to quit
-
జెట్ ఎయిర్వేస్ సంక్షోభం : కీలక పరిణామం
సాక్షి, ముంబై : ప్రయివేటు రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ సంక్షోభంలో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. సంస్థ ఫౌండర్, ప్రధాన ప్రమోటర్ నరేష్ గోయల్ సంస్థనుంచి వైదొలగే అవకాశం ఉందని తెలుస్తోంది. నరేష్ గోయల్‌తోపాటు ఆయన భార్య అనితా గోయల్ కూడా బోర్డుకు రాజీనామా చేయనున్నారని తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. జెట్‌ఎయిర్‌వేస్ సంక్షోభంపై చర్చించేందుకు బోర్డు ఈ రోజు సమావేశం కానుంది. ఈ సమావేశం అనంతరం దీనిపై ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇవాల్టి సమావేశంలో ఒక కొత్త తీర్మానాన్ని కూడా ఆమోదించనున్నారు. తద్వారా నరేష్ గోయల్ సొంతమైన 51 శాతం వాటాను కన్సా ర్షియం సొంతం చేసుకుంటుంది. కొత్త కొనుగోలుదదారుకోసం అన్వేషించనుంది. అలాగే ఎస్బీఐ మాజీ ఛైర్మన్ మాజీ సీవీసీ కమిషనర్ జానకి వల్లభ్‌ను జెట్ ఎయిర్వేస్ బోర్డులోకి ఆహ్వానించనున్నారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న నరేష గోయల్ అక్కడినుంచే 23వేల ఉద్యోగులనుద్దేశించి ప్రసంగించనున్నారని సమాచారం. ఈ వార్తలు వాస్తవరూపం దాలిస్తే దాదాపు పాతికేళ్లపాటు సంస్థను విజయపధంలో నడిపించిన నరేష్ గోయల్ ప్రస్థానం ముగియనుంది. మరోవైపు ఇప్పటికే పలువురు సీనియర్ ఉన్నతాధికారులు సంస్థను వీడగా, వేతన బకాయిలు చెల్లించకపోతే తాము కూడా రాజీనామా బాట పట్టక తప్పదని పైలట్లు హెచ్చరించారు. అటు అద్దె బకాయిలు చెల్లించలేక , పైలట్లులేక రోజు రోజుకు జెట్ ఎయిర్వేస్ రద్దవుతున్న విమానాల సంఖ్య పెరుగుతోంది. కాగా సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న జెట్ ఎయిర్వేస్ మరింత తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రంతోపాటు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం నేతృత్వంలో భారీ రుణాలిచ్చిన బ్యాంకులు సంస్థను గట్టెక్కించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవలన సంస్థ మళ్లీ గాడిలో పడాలంటే నరేష్ గోయల్, ఆయన భార్య , మరో ఇద్దరు డైరెక్టర్లు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ సూచించిన సంగతి తెలిసిందే. -
హోదా కోసం అవసరమైతే కేంద్రంతో తెగతెంపులు
అమలాపురం ఎంపీ రవీంద్రబాబు అమలాపురం టౌన్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, లేకుంటే కేంద్రంతో తెగతెంపులకు కూడా సిద్ధమేనని అమలాపురం ఎంపీ డాక్టర్ పండుల రవీంద్రబాబు అన్నారు. అమలాపురంలోని జెడ్పీ అతిథి గృహంలో బుధవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంటులో జీఎస్టీ బిల్లు ఓటింగ్‌కు వచ్చినప్పుడు తాను మాట్లాడుతూ ఈ బిల్లుకు ఏపీ ఎంపీలమందరం మద్దతు ఇస్తాం... మీరు మాత్రం మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలోనూ ఇదే సహకారం అందించాలని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కోరానని తెలిపారు. వచ్చే నెలలో కోటిపల్లి–నరసాపురం రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా కోటిపల్లి–ముక్తేశ్వరం మధ్య గౌతమి నదిపై వంతెన నిర్మాణానికి టెండర్లు తెరుస్తారని ఎంపీ చెప్పారు. అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్ నిర్మాణంపై కసరత్తులు జరుగుతున్నాయన్నారు. చమురు సంస్థలు మత్స్యకారులకు ఇవ్వాల్సిన పరిహార నిధులు దాదాపు రూ.100 కోట్లు విడుదలయ్యేలా చర్యలు చేపడుతున్నట్టు ఎంపీ పేర్కొన్నారు. ఇటీవల దళితులపై దాడులు పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
హోదా కోసం అవసరమైతే కేంద్రంతో తెగతెంపులు
అమలాపురం ఎంపీ రవీంద్రబాబు అమలాపురం టౌన్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, లేకుంటే కేంద్రంతో తెగతెంపులకు కూడా సిద్ధమేనని అమలాపురం ఎంపీ డాక్టర్ పండుల రవీంద్రబాబు అన్నారు. అమలాపురంలోని జెడ్పీ అతిథి గృహంలో బుధవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంటులో జీఎస్టీ బిల్లు ఓటింగ్‌కు వచ్చినప్పుడు తాను మాట్లాడుతూ ఈ బిల్లుకు ఏపీ ఎంపీలమందరం మద్దతు ఇస్తాం... మీరు మాత్రం మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలోనూ ఇదే సహకారం అందించాలని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కోరానని తెలిపారు. వచ్చే నెలలో కోటిపల్లి–నరసాపురం రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా కోటిపల్లి–ముక్తేశ్వరం మధ్య గౌతమి నదిపై వంతెన నిర్మాణానికి టెండర్లు తెరుస్తారని ఎంపీ చెప్పారు. అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్ నిర్మాణంపై కసరత్తులు జరుగుతున్నాయన్నారు. చమురు సంస్థలు మత్స్యకారులకు ఇవ్వాల్సిన పరిహార నిధులు దాదాపు రూ.100 కోట్లు విడుదలయ్యేలా చర్యలు చేపడుతున్నట్టు ఎంపీ పేర్కొన్నారు. ఇటీవల దళితులపై దాడులు పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2 కోట్ల అసంఘటిత రంగ కార్మికులకు బీమా కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : రాష్ట్రంలోని 2 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులకు చంద్రన్న బీమా పథకంలో బీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ డి. వరప్రసాద్ తెలిపారు. ఆయన బుధవారం రాజమహేంద్రవరంలోని లా హాæస్పిన్ హోటల్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అసంఘటిత కార్మికులకు దేశంలో మొదటిసారిగా మన రాష్ట్రంలోనే బీమా సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. ఈ బీమా ద్వారా ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ. 5 లక్షల నగదు చెల్లిస్తారన్నారు. సాధారణ మరణానికి రూ. 30 వేలు ఇస్తారన్నారు. ప్రమాదంలో పూర్తి అంగవైకల్యం కలిగితే రూ. 5 లక్షలు, పాక్షిక, శాశ్వత అంగ వైకల్యం చెందితే రూ. 3.62 లక్షలు చెల్లిస్తారని తెలిపారు. అంతేకాకుండా ఆ కార్మికుల పిల్లలకు 9, 10, ఇంటర్, ఐఐటి చదివే వారికి సంవత్సరానికి రూ. 1,200 చొప్పున స్కాలర్ షిప్ అందజేస్తారన్నారు. చంద్రన్న బీమాలో నమోదు చేసుకున్నవారికి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా వివాహ కానుక, ప్రసూతి సహాయం, తాత్కాలిక ప్రమాద భృతి, వృత్తి నైపుణ్య శిక్షణ, అంత్య క్రియల సహాయం వంటి సదుపాయాలు కూడా లభిస్తాయన్నారు. ఎన్ఆర్ఈజీఎస్లో కూడా 50 రోజులు పని చేసిన కూలీలను భవన నిర్మాణ కార్మికులుగా పరిగణిస్తారని తెలిపారు. ఈ పథకం కింద కార్మికులకు చెల్లించాల్సిన బీమా ప్రీమియం మొత్తం రూ. 134 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందన్నారు. సర్వీసు ఛార్జీ కింద బీమాదారు కేవలం రూ. 15 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. అనంతరం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఆ న్యాయమూర్తులను ఏపీకి ఇవ్వండి
-ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ డిమాండ్ హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతానికి చెందిన న్యాయమూర్తులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలని ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ డిమాండ్ చేసింది. సీమాంధ్ర ప్రాంత న్యాయమూర్తులారా క్విట్ తెలంగాణ అనే నినాదంతో ఫెడరేషన్ బుధవారం పోస్టర్‌ను ఆవిష్కరించింది. తెలంగాణకు వెంటనే హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి న్యాయవాదికి ఆరోగ్య భద్రత కార్డు, ఇళ్ల స్థలాలు, జూనియర్ న్యాయవాదులకు ఐదేళ్ల వరకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం, సంక్షేమ నిధిని రూ.100 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పెంచాలని అన్నారు. నేర విచారణ చట్టం సెక్షన్ 41(ఎ) నేరస్తులకు మేలు చేకూర్చే విధంగా ఉందని, ఈ సెక్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ లను కలిసి వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు.