కృష్ణాజిల్లా కైకలూరు మండలంలోని ఆటపాక పక్షుల విహార కేంద్రంలో అరుదైన తెల్ల పెలికాన్ పక్షి ఆదివారం సందడి చేసింది. ఏటా ఈ పక్షి యూరప్, ఆఫ్రికా దేశాల నుంచి ఆటపాక పక్షుల కేంద్రానికి వస్తూంటుంది. ఈ అతిథి పక్షిని రోజీ పెలికాన్, అమెరికా పెలికాన్ అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం పెలికానుస్ ఒనోక్రొటలూస్. ఇది 140 నుంచి 180 సెంటీ మీటర్ల వెడల్పు, 47 సెంటీ మీటర్ల ఎత్తు, 15 కిలోల బరువు ఉంటుంది. శీతాకాలంలో ఈ పక్షులు ఇండియా, చైనా, మయన్మార్‌కు వస్తూంటాయి. ఇటీవల గుంటూరు జిల్లా ఉప్పలపాడులో కూడా తెల్ల పెలికాన్ సంచరిస్తున్నట్లు గుర్తించారు.
–ఆటపాక (కైకలూరు)
అతిథి పక్షి వచ్చేసింది..
Published Mon, Dec 18 2017 1:12 AM | Last Updated on Mon, Dec 18 2017 1:12 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment