vandematharam
-
భారత క్రికెటర్ల వందేమాతర గీతాలాపన.. గూస్ బంప్స్ రావాల్సిందే..!
టీమిండియా టీ20 వరల్డ్‌కప్ 2024 సాధించిన నేపథ్యంలో భారత దేశ వ్యాప్తంగా సంబురాలు జరుగుతున్నాయి. ఊరూ వాడా భారత క్రికెట్ జట్టు సాధించిన విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. టీమిండియా 13 ఏళ్ల తర్వాత వరల్డ్‌కప్ సాధించడంతో అభిమానులతో పాటు భారత క్రికెటర్ల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి. GOOSEBUMPS GUARANTEED...!!!! 😍- Team India singing 'Vande Maataram' with Wankhede crowd. 🇮🇳pic.twitter.com/SfrFgWr4x9— Mufaddal Vohra (@mufaddal_vohra) July 4, 2024నిన్న (జులై 4) జరిగిన వరల్డ్‌కప్ విన్నింగ్ పెరేడ్లో భారత ఆటగాళ్లు తమనుతాము మైమరిచిపోయి సంబురాల్లో మునిగిపోయారు. డ్యాన్స్‌లు, పాటలతో తెగ సందడి చేశారు. వాంఖడేలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో టీమిండియా ఆటగాళ్లను పట్టడానికి వీల్లేకుండా పోయింది. ప్రతి ఒక్క ఆటగాడు చిన్న పిల్లాడిలా మారిపోయి ఆనందంలో మునిగి తేలారు. వందేమాతర గీతాలపన సందర్భంగా భారత క్రికెటర్లు అభిమానులతో గొంతు కలపడం చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే. ఈ సందర్భంగా కోహ్లి, హార్దిక్ చాలా ఎమోషనల్ అయ్యారు. వీరిద్దరు దిక్కులు పిక్కటిల్లేలా వందేమాతర గీతాలాపన చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియోను ఎంతసేపు చూసినా చూడాలనిపించేలా ఉంది.THE DANCE OF ROHIT SHARMA, VIRAT KOHLI & PLAYERS AT WANKHEDE.🥹🏆- One of the Most beautiful Moments in Indian cricket history. ❤️ pic.twitter.com/IjBujoejgb— Tanuj Singh (@ImTanujSingh) July 5, 2024ఇదిలా ఉంటే, టీమిండియా 13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించుతూ యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2024ను సాధించిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్ విజయానంతరం భారత క్రికెట్ జట్టు నిన్న ఉదయం న్యూఢిల్లీకి చేరుకుంది. అక్కడ ప్రధానితో భేటి అనంతరం విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు ముంబైకు వచ్చింది. 11 ఏళ్ల అనంతరం ఐసీసీ ట్రోఫీ సాధించడంతో భారత క్రికెట్ జట్టుకు అడుగడుగునా నీరాజనాలు అందాయి. టీమిండియాకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ముంబైలో జరిగిన విన్నింగ్ పెరేడ్లో భారత క్రికెటర్లను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ముంబై నగర వీధులు భారత క్రికెటర్ల నామస్మరణతో మార్మోగాయి. విజయోత్సవ ర్యాలీ మెరైన రోడ్ గుండా సాగగా.. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. భారత క్రికెటర్లు ఓపెన్ టాప్ బస్ నుంచి జనాలకు అభివాదం చేశారు. విన్నింగ్ పెరేడ్ మెరైన్ రోడ్ గుండా వాంఖడే వరకు సాగింది. అనంతరం వాంఖడే స్టేడియంలో భారత క్రికెటర్లకు బీసీసీఐ ఆథ్వర్యంలో సన్మానం జరిగింది. భారత క్రికెటర్లను, వరల్డ్‌కప్‌ను చూసేందుకు వాంఖడే స్టేడియంకు జనాలు పోటెత్తారు. -
రవీంద్రుడి గడ్డపై పరాయివారు ఉండరు
కాంథీ(పశ్చిమబెంగాల్): వందేమాతరం అంటూ దేశాన్ని ఒక్కటి చేసిన నేల పశ్చిమబెంగాల్ అని, అలాంటి గడ్డపై ‘పరాయివారు’ అనే మాటలు వినిపిస్తున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వస్తే స్థానిక నాయకుడినే సీఎం చేస్తామని మోదీ తెలిపారు. