మువ్వన్నెల పతాకమా.. అందుకో నా వందనం | - | Sakshi
Sakshi News home page

మువ్వన్నెల పతాకమా.. అందుకో నా వందనం

Published Wed, Aug 16 2023 2:50 AM | Last Updated on Wed, Aug 16 2023 9:49 AM

- - Sakshi

రామచంద్రపురం రూరల్‌: దేశ స్వాతంత్య్రోద్యమ నేతల్లోని అగ్రగణ్యుల్లో ఒకరు.. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ దళపతి.. నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌. ద్రాక్షారామ ప్రధాన రహదారిపై ఆయన విగ్రహం సైనిక దుస్తుల్లో ఠీవీగా సెల్యూట్‌ చేస్తూ నిలబడి ఉంటుంది. బోసు బొమ్మ సెంటర్‌గా పేరొందిన ఆ ప్రాంతంలో నేతాజీ విగ్రహం ఎదురుగా ద్రాక్షారామ పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యాన మంగళవారం జాతీయ జెండా ఎగురవేశారు.

ఆ జెండాకు నేతాజీ సెల్యూట్‌ చేస్తున్నట్టుగా విగ్రహం వెనుక నుంచి పంచాయతీలో ట్యాంక్‌ వాచర్‌గా పని చేస్తున్న ఆకుల శ్రీనివాసరావు (ట్యాంకు శ్రీను) ఫొటో తీశారు. ఇది మంగళవారం బాగా వైరల్‌ అయ్యింది. ఈ ఫొటోను పలువురు తమ వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టుకున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
ఫొటో తీసిన ట్యాంకు శ్రీను 1
1/1

ఫొటో తీసిన ట్యాంకు శ్రీను

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement