రామచంద్రాపురం (తూర్పు గోదావరి) : గెయిల్ పాయింట్ నుంచి గ్యాస్ లీక్ కాకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలోని ఓదూరు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామంలోని గెయిల్ పాయింట్ నుంచి బుధవారం అర్థరాత్రి నుంచి గ్యాస్ లీకవుతోంది.
గురువారం ఉదయానికి గ్యాస్ గ్రామమంతటా వ్యాపించింది. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన ప్రజలు కాకినాడ- రామచంద్రాపురం రహదారిపై బైఠాయించారు. దీంతో పోలీసులు, గెయిల్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. గ్రామస్తులతో చర్చలు ప్రారంభించారు.
గ్యాస్ లీకేజీపై గ్రామస్తుల ఆందోళన
Published Thu, Aug 13 2015 4:56 PM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM
Advertisement
Advertisement