![Minister Chelluboina Venugopala Krishna Pada Puja For Sanitation Workers - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/15/Minister-Chelluboina-Venugo.jpg.webp?itok=jwCVrqMf)
పారిశుద్ధ్య కార్మికుల పాదాలను కడుగుతున్న మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ
రామచంద్రపురం(కోనసీమ జిల్లా): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పాదాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ శనివారం కడిగారు.
దుశ్శాలువాలు, పూలమాలలు, నూతన వ్రస్తాలతో ఘనంగా సత్కరించారు. వీరితో పాటు పోలీసులు, వైద్యులను కూడా సన్మానించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛతకు భోగి, స్వేచ్ఛతకు సంక్రాంతి, సేవకు గుర్తుగా కనుమ పండుగ జరుపుకొంటారని తెలిపారు.
చదవండి: పెళ్లయిన ఆ జంటలు.. ఇక ప్రత్యేక కుటుంబాలు
Comments
Please login to add a commentAdd a comment