దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రచార అస్త్రాలుగా చేసుకుని ఓటర్ల వద్దకు వెళ్తున్నట్టు వైఎస్సార్ సీపీ పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి జి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
రామచంద్రాపురం, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రచార అస్త్రాలుగా చేసుకుని ఓటర్ల వద్దకు వెళ్తున్నట్టు వైఎస్సార్ సీపీ పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి జి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సోమవారం ఆయన రామచంద్రాపురం పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని శ్రీనివాస్‌నగర్ కాలనీ, పాత రామచంద్రాపురంలో ఇంటింటి ప్రచారం చేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ దివంగత నేత వైఎస్సార్ పథకాలను ఓటర్లకు వివరిస్తున్నట్టు తెలిపారు.
పేదల సంక్షేమం కోసం మహానేత వైఎస్సార్ ఎన్నో పథకాలు, కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఎంతో మంది పేదలు ఉన్నత విద్యను అభ్యసించినట్టు తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లక్షల మంది కార్పొరేట్ వైద్యాన్ని అందుకున్నారన్నారు. ఇలాంటి ఎన్నో పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలు లబ్ధిపొందినట్టు ఆయన చెప్పారు. మహానేత పథకాలే తమను విజయ పథాన నిలుపుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సంజీవరావు, సారా శ్రీనివాస్, విఠల్, మురళి, సతీష్ పాల్గొన్నారు.