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని కాంథీలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి నందిగ్రామ్‌లో మమతపై పోటీ చేస్తున్న సువేందు అధికారి కుటుంబానికి కాంథీ ప్రాంతంలో గట్టి పట్టుంది. మోదీ, బీజేపీ అగ్రనేత అమిత్ షాలను బెంగాల్‌కు పరాయివారంటూ టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని ఢిల్లీ, గుజరాత్‌లకు చెందిన పరాయివారు పాలించడాన్ని బెంగాలీలు అంగీకరించబోరని మమత ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అగ్ర నేతలను ఎన్నికల పర్యాటకులుగా అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. బకించంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ టాగోర్, సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయులు జన్మించిన బెంగాల్ గడ్డపై భారతీయులెవరూ పరాయి వారు కావని మోదీ వ్యాఖ్యానించారు. ‘మమ్మల్ని టూరిస్ట్‌లంటున్నారు. అవహేళన చేస్తున్నారు. రవీంద్రుడి బెంగాల్లో ప్రజలు ఎవరినీ పరాయివారుగా చూడరు’ అని పేర్కొన్నారు. దాడి చేశారంటూ తప్పుడు ఆరోపణలు చేసి నందిగ్రామ్ ప్రజలను మమత బెనర్జీ అవమానపర్చారని మోదీ విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని పథకాలను అవినీతి రహితంగా, పారదర్శకంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమబెంగాల్లో హింస, బాంబులు, తుపాకీల సంస్కృతిని రూపుమాపుతామన్నారు. ‘ఇంటి ముందుకు ప్రభుత్వం’ అని మమత ప్రచారం చేసుకుంటున్నారని, కానీ ఎన్నికల ఫలితాలు వెలువడే మే 2న ఆమె అధికారం కోల్పోయి ఇంటికి వెళ్లనున్నారని వ్యాఖ్యానించారు. తృణమూల్ ప్రభుత్వం రాష్ట్రానికి చీకటినే మిగిల్చిందని, బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధితో రాష్ట్రాన్ని బంగారు బంగ్లాగా మారుస్తామని హామీ ఇచ్చారు. -
వందేమాతరంకు ఆ హోదా ఇవ్వలేం
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ గీతం ‘జనగణమన’తో పాటుగా ‘వందేమాతరం’ గేయానికి కూడా సమాన హోదా ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. జాతీయ గీతం, జాతీయ గేయాలకు మరింత ప్రచారం కల్పించే విధంగా జాతీయ విధానాన్ని తీసుకురావాలంటూ కేంద్రాన్ని ఆదేశించాలని కూడా ఉపాధ్యాయ్ తన పిటిషన్లో కోరారు. అన్ని పాఠశాలల్లోనూ ఈ రెండు గీతాలను ఆలపించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించాలంటూ పిటిషనర్ హైకోర్టుకు విన్నవించారు. దీనికి ధర్మాసనం నిరాకరిస్తూ.. పిటిషన్‌ను తొసిపుచ్చింది. కాగా జాతీయ గీతంతో పాటు జాతీయ గేయాన్ని కూడా సమానంగా గౌరవించాలంటూ 2017లో ఢిల్లీ హైకోర్టులో ఇదే తరహా పిటిషన్ దాఖలయిన విషయం తెలిసిందే. అయితే భారతీయుల మదిలో ‘వందే మాతరం’ గేయానికి ప్రత్యేక స్థానం ఉందంటూ కేంద్రం ఈ పిటిషన్‌ను వ్యతిరేకించింది. ‘జన గణ మన’తో సమానంగా దీన్ని పరిగణించలేమని తేల్చిచెప్పింది. దీంతో ఢిల్లీ కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. -
కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు.. ఇదిగో సాక్ష్యాలు!
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న హిందూత్వ, జాతీయవాదాన్ని ఎలా త్రిప్పికొట్టాలో తెలియక కాంగ్రెస్ పార్టీ తికమక పడుతోంది. ఆవిర్భావం నుంచి పార్టీకి పునాదులుగా ఉన్న లౌకికవాదం, జాతీయవాదం, లింగ సమానత్వం, మానవ హక్కులకు తిలోదకాలిస్తోంది. అధికారం కోసం అంగలారుస్తూ బీజేపీకన్నా ఎక్కువగా ఆత్మవంచనకు పాల్పడుతోంది. జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ఓ విధానం, రాష్ట్రాల స్థాయిలో ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా మరో విధానం అంటూ కొత్త పాటను అందుకుంది. కాంగ్రెస్ పార్టీలో పేరుకుపోతున్న ఈ ద్వంద్వ ప్రమాణాలు మొట్టమొదటిసారిగా ప్రజల ముందు జనవరి మూడవ తేదీన బయటపడ్డాయి. