ స్టేషన్ల సాధారణ తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఆయన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ను సం దర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక పోలీస్‌స్టేషన్ పరిసరాలను, రికార్డులను పరిశీలించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. పోలీస్‌స్టేషన్ పని తీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. క్రైం రేటు అదుపులో ఉందన్నారు. దోపిడీ దొంగతనాలు, చైన్‌స్నాచింగ్, మర్డర్ కేసులు ఛేదించడంలో పోలీసు లు మంచి పనితీరును చూపుతున్నారని కొనియాడారు. గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి గ్రామానికి ఓ పోలీస్ నేతృత్వంలో రక్షణ కల్పిస్తామన్నారు. అతని ద్వారా ఎప్పటికప్పుడు పోలీస్‌స్టేషన్ అధికారికి సమాచారం అందుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్పీ విజయ్‌కుమార్, డీఎస్పీ కవిత, సీఐలు శంకర్‌రెడ్డి, మహబూబ్‌ఖాన్‌లు ఉన్నారు.
చైన్ స్నాచింగ్‌లపై ప్రత్యేక నిఘా
Published Sat, Dec 21 2013 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM
Advertisement
Advertisement