-ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ డిమాండ్
హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతానికి చెందిన న్యాయమూర్తులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలని ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ డిమాండ్ చేసింది. సీమాంధ్ర ప్రాంత న్యాయమూర్తులారా క్విట్ తెలంగాణ అనే నినాదంతో ఫెడరేషన్ బుధవారం పోస్టర్‌ను ఆవిష్కరించింది. తెలంగాణకు వెంటనే హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రతి న్యాయవాదికి ఆరోగ్య భద్రత కార్డు, ఇళ్ల స్థలాలు, జూనియర్ న్యాయవాదులకు ఐదేళ్ల వరకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం, సంక్షేమ నిధిని రూ.100 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పెంచాలని అన్నారు. నేర విచారణ చట్టం సెక్షన్ 41(ఎ) నేరస్తులకు మేలు చేకూర్చే విధంగా ఉందని, ఈ సెక్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ లను కలిసి వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు.
ఆ న్యాయమూర్తులను ఏపీకి ఇవ్వండి
Published Wed, May 25 2016 7:46 PM | Last Updated on Thu, Mar 28 2019 5:34 PM
Advertisement
Advertisement