
సాక్షి, కైకలూరు : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 157వ రోజు షెడ్యూల్ ఖరారైంది. బుధవారం ఉదయం ముదినేపల్లి శివారు నుంచి వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పెయ్యేరు, డాకరాం క్రాస్, కనుకొల్లు, పుట్ల చెరువు క్రాస్ మీదుగా లింగాల చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కు ప్రారంభంకానుంది. అక్కడి నుంచి పెరికగూడెం వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ ఎస్సీ సోదరులతో ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొంటారు. సమావేశం అనంతరం రాత్రికి వైఎస్ జగన్ ఇక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ముగిసిన పాదయాత్ర
జననేత వైఎస్ జగన్ 156వ రోజు ప్రజాసంకల్పయాత్ర ముగిసింది. మంగళవారం వైఎస్ జగన్ పాదయాత్ర మల్లాయపాలెం క్రాస్, కాల్వపుడి అగ్రహరం క్రాస్ పెద్ద పాలపర్రు, కోడురు క్రాస్, చిన పాలపర్రు మీదుగా ముదినేపల్లి వరకు సాగింది. నేటి పాదయాత్రలో 8.1 కిలోమీటర్లు నడిచిన వైఎస్ జగన్ మొత్తం 1972.2 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు.