యువతిని వలగా వేసి దారుణ హత్య | Man Brutally Assassinated In East Godavari | Sakshi
Sakshi News home page

హనీట్రాప్‌ తరహాలో యువకుడి హత్య

Published Thu, Jun 25 2020 6:45 PM | Last Updated on Thu, Jun 25 2020 6:57 PM

Man Brutally Assassinated In East Godavari - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలో హనీట్రాప్‌ తరహాలో ఓ హత్య జరిగింది. భూతగాదాల నేపథ్యంలో యువతిని ఎరగా చూపి ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. కాకినాడలో గతేడాది డిసెంబర్‌ 8న ఈ హత్య జరగ్గా.. ఆసల్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాట్రేనికోన మండలం చెయ్యేరుకు చెందిన యువకుడు రామకృష్ణకు, అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌కు భూ తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యలో రామకృష్ణను హత్య చేయాలని శ్రీనివాస్‌ కుట్రపన్నాడు. యువతిని ఎరగా వేసి రామకృష్ణను ముగ్గులోకి దించాడు. (చదవండి : మైనర్‌ బాలికకు ముద్దు.. ఐదేళ్ల జైలు)

గతేడాది డిసెంబర్‌ 8న యువతి ద్వారా రామకృష్ణను కాకినాడకు రప్పించాడు. ప్లాన్‌ ప్రకారం రామకృష్ణను హత్య చేసి మృతదేహాన్ని అరట్లకట్ట సమీపంలో పంట కాల్వలో పడేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. రామకృష్ణ అదృశ్యంపై ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు కాట్రేనికోన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు స్పందించకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు.. రామకృష్ణ కాల్‌డేటా ఆధారంగా యువతిని, శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్‌, యువతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు పేర్కొన్నారు. (చదవండి : బిడ్డను విసిరి.. తనూ దూకి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement