రామచంద్రపురం: ప్రకృతి విపత్తులు, తెగుళ్ల మూలంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అత్యధికంగా పంటల బీమాను అందజేస్తుండటాన్ని పురస్కరించుకుని కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో అన్నదాతలు మంగళవారం వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలిపారు. 500 ట్రాక్టర్లతో 22 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించి ఆనందం వ్యక్తం చేశారు.
ఈ నియోజకవర్గంలో గత ఖరీఫ్ సీజన్‌లో తుపాను వల్ల రైతులు అత్యధికంగా నష్టపోయారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రత్యేకంగా అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించారు.
ఈనేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గతంలో ఎన్నడూ రాని విధంగా వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద ఈ నియోజకవర్గానికి రూ.130 కోట్లు విడుదలయ్యాయి. దీంతో రైతులు కె.గంగవరం మండలం పామర్రు నుంచి గొల్లపాలెం వరకు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. కష్టకాలంలో ప్రభుత్వం తమకు అండగా నిలిచిందని కొనియాడారు. మంత్రి తనయుడు నరేన్ ఈ ర్యాలీని ప్రారంభించారు.
బండెనక బండికట్టి..
Published Wed, Jun 15 2022 2:23 AM | Last Updated on Wed, Jun 15 2022 5:53 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment