రామచంద్రాపురం (తూర్పుగోదావరి జిల్లా) : తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం తాడిపల్లి ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. పాఠశాలలో వండిన భోజనాన్ని తిన్న వెంటనే విద్యార్థులకు వాంతులు అయ్యాయి. ఉపాధ్యాయులు 108కు ఫోన్‌చేసి విద్యార్థులను రామచంద్రాపురం ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రస్తుతం అక్కడ విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు.