గుమ్మడిలా.. బొప్పాయి ఇలా..
ఇది గుమ్మడి కాయ అనుకుంటున్నారా.. కాదు. ఇది బొప్పాయి. కానీ గుమ్మడి కాయ ఆకారంలో ఉంది. చెట్టుకు ఉన్నప్పుడు చూస్తేనే ఇది బొప్పాయి కాయ అని గుర్తు పట్టగలం. చెట్టు నుంచి కోస్తే మాత్రం అచ్చం గుమ్మడి కాయలా కనిపిస్తోంది.
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పశివేదల గ్రామంలో కొప్పినీడి రాజబాబు ఇంటి పెరట్లోని చెట్టుకు అచ్చం గుమ్మడి కాయల్ని పోలిన బొప్పారుులు కాస్తున్నారుు. ఏటా 50 వరకూ ఇదే తరహాలో కాయలు కాస్తున్నాయని రాజబాబు చెప్పారు.