
సాక్షి, తూర్పుగోదావరి: తల్లి, కూతుళ్లు దారుణ హత్యకు గురైన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. రామచంద్రాపురం చప్పిడివారి సావరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను తల్లి బలుస మాధవి(45), కూతురు కరుణ(18)గా పోలీసులు గుర్తించారు. మాధవి స్థానిక నారాయణ పాఠశాలలో పనిచేస్తుంది. మృతురాలు భర్త, కుమారుడు కాకినాడలో ఒక హోటల్‌లో పని చేస్తున్నట్లు తెలిసింది. తెల్లవారు జామున ఈ హత్యలు జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. హత్యలకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే భార్య, కుమార్తెను భర్తే హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment