ఆక్వా రైతులకు అవగాహన
కావలిఅర్బన్ : ఆక్వా ల్యాబ్‌ను రైతులు సద్వినియోగం చేసుకుని ఆక్వా రంగంలో లాభాలు గడించాలని అవంతి ఫీడ్స్ జనరల్ మేనేజర్ పీకే శెట్టి సూచించారు. స్థానిక ఉదయగిరి బ్రిడ్జి క్రిస్టియన్‌పేట 3వ లైనులో బుధవారం అవంతి ఆక్వాల్యాబ్‌ను ప్రారంభించారు. అంతరం ల్యాబ్‌ను పరిశీలించి ఆక్వా రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఆయన మాట్లాడుతూ ల్యాబ్‌లో పీహెచ్, సెలినిటీ, అమ్మోనియా, ఆల్కాలినిటి, హార్డ్‌నెస్, విబ్రియో లోడ్స్ తదితర పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అవంతి ఫీడ్స్ డీజీఎం ఎస్.మొహంతి, కావలి ఏరియా మేనేజర్ కె.మురళీకృష్ణ, నాగేశ్వరరావుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎ.రమేష్ రెడ్డి, విజయశంకర్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.