భారీగా.. ‘తిరంగా’
భారీగా.. ‘తిరంగా’
Published Thu, Aug 25 2016 10:42 PM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM
‘భారతమాతకు జై, వందేమాతరం’ నినాదాలతో పట్టణం మారుమోగింది. ప్రధాని మోదీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీచేపట్టిన తిరంగా యాత్రలో భాగంగా గురువారం బీజేపీ, మోడరన్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో 1,100 అడుగు భారీ జాతీయ పతాకంతో పట్టణ వీధులలో చేసిన ప్రదర్శన ప్రజలలో ఉత్తేజాన్ని నింపింది. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు అయ్యాజీ వేమా, పార్టీ పట్టణ అధ్యక్షుడు కొట్టువాడ హరిబాబు, మోడరన్ అధినేత జీవీ రావుల నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి చిట్టిబాబు, తమలంపూడి రామకృష్ణ, కోన సత్యనారాయణ, జాస్తి విజయలక్ష్మి, చక్రవర్తి, బుల్లబ్బులు, అవసరాల వెంకటరమణ, ఆకేటి కృష్ణ, బండారు సూరిబాబు, సతీష్‌నాయుడు, వంజరపు రామకృష్ణ, సుందరసింగ్ తదితరులుపాల్గొన్నారు.
– రామచంద్రపురం
Advertisement
Advertisement