
నాలుగేళ్లు.. నానా సమస్యలు.. నా అన్నవారు లేక.. నేనున్నా అనేవారు లేక.. గుడ్ల నీరు బయటకు రానీయక.. నోట మాట లోపలికి మింగేస్తూ ఎన్నో వర్గాల ప్రజలు.. ఉగ్గబెట్టుకుని ఉన్న ఊపిరి వదలాలంటే భయపడిన వారే నేడు కట్టలు తెగిన ఆనందంతో ముందుకు ఉరుకుతున్నారు.. రాజన్న తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు పరుగుపరుగున వస్తున్నారు. రుణం తీర్చుకునే తరుణం ఇదే.. నీ వెంట మేమున్నాం నాలుగేళ్ల కంటకపాలన విముక్తి నీతోనే.. నిన్ను గెలిపించుకోవడం మా అవసరం. మహానేత సంరక్షణలో ఎంతో పొందిన తమను అస్పృçశ్యులుగా భావించి ఏ పథకాన్నీ అందుకోనీయకుండా మోకాలడ్డారు. ఆనాటి సంక్షేమ రాజ్యం నీతోనే అంటూ వెంట రాగా.. ప్రజా సంకల్ప యాత్ర సాగిస్తున్న జన హృదయాధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల సమస్యలు, వినతులూ వింటూ జగన్నాయకులపాలెం నుంచి రామచంద్రపురం వరకూ ముందుకు సాగారు.
Comments
Please login to add a commentAdd a comment