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి యాభై ఏళ్లకు లోపున్న ఇద్దరు మహిళలు ప్రవేశించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు పాటిస్తున్న ‘నిరసన దినం’లో భాగంగా కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు నల్లబ్యాడ్జీలు ధరించి పార్లమెంట్‌కు వచ్చారు. పార్లమెంట్ ఆవరణలోనే వారిని సోనియాగాంధీ అడ్డుకుని ఆ బ్యాడ్జీలను తీసి వేయించారు. అయ్యప్ప ఆలయానికి సంబంధించిన నిరసన కేరళ వరకే పరిమితం కావాలని, జాతీయస్థాయిలో ఆడ, మగ మధ్య లింగ వివక్ష చూపకూడదని ఆమె హితవు చెప్పారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కుల ఆడవారిని అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పుడు పాలకపక్ష బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఒకే తీరుగా స్పందించాయి. ఇరు పార్టీలు తీర్పును హర్షించాయి. కేరళ భక్తులు తీర్పును వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగడంతో బీజేపీ ముందుగా ప్లేటు ఫిరాయించింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ప్లేటు ఫిరాయించింది. పదేళ్ల నుంచి యాభై ఏళ్ల లోపు మహిళలను అనుమతించరాదనే అయ్యప్ప ఆలయ సంప్రదాయాన్ని తాను గౌరవిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ జనవరి ఒకటవ తేదీన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇదే విషయమై రాహుల్ గాంధీని మీడియా ప్రశ్నించగా మహిళల పట్ల వివక్ష చూపకూడదన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని, కేరళ కాంగ్రెస్ ఈ అభిప్రాయంతో విభేదిస్తున్నదని, పార్టీ అభిప్రాయమే తనదని చెప్పారు. దీన్నే ద్వంద్వ ప్రమాణాలంటారు. వ్యక్తిగతంగా గాంధీల అభిప్రాయం ఏదైనా ఉండవచ్చు. దాన్ని ఎవరూ కాదనరు. జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఒకే అభిప్రాయం ఉండాలి. ఓటు రాజకీయాల కోసం ఏకాభిప్రాయాన్ని వదిలిపెట్టడమే ద్వంద్వ ప్రమాణాలను దగ్గరికి తీసుకోవడం అవుతుంది. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేస్తోంది. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రతి నెల మొదటి రోజు రాష్ట్ర సచివాలయంలో ‘వందేమాతరం’ గీతాలాపనను రద్దు చేశారు. గీతాలాపన చేయడమే దేశభక్తికి రుజువు కాదంటూ 2005 సంవత్సరం నుంచి బీజేపీ ప్రభుత్వం ఆచరిస్తున్న సంప్రదాయాన్ని ఆయన పక్కన పడేశారు. ఇక ప్రతినెల బీజేపీ శాసన సభ్యులు ఈ సంప్రదాయాన్ని పాటిస్తారని మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌవాన్ ప్రకటించగానే కమల్ నాథ్ మాట మార్చారు. మరింత మెరుగ్గా ‘వందేమాతరం’ గీతాలాపన ఉండాలన్న ఉద్దేశంతోనే తాను దీన్ని వాయిదా వేశానంటూ సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసు బ్యాండుతో ఓ కిలోమీటరు మార్చింగ్తో వందేమాతరం గీతాలాపనను ప్రవేశపెట్టారు. రాజస్థాన్‌లో పశువులను అక్రమంగా తరలించారన్న అనుమానంపైన సాగిర్ ఖాన్ అనే ముస్లిం యువకుడిని ఇటీవల ఓ హిందూత్వ మూక అన్యాయంగా కొట్టి చంపేస్తే అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ మౌనం పాటించింది. గతంలోనయితే కాంగ్రెస్ నాయకులు బాధితుడి ఇంటికెళ్లి పరామర్శించేవారు, నిరసన యాత్ర జరిపేవారు. హిందూ అగ్రవర్ణాలను ఆకట్టుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీ తన సిద్దాంతాలకు తిలోదకాలిస్తోందని అర్థం అవుతోంది. కానీ ద్వంద్వ ప్రమాణాల వల్ల కొత్త వర్గాల మద్దతు లభిస్తుందో, లేదో చెప్పలేంగానీ ఉన్న వర్గాల మద్దతు ఊడిపోయే ప్రమాదం ఉంటుందన్నది మరచిపోరాదు. -
భారీగా.. ‘తిరంగా’
‘భారతమాతకు జై, వందేమాతరం’ నినాదాలతో పట్టణం మారుమోగింది. ప్రధాని మోదీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీచేపట్టిన తిరంగా యాత్రలో భాగంగా గురువారం బీజేపీ, మోడరన్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో 1,100 అడుగు భారీ జాతీయ పతాకంతో పట్టణ వీధులలో చేసిన ప్రదర్శన ప్రజలలో ఉత్తేజాన్ని నింపింది. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు అయ్యాజీ వేమా, పార్టీ పట్టణ అధ్యక్షుడు కొట్టువాడ హరిబాబు, మోడరన్ అధినేత జీవీ రావుల నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి చిట్టిబాబు, తమలంపూడి రామకృష్ణ, కోన సత్యనారాయణ, జాస్తి విజయలక్ష్మి, చక్రవర్తి, బుల్లబ్బులు, అవసరాల వెంకటరమణ, ఆకేటి కృష్ణ, బండారు సూరిబాబు, సతీష్‌నాయుడు, వంజరపు రామకృష్ణ, సుందరసింగ్ తదితరులుపాల్గొన్నారు. – రామచంద్రపురం