అక్రమ కేసులకు భయపడం
► వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్ జగన్ మాటల్లో తప్పేముంది?
► మృతులకు రూ.20 లక్షలు పరిహారం ఇవ్వాల్సిందే
► వనజాక్షి విషయంలో ఈ దూకుడేది..?
► డీఎన్నార్ ఆధ్వర్యంలో నిరసనలు
కైకలూరు : నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు బలితీసుకున్న దారుణఘటనపై నిలదీసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డిపై కేసు నమోదు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని, అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) డిమాండ్ చేశారు. అక్రమ కేసులను నిరసిస్తూ నియోజకవర్గవ్యాప్తంగా కైకలూరు, మండవల్లి, కలిదిండి, ముదినేపల్లి మండల కేంద్రాల్లో ఉద్యమించారు. కైకలూరులోని పార్టీ కార్యాలయం నుంచి నల్లబ్యాడ్జీలు ధరించి తాలూకా సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వరకు గురువారం ర్యాలీ చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డీఎన్నార్ మాట్లాడుతూమృతిచెందిన కుటుంబాలు, బాధితుల పక్షాన నిలదీసిన జగన్‌పై అధికార పార్టీ నాయకులు బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
కేవలం దివాకర్ బస్సు ట్రావెల్స్‌కు మేలు చేసే విధంగా అధికార చర్యలు ఉన్నాయన్నారు. ఒక్కో మృతుని కుటుంబానికి రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు. జగన్‌పై కేసులు ఎత్తివేసి క్షమాపణ చెప్పకపోతే దశలవారీ అందోళన చేస్తామని హెచ్చరించారు. జిల్లా పార్టీ కార్యదర్శి బొడ్డు నోబుల్ మాట్లాడుతూ మహిళా తహసీల్దార్ వనజాక్షిని ఈడ్చుకువెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై రెవెన్యూ సంఘాలు ఏం చర్యలు తీసుకున్నాయని ప్రశ్నించారు. పార్టీ మైనార్టీ నాయకులు అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ జలీల్‌ఖాన్ ఏ పార్టీ నీడన బతికారో మరచిపోయి స్థాయికి మించి మాట్లాడుతున్నారన్నారు. పంజా రామారావు, మీగడ వెంకట కృష్ణారావు, నున్న రాంబాబు, తోట శేషవేణి, సలార్, దండే రవిప్రకాష్, బండి ప్రసాద్, విక్టర్, శ్యామలా, రహంతుల్లా, ఎంపీటీసీ ఆదినారాయణ, సంజీవరావు, జయరాజు, తాతాలు, అజ్మిత్‌భాషా, బాలమ్మ, రాఘవులు పాల్గొన్నారు.
న్యాయ విచారణ చేపట్టాలి...
దివాకర్ బస్సు ప్రమాదఘటనపై న్యాయ విచారణ చేయించాలని పార్టీ జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కందుల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. వైఎస్.జగన్‌పై అక్రమ కేసును నిరసిస్తూ కలిదిండిలో ఉద్యమించారు. నాయకులు ఛాంద్ భాషా, పంతగాని విజయ్, యలవర్తి శ్రీనివాసరావు, యాళ్ళ జీవరత్నం, సమయం సత్యనారాయణ కార్యకర్తలు పాల్గొన్నారు.
కేసు ఎత్తివేయాలి....
మండవల్లి : చంద్రబాబు నిరంకుశ పాలన ఎన్నాళ్లో సాగదని పలువురు వైఎస్సార్ సీపీ నేతలు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చేబోయిన వీర్రాజు,ఎంపీపీ సాకా జసింత, వైస్ ఎంపీపీ యార్లగడ్డ సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యులు బోనం శేషగిరి, పెరుమాళ్ళ కొండారెడ్డి, మాజీ ఎంపీటీసీసభ్యుడు పెరుమాళ్ళ పెదవెంకటేశ్వర రెడ్డి, బేబీసరోజిని, చొప్పరపు
నాగబ్రహ్మారావు కార్యకర్తలు పాల్గొన్నారు.
బాబూ.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే...
ముదినేపల్లి రూరల్ : వైఎస్సార్ సీపీ అధినేతగా, ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వై.ఎస్.జగన్ మోహనరెడ్డిపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నిమ్మగడ్డ భిక్షాలు, మండల కన్వీనర్ బడుగు భాస్కరరావు స్పష్టం చేశారు. పార్టీ ముఖ్యనేతలు బాబూ రాజేంద్రప్రసాద్ ,బేతపూడి వెంకటరమణ, షేక్ అల్లాభక్షు, బండి నాగరాజు, దాసరి శ్రీను, నేతలు పెద్దిబోయిన శివనాగరాజు, కట్టా వెంకటేశ్వరరావు, వర్రే నాగేంద్ర, బోయిన బోసు, గంటా సంసోను, దండే మోక్షానందం, దేవకోటి వెంకటేశ్వరరావు,కార్యకర్తలు పాల్గొన్నారు.